NEW FEATURE IN FACEBOOK GROUPS ANOTHER NEW RESPONSIBILITY FOR ADMINS HERE IS THE DETAILS VB GH
Facebook: ఫేస్బుక్ గ్రూప్స్ లో కొత్త ఫీచర్.. అడ్మిన్లకు మరో కొత్త బాధ్యత.. వివరాలివే..
ప్రతీకాత్మక చిత్రం
facebook: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్బుక్ కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టడంలో వేగం పెంచింది. యూజర్ల కోసం కొత్త సదుపాయాలు తీసుకొస్తూ మరింత ఆకర్షిస్తోంది. ఇదే క్రమంలో తాజాగా గ్రూప్‌ల కోసం సూపర్ పీచర్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్బుక్ కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టడంలో వేగం పెంచింది. యూజర్ల కోసం కొత్త సదుపాయాలు తీసుకొస్తూ మరింత ఆకర్షిస్తోంది. ఇదే క్రమంలో తాజాగా గ్రూప్‌ల కోసం సూపర్ పీచర్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఫేస్బుక్లో ప్రస్తుతం గ్రూప్‌ల సంఖ్య పెరిగిపోతోంది. గ్రూప్‌ల్లో వేలాది మంది సభ్యులు ఉంటున్నారు. దీంతో గ్రూపులు ఎప్పుడు బిజీగా మారిపోతున్నాయి. గ్రూపుల్లో కొందరు మెంబర్లు ఎప్పటికప్పుడు సరైన సమాచారంతో సంబంధిత పోస్టులు సభ్యులతో షేర్ చేసుకుంటుంటారు. ఇలాంటి వారికి అడ్మిన్లు.. ప్రత్యేక గుర్తింపు ఇచ్చేలా ఫేస్బుక్ గ్రూప్ ఎక్స్పర్ట్ ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. ఇంత వరకు గ్రూప్‌లో అడ్మిన్‌కే ప్రత్యేక గుర్తింపు ఉండగా.. ఇక గ్రూప్ ఎక్స్పర్ట్ అనే కొత్త విధానం కూడా వచ్చేస్తోంది. అడ్మినే గ్రూప్‌లో సభ్యులను గ్రూప్ ఎక్స్‌పర్ట్‌గా ఎంపిక చేసే సదుపాయం ఉంటుంది. ఇప్పటికే కొన్ని గ్రూప్‌లకు ఫేస్బుక్ ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది.
“గ్రూప్‌లో అర్థవంతమైన పాత్ర పోషిస్తున్న సభ్యులను గుర్తించే సదుపాయాన్ని అడ్మిన్‌కు ఇస్తున్నాం. ఇష్టమైన సభ్యులను వారే గ్రూప్ ఎక్స్‌పర్ట్‌లుగా సెలెక్ట్ చేసుకోవచ్చు. వారితో కలిసి అడ్మిన్లు గ్రూప్‌లో తమ అభిప్రాయాలను పంచుకోవడంతో పాటు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లు నిర్వహించవచ్చు. ఇతర సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వొచ్చు” అని ఫేస్బుక్ ఎగ్జిక్యూటివ్ మారియా స్మిత్ తన బ్లాక్‌లో వెల్లడించారు. గ్రూప్‌లోని ఏ మెంబర్‌కైనా ఎక్స్పర్ట్ బ్యాడ్జ్ ఇచ్చేందుకు అడ్మిన్‌కు అవకాశం ఉంటుంది. అయితే ఎక్స్పర్ట్ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేయాలా.. రద్దు చేసుకోవాలా అన్నది ఆ మెంబర్ ఇష్టంగా ఉంటుంది. ఒకవేళ ఎక్స్పర్ట్ బ్యాడ్జి వద్దనుకుంటే అడ్మిన్ పంపిన రిక్వెస్ట్‌ను రిజెక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే ఎక్స్పర్ట్ బ్యాడ్జి వస్తుంది. దీని ద్వారా సరైన సమాచారం అందించే వారికి గ్రూప్ మెంబర్లు సులువుగా గుర్తించే అవకాశం ఉంటుంది.
అయితే ఎక్స్‌పర్ట్‌లుగా నియమించేందుకు నిర్దిష్ట ప్రక్రియను ఫేస్బుక్ సూచించలేదు. గ్రూప్ సభ్యుల్లో ఎవరినైనా ఎక్స్‌పర్ట్‌గా ఎంపిక చేసే అవకాశాన్ని అడ్మిన్ల చేతికి ఇచ్చేసింది. ఇది కొత్త ఫీచరే అయినా.. దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంటుందన్న ఆందోళనలు ఉన్నాయి. దీన్ని ఉపయోగించుకొని.. ఎక్స్పర్ట్ బ్యాడ్జిలతో కొందరు తప్పుడు సమాచారాన్ని విస్తృతం చేసే అవకాశం ఉంటుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. అయితే ప్రారంభంలో కొన్ని గ్రూప్‌లకే ఈ ఎక్స్పర్ట్ ఫీచర్‌ను ఇస్తామని, పరీక్షించిన తర్వాత పూర్తిస్థాయిలో రిలీజ్ చేస్తామని ఫేస్బుక్ అధికారి ఒకరు చెప్పారు. మరి ఈ ఫీచర్ కోసం ఫేస్బుక్ ఏమైనా నిబంధనలు తీసుకొస్తుందా లేదా కొన్ని ప్రముఖమైన గ్రూప్‌లకే ఈ ఎక్స్పర్ట్ ఫీచర్‌ను తీసుకొస్తుందా చూడాలి.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.