• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • NEW FEATURE IN WHATSAPP NOW YOU CAN IMPORT THIRD PARTY STICKER PACKS AK GH

WhatsApp New Feature: వాట్సాప్ సరికొత్త ఫీచర్.. ఇకపై అది మీరే చేసుకోవచ్చు..

WhatsApp New Feature: వాట్సాప్ సరికొత్త ఫీచర్.. ఇకపై అది మీరే చేసుకోవచ్చు..

WhatsApp New Feature: వాట్సాప్ సరికొత్త ఫీచర్.. ఇకపై అది మీరే చేసుకోవచ్చు

Whatsapp New Feature: ఈ ఫీచర్​ ప్రస్తుతం భారత్​, బ్రెజిల్, ఇరాన్, ఇండోనేషియాలోని వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ నూతన ఫీచర్​లో భాగంగా స్టిక్కర్​ మేకర్​ యాప్​ ద్వారా వినియోగదారులు సొంతంగా స్టిక్కర్లను తయారు చేసుకోవచ్చు.

  • Share this:
నూతనంగా ప్రవేశపెట్టిన ప్రైవసీ పాలసీ వివాదాస్పదమవ్వడం.. యూజర్లు చేజారిపోతుండటంతో వాట్సాప్​ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇటీవలి కాలంలో వరుసగా కొత్త ఫీచర్లను చేరుస్తూ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. దీనిలో భాగంగానే వాట్సాప్​ ఇప్పుడో సరికొత్త ఫీచర్​ను జోడించింది. ఇకపై వినియోగదారులు తమ స్టిక్కర్లను తామే తయారు చేసుకునే ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది. ముందుగా ఈ ఫీచర్​ను భారతదేశం, బ్రెజిల్, ఇండోనేషియా దేశాల్లోని ఆండ్రాయిడ్, iOS యూజర్లకు అందుబాటులోకి తేనున్నట్లు తెలిపింది. ఈ దేశాల్లోని వినియోగదారుల ఫీడ్​బ్యాక్​ను అనుసరించి మిగతా దేశాలకు విస్తరిస్తామని వాట్సాప్ ప్రకటించింది. కాగా, ఈ నూతన ఫీచర్​​ ఆండ్రాయిడ్ 2.21.3.19, తర్వాతి వెర్షన్​లు, ఐవోఎస్​ 2.21.31.2, తర్వాతి వెర్షన్​లలో అందుబాటులో ఉంటుందని WA BetaInfo తన నివేదికలో పేర్కొంది. దీనిపై తన నివేదికలో పేర్కొంటూ.. ‘‘చాలా కాలం నుంచి ఎదురుచూస్తోన్న కస్టమ్ యానిమేటెడ్ స్టిక్కర్ ప్యాక్‌లను డౌన్​లోడ్​ చేసుకునే అవకాశాన్ని వాట్సాప్​ తన యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది.

అయితే, ఈ ఫీచర్​ ప్రస్తుతం భారత్​, బ్రెజిల్, ఇరాన్, ఇండోనేషియాలోని వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ నూతన ఫీచర్​లో భాగంగా స్టిక్కర్​ మేకర్​ యాప్​ ద్వారా వినియోగదారులు సొంతంగా స్టిక్కర్లను తయారు చేసుకోవచ్చు. దాని కోసం స్టిక్కర్​ మేకర్​ యాప్​ను డౌన్​లోడ్​ చేసుకొని, మీ వీడియో లేదా GIFను ఎంచుకోవాలి. తర్వాత ఆ యాప్ దానంతట అదే స్టిక్కర్స్​ను తయారుచేస్తుంది. ఆయా స్టిక్కర్లు WEBP ఫైల్​ ఫార్మాట్​లో ఉండి వాట్సాప్​లో వినియోగించుకునేందుకు వీలుగా ఉంటాయి.” అని తెలిపింది. వినియోగదారులు స్టాటిక్, యానిమేటెడ్ స్టిక్కర్లను రూపొందించుకొని, ఆయా స్టిక్కర్లను డౌన్​లోడ్​ చేసుకునే క్రమంలో కొన్ని సమస్యలు రావొచ్చు.

అందువల్ల, యానిమేటెడ్​ స్టిక్కర్ ప్యాక్​లు, సాధారణ స్టిక్కర్​ ప్యాక్​లు విడివిడిగా ఇంపోర్ట్​ చేసుకోవాలని వాట్సాప్​ తెలిపింది. వినియోగదారులు రూపొందించుకున్న సొంత స్టిక్కర్​ ప్యాక్​లో కనీసం 3 స్టిక్కర్లు ఉండాలి. లేకపోతే ఆ స్టిక్కర్​ను డౌన్​లోడ్​ చేయడం సాధ్యం కాదు. సాధారణంగా స్టిక్కర్లు ఎక్కువ ఫైల్ పరిమాణాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల, స్టిక్కర్ మేకర్ మీ స్టిక్కర్ల ఫైల్​ సైజును ఆటోమేటిక్​గా కుదించడానికి మీకు సహాయం చేస్తుంది. తద్వారా క్వాలిటీతో కూడిన స్టిక్కర్లను రూపొందించవచ్చు.

ఒక్క టచ్​తో మ్యూట్​ వీడియో క్రియేట్​..
కాగా, వాట్సాప్​ ఇటీవలే మరో నూతన ఫీచర్​ను పరిచయం చేసింది. వీడియోలను షేర్​ చేసే సమయంలో ఒక్క టచ్​తో వాయిస్​ను మ్యూట్​​ చేసుకునే వెసులుబాటును కల్పించింది. ఈ నూతన ఆప్షన్​ ద్వారా వీడియోను షేర్​ చేసే సమయంలో అభ్యంతకర మాటలను తొలగించవచ్చు. అవసరమైతే మొత్తం ఆడియోను తీసేసి కూడా మాటలు లేని వీడియోను పంపే వెసులుబాటును కూడా అందించింది. ఈ ఆప్షన్​ను ఎవరైనా సులభంగా ఉపయోగించుకోవచ్చు. వాట్సాప్​లో అవతలి వ్యక్తికి వీడియో షేర్​ చేసే సమయంలో సౌండ్​ సింబల్​ కనిపిస్తుంది. ఆ సింబల్​ను మ్యూట్​ చేస్తే ఎటువంటి వాయిస్​ లేని వీడియో అవతలి వ్యక్తికి పంపబడుతుంది.
First published: