Whatsapp Features: ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్‌కు మారే వారికి వాట్స‌ప్ కొత్త ఫీచ‌ర్ ఇదే..

(ప్రతీకాత్మక చిత్రం)

ఫోన్ మార్చిన‌ప్పుడు ioS నుంచి శామ్‌సంగ్ ఆండ్రాయిడ్‌కు మారితే చాలా మంది వాట్స‌ప్(Whatsapp) మార్చేందుకు ఇబ్బంది ప‌డుతుంటారు. వారికోసం వాట్సప్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. దీని ద్వారా ఐఓఎస్ నుంచి ఆండ్రాయిడ్(Android)కు మారినా డేటా నష్టపోరు.

  • Share this:
    చాలా మంది వినియోగ‌దారులు ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్‌కు మారుతుంటారు. వారంద‌రికీ ఒకే స‌మ‌స్య వాట్స‌ప్ డేటా ఎలా కొత్త ఫోన్‌లోకి తీసుకోవాల‌ని. ఫోన్ మార్చిన‌ప్పుడు ioS నుంచి శామ్‌సంగ్ ఆండ్రాయిడ్‌కు మారితే చాలా మంది వాట్స‌ప్(Whatsapp) మార్చేందుకు ఇబ్బంది ప‌డుతుంటారు. దీని ద్వారా వారు దాచుకొన్న మెసేజ్‌లు, చాట్‌, స్టార్ సేవ‌డ్ మెసేజ్‌(Messages) లు ఇలాంటి వాట్స‌ప్ డేటా కోల్పోతామ‌నే భ‌యం ఉంది. దీనికి కార‌ణం IOS నుంచి ఆండ్రాయిడ్‌(Android) కి మారడం వలన మీ వాట్స‌ప్ అంతా క్లీన్ అవుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం దొర‌క‌లేదు. కానీ ఇప్పుడు వాట్స‌ప్ వినియోగ‌దారుల కోసం మీర వాట్స‌ప్‌లో చేసిన చాట్‌ల‌న్ని iOS నుంచి ఆండ్రాయిడ్‌కు ఏమీ కోల్పోకుండా ట్రాన్స్‌ఫ‌ర్ చేసే ఫీచర్‌(Feature)పై పనిచేస్తున్నట్లు వాట్సాప్ తన బ్లాగ్ పోస్ట్ ద్వారా ప్రకటించింది.

    ఐఫోన్ వినియోగదారులు తమ వాట్సాప్ డేటా(Whatsapp Date)ను ఇత‌ర ఓస్‌ స్మార్ట్‌ఫోన్‌కు బదిలీ చేయడానికి అవసరమైన అవసరాల యొక్క సుదీర్ఘ జాబితాను కూడా వాట్సాప్ అందించింది. ఈ జాబితాలో మొదటిది శామ్‌సంగ్ స్మార్ట్‌స్విచ్ యాప్. ఈ ఫీచ‌ర్ వినియోగించుకోవాలంటే ఈ శామ్‌సంగ్ ఫోన్‌లో 3.7.22.1 లేదా అంతకంటే ఎక్కువ వ‌ర్ష‌న్ వాట్స‌ప్‌ ఇన్‌స్టాల్ చేసి ఉండాలి.

    Realme Pad: సెప్టెంబ‌ర్ 9న మార్కెట్‌లోకి రియ‌ల్‌మీ ట్యాబ్‌.. ఫీచ‌ర్స్ ఇవే




    అలాగే మీ ఐఓఎస్ కూడా iOS 2.21.160.17 లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్ గ‌ల వాట్స‌ప్ క‌లిగి ఉండాలి. ఆండ్రాయిడ్ అయితే 2.21.16.20 లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్ ఉన్న వాట్సాప్ ఉండాలి. యూఎస్‌బీ-సీ(USB-C) టైప్ ఉండాలి
    ఇలా చేయాలి..
    - మొదట మీ శామ్‌సంగ్ కొత్త ఫోన్‌ను ఆన్ చేసి కేబుల్ ద్వారా ఐఫోన్‌కు కనెక్ట్ చేయాలి.
    - సూచ‌న‌లు అనుస‌రిస్తూ శామ్‌సంగ్ స్మార్ట్ స్విచ్ యాప్ ద్వారా ఐఫోన్ కెమెరాతో కొత్త పరికరంలో ప్రదర్శించబడే క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయండి.
    - అనంత‌రం ప్రక్రియ పూర్తయ్యే వరకు రెండు ఫోన్‌లు ఆన్‌లో ఉంచాలి.
    - అనంత‌రం ప్ర‌క్రియ పూర్త‌యి త‌ర్వాత‌ మీరు వాట్సాప్ ను ఓపెన్ చేసి మీరు మీ పాత పరికరంలో ఉపయోగిస్తున్న అదే నంబర్‌తో లాగిన్ అవ్వండి.
    - తరువాత ఇంపోర్ట్ డేటా ఎంపికపై నొక్కి.. ప్ర‌క్రియ పూర్త‌య్యే దాకా వేచి చూడాలి.
    ఈ టెక్నిక్ ఉపయోగించి వాట్సాప్ యూజర్లు తమ వాట్సాప్ అకౌంట్ సమాచారం, ప్రొఫైల్ ఫోటోలు, చాట్‌లు, గ్రూప్ చాట్‌లు, మీడియా మరియు సెట్టింగ్‌లను బదిలీ చేయవచ్చు. అయితే వారి కాల్ హిస్టరీ లేదా వాట్సాప్‌లోని కాంటాక్ట్‌లకు కనిపించే మీ డిస్‌ప్లే పేరు బదిలీ చేయబడదు.
    ప్ర‌స్తుతం ఈ ఫీచ‌ర్ కేవ‌లం ఆండ్రాయిడ్ 10(Android 10) ఆపై న‌డుస్తున్న శామ్‌సంగ్ ప‌రిక‌రాల‌కు మాత్ర‌మే వ‌ర్తిస్తుంది. భ‌విష్య‌త్‌లో మ‌రింత మెరుగైన ఫీచ‌ర్ అంద‌రికీ అందుబాటులో ఉండేలా వాట్స‌ప్ ప్ర‌య‌త్నిస్తుంది.
    Published by:Sharath Chandra
    First published: