Swiggy Daily: స్విగ్గీ నుంచి 'డైలీ' యాప్... ఇక రోజూ ఇంటి భోజనం

Swiggy Daily | మీరు ఈ యాప్‌లో ఒక నెలకు సబ్‌స్క్రైబ్ చేసుకున్నారంటే... నెల రోజుల పాటు ఇంటి భోజనం తినొచ్చు.

news18-telugu
Updated: June 4, 2019, 1:19 PM IST
Swiggy Daily: స్విగ్గీ నుంచి 'డైలీ' యాప్... ఇక రోజూ ఇంటి భోజనం
Swiggy Daily: స్విగ్గీ నుంచి 'డైలీ' యాప్... ఇక రోజూ ఇంటి భోజనం (image: Swiggy)
news18-telugu
Updated: June 4, 2019, 1:19 PM IST
మీకు రోజూ ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసే అలవాటు ఉందా? అయితే మీకు గుడ్ న్యూస్. 'డైలీ' పేరుతో స్విగ్గీ మరో యాప్ రిలీజ్ చేసింది. స్విగ్గీ ప్రారంభించిన సరికొత్త సర్వీస్ ఇది. రెస్టారెంట్ ఫుడ్ కాదు... యూజర్లకు ఇంటి భోజనం అందించేందుకు ఈ కొత్త యాప్ ప్రారంభించింది స్విగ్గీ. ప్రస్తుతం గురుగ్రామ్‌లో మొదలైన సర్వీస్ త్వరలో బెంగళూరు, ముంబై ప్రాంతాలకు విస్తరించనుంది. మీరు ఈ యాప్‌లో నెలకు, వారానికి మీరు సబ్‌స్క్రిప్షన్ తీసుకోవచ్చు. ఒక మీల్‌లో 30 రకాల ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. లంచ్‌తో పాటు టిఫిన్ సర్వీసులు కూడా ఉంటాయి. మీరు ఈ యాప్‌లో ఒక నెలకు సబ్‌స్క్రైబ్ చేసుకున్నారంటే... నెల రోజుల పాటు ఇంటి భోజనం తినొచ్చు.



డైలీ యాప్‌లో రోజూ ఇంటి భోజనం తెప్పించుకోవడం ద్వారా హోటల్ ఫుడ్ తింటున్నామన్న ఆందోళన అవసరమే లేదు. రాజస్తానీ, బెంగాలీ, గుజరాతీ, తమిళ్, తెలుగు లాంటి సంప్రదాయ వంటకాలన్నీ లభిస్తాయి. ప్యాకేజీని మీకు కావాల్సినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఏదైనా ఓ రోజు మీల్స్ వద్దనుకుంటే స్కిప్ చేస్తే చాలు. కొన్ని రోజులు సెలవుపెట్టి ఊరెళ్తున్నట్టైతే మీ సబ్‌స్క్రిప్షన్‌ని పాజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం 3 రోజులు, 7 రోజులు, 30 రోజుల సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.

Cricket Score: క్రికెట్ స్కోర్ ఎంత? ఈ యాప్స్‌లో చూడండి




ఇవి కూడా చదవండి:

Zomato: జొమాటో ఉద్యోగులకు గుడ్ న్యూస్... 26 వారాల పేరెంటల్ లీవ్
Loading...
Smriti Irani: వేలానికి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పీఎఫ్ సర్టిఫికెట్

Dish Tv Contest: క్రికెట్ కాంటెస్ట్‌లో గెలిస్తే ఒక నెల ఫ్రీ సబ్‌స్క్రిప్షన్

Xiaomi: షావోమీ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు బ్యాడ్ న్యూస్
First published: June 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...