పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో వాహనదారులకు ఊరటనిచ్చేలా కొత్త క్రెడిట్ కార్డును లాంచ్ చేసింది ఐసిఐసిఐ బ్యాంక్. హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్)తో చేతులు కలిపి కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డును లాంచ్ చేసింది. ఈ సూపర్ సేవర్ క్రెడిట్ కార్డు ఉపయోగించి హెచ్‌పీసీఎల్ పెట్రోలియం అవుట్లెట్ల వద్ద పెట్రోల్ కొట్టిస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అంతేకాదు హెచ్‌పీ పే యాప్ ద్వారా చెల్లింపులు చేసినట్లైతే అదనంగా 1.5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. వీసా భాగస్వామ్యంతో ఈ కార్డును ఆఫర్ చేస్తుండగా.. దీనికి రూ. 500 వార్షిక ఫీజు వసూలు చేస్తుంది. ఎన్నో ప్రయోజనాలున్న ఈ కార్డు గురించి తెలుసుకుందాం.
సూపర్ సేవర్ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలివే..
1) హెచ్‌పిసిఎల్ రిటైల్ అవుట్‌లెట్‌లో 4 శాతం క్యాష్‌బ్యాక్, 1 శాతం సర్‌చార్జ్ మినహాయింపుతో పాటు ఇంధన వ్యయంపై 5 శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తుంది.
2) హెచ్‌పిసిఎల్‌కు చెందిన ‘HP Pay’ యాప్ ద్వారా చేసే ఇంధన చెల్లింపులపై పేబ్యాక్ రివార్డ్ రూపంలో అదనంగా 1.5 శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తుంది.
3) విద్యుత్, మొబైల్ రీఛార్జ్ చెల్లింపులతో పాటు బిగ్ బజార్, డి-మార్ట్ వంటి ప్రధాన పెద్ద డిపార్ట్మెంటల్ స్టోర్స్‌లో కొనుగోళ్లపై 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ క్యాష్ బ్యాక్‌ను పేబ్యాక్ రివార్డ్ పాయింట్ల రూపంలో అందిస్తుంది.
4) స్థానిక దుకాణాలలో షాపింగ్, ఈ–కామర్స్ పోర్టళ్లలో చేసే చెల్లింపులపై ప్రయోజనాలు లభిస్తాయి. ఖర్చు చేసిన ప్రతి రూ. 100లకు 2 పేబ్యాక్ పాయింట్లను అందిస్తుంది.
5) వినియోగదారులకు జాయినింగ్ బెనిఫిట్ కింద 2,000 పేబ్యాక్ పాయింట్లు లభిస్తాయి. ఈ పేబ్యాక్ పాయింట్లు కార్డ్ యాక్టివేట్ అయిన సమయంలో కస్టమర్, పేబ్యాక్ ఖాతాకు యాడ్ అవుతాయి.
6) హెచ్‌పి పే యాప్ వాలెట్ ద్వారా రూ .1000 లేదా అంతకంటే ఎక్కువ చెల్లింపులు చేస్తే రూ .100 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
ఇవే కాకుండా వినియోగదారులకు 24 × 7 కాంప్లిమెంటరీ రోడ్‌సైడ్ అసిస్టెన్స్ వంటి ప్రయోజనాలు అందిస్తోంది. అంతేకాక రూ.1,50,000 వ్యయంపై వార్షిక రుసుము మినహాయింపు కూడా ఇస్తుంది. మరోవైపు కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ లభిస్తుంది. అంతేకాక బుక్‌మైషో, ఐనాక్స్‌లో మూవీ టికెట్ల బుకింగ్‌లపై డిస్కౌంట్ అందిస్తుంది. ఎలా దరఖాస్తు చేయాలంటే.. ఐసిఐసిఐ బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్ లేదా ఐమొబైల్ పే ద్వారా ‘ఐసిఐసిఐ బ్యాంక్ హెచ్‌పిసిఎల్ సూపర్ సేవర్ క్రెడిట్ కార్డ్’ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత డిజిటల్ కార్డును పొందవచ్చు. దీనితో పాటు ఫిజికల్ కార్డు కూడా అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే క్రెడిట్ కార్డ్ కలిగి ఉన్న కస్టమర్లు తమ ప్రస్తుత కార్డును ఐమొబైల్ పే, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ‘ఐసిఐసిఐ బ్యాంక్ హెచ్‌పిసిఎల్ సూపర్ సేవర్ క్రెడిట్ కార్డ్’కి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని బ్యాంక్ తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Airtel recharge plans, Credit cards, HPCL, Icici, Icici bank, JioMart, Petrol