Whatsapp Color Feature: వాట్స‌ప్‌లో కొత్త ఫీచ‌ర్ వ‌స్తోంది..

(ప్రతీకాత్మక చిత్రం)

రోజు కొత్త కొత్త ఫీచ‌ర్ల‌తో వాట్స‌ప్ వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకొంటుంది. ఇప్ప‌టికే వాట్స‌ప్‌లో ఎన్నో నూత‌న అప్‌డేట్‌లు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం న్యూ క‌ల‌ర్ స్కీం ( Whats app color scheme) అనే కొత్త ఫీచ‌ర్‌ను ప‌రిచ‌యం చేస్తోంది.

  • Share this:
    రోజు కొత్త కొత్త ఫీచ‌ర్ల‌తో వాట్స‌ప్ వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకొంటుంది. ఇప్ప‌టికే వాట్స‌ప్‌లో ఎన్నో నూత‌న అప్‌డేట్‌లు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం న్యూ క‌ల‌ర్ స్కీం ( Whats app color scheme) అనే కొత్త ఫీచ‌ర్‌ను ప‌రిచ‌యం చేస్తోంది. ఇప్ప‌టికే గ్రూప్ కాలింగ్‌, డేటా ట్రాన్స‌ఫ‌ర్‌, డిన్ అపీయ‌రింగ్‌, పేమెంట్స్ కొత్త స‌దుపాయాల‌ను వినియోదారులు వినియోగిస్తున్నారు. ప్ర‌స్తుతం కొత్త‌గా తీసుకొచ్చిన న్యూ క‌ల‌ర్ స్కీం సంబంధించిన టెస్టింగ్ కోసం బీటా టెస్ట‌ర్స్‌కు అవ‌కాశం క‌ల్పించిన‌ట్టు వాట్స‌ప్ (Whats app) తెలిపింది. ఈ ఫీచ‌ర్‌లో వాట్స‌ప్‌ని లైట్ అండ్ డార్క్ థీమ్స్(Dark Theme)  మార్చుకోవ‌చ్చ‌ని తెలిపింది. అలానే బ్యాక్‌గ్రౌండ్‌తోపాటు సెండ్ బ‌ట‌న్‌కూడా వినియించుకొనే అవ‌కాశం ఉంది.

    Android 12: అదిరిపోయే ఫీచర్లతో సిద్ధమవుతున్న ఆండ్రాయిడ్‌ 12.. ఎక్స్‌ప్రెషన్స్‌తోనే ఫోన్ కంట్రోల్


    ఇది ప‌ని చేసే విధానం చాలా సుల‌భంగా ఉంటుంది. వాట్స‌ప్ టాప్ బార్ సాధార‌ణంగా గ్రీన్ క‌ల‌ర్‌లో ఉంటుంది. అదే కొత్త ఫీచ‌ర్‌ను వినియోగిస్తే గ్రీన్ నుంచి గ్రే క‌ల‌ర్‌లోకి మారుతోంది. అంత కాకుండా టాప్ బార్‌తోపాటు బ్యాక్ గ్రౌండ్ మెసేజ్ బ‌బుల్స్‌, సెండ్ బ‌ట‌న్ ఛేంజ్ చేసుకొనే అవ‌కాశం ఉంది. డ‌బ్ల్యూఏ బీటా ఇన్ఫో ప్ర‌కారం ఈ కొత్త రంగు విధానంలో స్టేట‌స్ అప్‌డేట్స్‌, చాట్ షేర్ షీట్‌కు అన్యించుకోవ‌చ్చు. దీనితోపాటు మ‌రో బీటా వ‌ర్ష‌న్‌ను వాట్స‌ప్ తీసుకొచ్చే అవ‌కాశం ఉంది. ఆండ్రాయిడ్ (Android) వినియోగ‌దారులకు గ్రూప్ క్రియేష‌న్ డేట్‌ను ఇంట్ర‌డ్యూస్ చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం ఈ అవ‌కాశం బీటా యూజ‌ర్ల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉంది త్వ‌ర‌లో అంద‌రికీ అందుబాటులోకి తీసుకొచ్చే అవ‌కాశం ఉందని స‌మాచారం.
    Published by:Sharath Chandra
    First published: