Home /News /technology /

NEW APPLE IPHONE 13 SERIES SAID TO LAUNCH ON SEPTEMBER EVK

Apple iPhone 13: మార్కెట్లోకి ఐఫోన్ 13.. సెప్టెంబ‌ర్ 14 నుంచి ప్రీఆర్డ‌ర్ బుకింగ్‌

ఐఫోన్ 13 సిరీస్ డమ్మీ మోడల్స్. ( ఫోటో క్రెడిట్: Twitter/@SonnyDickson)

ఐఫోన్ 13 సిరీస్ డమ్మీ మోడల్స్. ( ఫోటో క్రెడిట్: Twitter/@SonnyDickson)

ప్ర‌ముఖ మొబైల్ త‌యారీ సంస్థ ఆపిల్ నెక్ట్స్ జ‌న‌రేష‌న్(Next Generation) ఐఫోన్ 13 సిరీస్‌కు సంబంధించి ప్రీఆర్డ‌ర్(Pre-order) బుకింగ్‌ను సెప్టెంబ‌ర్ 14, 2021న ప్రారంభించనున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ కొత్త సిరీస్(New Series) ఐఫోన్‌12 మాదిరిగానే కూడా ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్ వంటి మోడ‌ల్ రావొచ్చ‌ని మార్కెట్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

ఇంకా చదవండి ...
    ప్ర‌ముఖ మొబైల్ త‌యారీ సంస్థ ఆపిల్ నెక్ట్స్ జ‌న‌రేష‌న్ ఐఫోన్ 13 సిరీస్‌కు సంబంధించి ప్రీఆర్డ‌ర్(Preorder) బుకింగ్‌ను సెప్టెంబ‌ర్ 14, 2021న ప్రారంభించనున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ కొత్త సిరీస్ ఐఫోన్‌12 మాదిరిగానే కూడా ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్ వంటి మోడ‌ల్ రావొచ్చ‌ని మార్కెట్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ఫ్రంట్ పేజ్ టెక్ వెబ్‌సైట్ తెలిపిన స‌మాచారం ప్ర‌కారం ఆపిల్(Apple) ఐఫోన్ 13 సిరీస్ ఫోన్‌ల‌కు సంబంధించి సెప్టెంబ‌ర్ 24 నుంచి అమ్మ‌కాలు ప్రారంభించ‌వ‌చ్చ‌ని అంచనా వేస్తున్నారు.
    ఈ కొత్త ఐఫోన్ 13 మినీ మోడ‌ల్‌లో రెగ్యూల‌ర్ ఐఫోన్‌లానే డ్యూయ‌ల్(Dual) కెమెరాను క‌లిగి ఉంది. ఐఫోన్ 13 ప్రోలో ట్రిపుల్ కెమెరా(Camera)ను అందించారు. డ‌మ్మీ మోడ‌ల్స్‌లో కెమెరా మాడ్యూల్‌లో లేజ‌ర్ సెన్సాన్, ఎల్ఈడీ ఫ్లాష్‌లు ఉన్నాయి. ఐఫోన్ 12 ప్రో సెన్సార్‌లానే ఈ కొత్త ఫోన్‌లు(New Phones) లిడార్ సెన్సార్ ఉండే అవ‌కాశం ఉంది. ఐఫోన్ 13లో కూడా ప్రో మోడల్స్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తాయని అంచానా. ఇప్పటికే ఐప్యాడ్ ప్రో (2020, 2021) మోడళ్లలో “ప్రోమోషన్ డిస్‌ప్లే” ఫీచర్(Feature) ఇచ్చారు. ఐఫోన్ 13 సిరీస్‌లో కొత్త ఫేస్ అన్‌లాక్(Face unlock) టెక్ ఉంటుంది, అది ముసుగులు లేదా పొగమంచు గ్లాసెస్ ధరించినప్పుడు కూడా పనిచేస్తుంది.

    Windows PC Audio Problems: ల్యాప్‌టాప్ స్పీకర్లు పనిచేయడం లేదా? .. అయితే ఇలా చేయండి


    నెక్ట్స్ జ‌న‌రేష‌న్ ఐఫోన్‌లలో A15 బయోనిక్ చిప్‌సెట్, ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే (Always-On Display-AOD) ఉంటాయ‌ని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫీచ‌ర్ ఆపిల్ వాచ్‌ల‌లో అందుబాటులో ఉంది. బ్యాట‌రీ(Battery)పై ఎటువంటి ప్ర‌భావం చూప‌కుండా ఏఓడీ 129హెడ్జ్ రీఫ్రెష్ రేటును ఇస్తుంది. కొత్త జ‌న‌రేష‌న్(New Generation) మోడ‌ల్‌ల‌లో ఆపిల్ పవర్-ఎఫిషియంట్ LTPO డిస్‌ప్లేలను ఉపయోగించవచ్చ‌ని అంచనా.
    ఈ కొత్త మోడ‌ల్ ఫోన్‌లు వేగ‌వంత‌మైన 5జీ క‌నెక్టివిటీ(Connectivity) ఉంటుంద‌ని, వైఫై 6ఈ, రెండ నూత‌న క‌ల‌ర్ ఆప్ష‌న్‌లు(Options) ఉండ‌వ‌చ్చిన ప్ర‌చారం సాగుతోంది. వైర్లెస్ ఛార్జింగ్, వీడియో కోసం పోర్ట్రెయిట్ మోడ్ మరియు ఆటో ఫోకస్‌తో పాటు వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయ‌ని మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ సారి యాపిల్‌ 90 మిలియ‌న్ యాపిల్ ఫోన్‌ల‌ను త‌యారీ చేసేలా ల‌క్ష్యాన్ని ఎంచుకొన్న‌ట్టు స‌మాచారం ఇది గ‌తంలో స‌ర‌ఫ‌రా చ‌సిన 75మిలియ‌న్ ఫోన్‌ల క‌న్నా 20శాతం అధిక‌మైన ల‌క్ష్యంతో ప్ర‌ణాళిక చేస్తోంది. సెప్టెంబ‌ర్ మూడో వారంలో ఐఫోన్ 13 మార్కెట్‌(Market)లోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Apple

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు