• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • NEW DATING SNACK ATTRACTING TIK TOK USERS BY GIVING SAME FEATURES AK GH

Snack Dating App: సరికొత్త డేటింగ్​ యాప్..​ స్నాక్ పేరుతో అందుబాటులోకి.. మిగతా వాటికి భిన్నంగా..

Snack Dating App: సరికొత్త డేటింగ్​ యాప్..​ స్నాక్ పేరుతో అందుబాటులోకి.. మిగతా వాటికి భిన్నంగా..

ప్రతీకాత్మక చిత్రం

ఈ డేటింగ్ యాప్​ ఫీచర్లన్నీ టిక్ టాక్ లాగే ఉంటాయి. సాధారణ డేటింగ్ యాప్స్ లో లాగా ఫోటోలను అప్‌లోడ్ చేయడానికి బదులుగా, స్నాక్ యూజర్లు చిన్న వీడియోలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

  • Share this:
సోషల్​ మీడియా విస్తరణ తర్వాత ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవడం దాదాపుగా తగ్గిపోయింది. ఆన్​లైన్​లోనే అన్నీ చక్కబెడుతున్నారు. ఇక డేటింగ్​ యాప్స్​ వచ్చాక మనకు తెలియని వారితో మాట్లాడటం పెరిగింది. ఇండియాలో ఉన్న అబ్బాయి ఇంగ్లండ్​ అమ్మాయితో ప్రేమలో పడుతున్నాడంటే దానికి కారణం డేటింగ్​ యాప్సే. అందుకే డేటింగ్స్​ యాప్స్​ను ఉపయోగించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజా ఐపిఓలో డేటింగ్ యాప్స్​ భారీ లాభాలను ఆర్జించడంతో, చాలా మంది పారిశ్రామికవేత్తలు డేటింగ్ యాప్స్​లో పెట్టుబడికి​ మొగ్గు చూపుతున్నారు. వీటిని మంచి ఆదాయ వనరుగా పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ‘స్నాక్’ అనే కొత్త డేటింగ్​ యాప్​ను రూపొందించింది కింబర్లీ కప్లాన్ అనే అమ్మాయి. ఇటీవల ప్రారంభించిన ఈ డేటింగ్ యాప్​ టిక్‌టాక్ లాంటి షార్ట్​ వీడియో యాప్​ల లాగే పనిచేస్తుంది.

టిండర్, బంబుల్ వంటి డేటింగ్ యాప్​లను ఉపయోగించే వినియోగదారుల అభిరుచిపై అధ్యయనం చేసి ఈ యాప్​ను రూపొందించారు. కింబర్లీ కప్లాన్​ ఇదివరకే 'ప్లెంటీ ఆఫ్ ఫిష్' అనే డేటింగ్ యాప్​తో కలిసి పనిచేసింది. ఆ అనుభవంతోనే స్నాక్​ యాప్​ను రూపొందించింది. దీనిపై ఆమె మాట్లాడుతూ ‘‘ముఖ్యంగా యువతరం డేటింగ్ వెబ్‌సైట్లు/ యాప్స్​ను ఉపయోగించి పార్ట్​నర్స్​ని ఏర్పర్చుకుంటున్నారు. తద్వారా, వారు ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ లేదా స్నాప్‌చాట్ వంటి ఇతర యాప్​లలో తమ సంబంధాలను కొనసాగిస్తున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని మా నూతన యాప్​లో సరికొత్త ఫీచర్లను చేర్చాం.’’ అని తెలిపారు.

ఎలా పని చేస్తుంది?
ఈ డేటింగ్ యాప్​ ఫీచర్లన్నీ టిక్ టాక్ లాగే ఉంటాయి. సాధారణ డేటింగ్ యాప్స్ లో లాగా ఫోటోలను అప్‌లోడ్ చేయడానికి బదులుగా, స్నాక్ యూజర్లు చిన్న వీడియోలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి స్టాటిక్ ఫోటోల ద్వారా స్వైప్ చేయడానికి బదులుగా, స్నాక్ యూజర్లు వారి వీడియోల ద్వారా అవతలి వ్యక్తిని ఆకర్షించవచ్చు. ఈ వీడియోలు ట్రాన్స్‌పరెన్సీ, ట్రస్ట్​ను ప్రోత్సహిస్తాయని స్నాక్ తన వెబ్‌సైట్​లో పేర్కొంది. ఇది ఇతర డేటింగ్ యాప్​ల కంటే భిన్నంగా పనిచేస్తుంది. ఈ యాప్​తో యూజర్లు వివిధ ప్రాంతాల్లోని వ్యక్తులతో కూడా పరిచయాలు ఏర్పర్చుకోవచ్చు.

టిక్‌టాక్ ప్రేరణతో..
స్నాక్ వ్యవస్థాపకురాలు కింబర్లీ కప్లాన్ న్యూస్‌ వీక్‌తో మాట్లాడుతూ ‘‘పాపులర్​ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫాం టిక్‌టాక్ యాప్​ ద్వారా ప్రేరణ పొంది ఈ యాప్​ను రూపొందించాం. ఒక రోజు, నేను టిక్‌టాక్‌లోని వీడియోలను స్క్రోల్ చేస్తున్నప్పుడు, నా ప్రొఫైల్ కి చాలా డేటింగ్‌ రిక్వెస్ట్​లు రావడం గమనించాను. అలాగే చాలామంది డేటింగ్ కోసమే ప్రత్యేకంగా టిక్ టాక్ లో ప్రొఫైల్స్ రూపొందించుకున్నారు. దీంతో టిక్​టాక్​ యూజర్లు ఇతరులతో డేటింగ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని గ్రహించాను. వారి అవసరాలను గ్రహించి కొత్త యాప్​ రూపొందించాలని భావించాను. ఇందులో భాగంగానే స్నాక్​ అనే ఈ నూతన డేటింగ్​ యాప్​ను రూపొందించాం." అని ఆమె చెప్పారు . ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ రెండింటి ఫీచర్లను ఈ ఒక్క యాప్​లో అందించడం ద్వారా ఆన్‌లైన్ డేటింగ్ ప్లాట్​ఫామ్​లో దూసుకుపోవాలని స్నాక్​ భావిస్తోంది.
First published: