Android 12: అదిరిపోయే ఫీచర్లతో సిద్ధమవుతున్న ఆండ్రాయిడ్‌ 12.. ఎక్స్‌ప్రెషన్స్‌తోనే ఫోన్ కంట్రోల్

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ 12 ఓఎస్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ వెర్షన్‌ అత్యంత త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఫేషియల్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో (ముఖకవళికలతో) ఫోన్‌ను కంట్రోల్ చేసే ఒక సరికొత్త యాక్సెసబిలిటీ ఫీచర్‌తో ఆండ్రాయిడ్‌ 12 రానుందని వార్తలు వస్తున్నాయి.

  • Share this:
కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునేందుకు గూగుల్‌ ప్రతి సంవత్సరం న్యూ ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ వెర్షన్‌ను రిలీజ్ చేస్తుంటుంది. ఇప్పటివరకూ 11 ఆండ్రాయిడ్ వెర్షన్‌లను విడుదల చేసింది. వీటిలో అద్భుతమైన ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్ యూజర్లకు మంచి ఎక్స్ పీరియన్సు అందించింది. ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ 12 ఓఎస్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ వెర్షన్‌ అత్యంత త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఫేషియల్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో (ముఖకవళికలతో) ఫోన్‌ను కంట్రోల్ చేసే ఒక సరికొత్త యాక్సెసబిలిటీ ఫీచర్‌తో ఆండ్రాయిడ్‌ 12 రానుందని వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం యాక్సెసబిలిటీ సూట్‌ యాప్ లోని 'కెమెరా స్విచెస్ ఫీచర్' లోనే ఫేషియల్‌ కంట్రోల్ ఫీచర్‌ను యాడ్ చేయడానికి గూగుల్ సన్నాహాలు చేస్తోందని ఎక్స్‌డీఏ(XDA) డెవలపర్స్‌ వెల్లడించింది. ఆండ్రాయిడ్ 12 అప్‌డేట్‌లో భాగంగా యాక్సెసబిలిటీ సూట్ యాప్ ఫేషియల్‌ కంట్రోల్ జెస్టర్స్(gestures)కు సపోర్ట్ చేయనుంది. అంగవైకల్యంతో బాధపడుతున్న వ్యక్తులు కూడా ఫోన్‌లను ఉపయోగించేందుకు వీలుగా ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్12లో అందిస్తున్నట్లు సమాచారం. ఈ సరికొత్త ఫీచర్‌తో.. నవ్వడం, నోరు తెరవడం, కుడివైపు, ఎడమవైపు లేదా కిందకు చూడటం వంటి ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఫోన్‌ను కంట్రోల్ చేయొచ్చు.

Sony Xperia: సోనీ ఎక్స్​పీరియా 10 III లైట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్.. అదిరిపోయే ఫీచర్లతో విడుదలైన 5జీ స్మార్ట్​ఫోన్​

Google Drive: గూగుల్​ డ్రైవ్‌లో స్టోరేజ్ ఫుల్ అయిందా? ఈ టిప్స్‌తో ఖాళీ చేయండి

ఫోన్ కెమెరా సాయంతో హోమ్‌పేజీకి వెళ్లడం, వెనుకకు, ముందుకు స్క్రోల్ చేయడం.. ఏదైనా యాప్ లేదా వీడియో సెలక్ట్ చేసుకోవడం వంటి వాటిని కేవలం ముఖకవళికలతోనే కంట్రోల్ చేయొచ్చు. యాక్సెసబిలిటీ సూట్‌ యాప్‌లో జెస్టర్స్ సైజు పెంచుకోవచ్చు.. అలాగే వాటి డ్యూరేషన్ కూడా పెంచుకోవచ్చు. అయితే ఈ ఫీచర్ వినియోగించాలి అంటే కెమెరా ఆన్ చేయాల్సి ఉంటుందట. ఈ ఫీచర్‌ వినియోగిస్తున్నప్పుడు నిటారుగా ఓ బార్ కనిపిస్తుంది. ఈ బార్ కెమెరా ఆన్ అయ్యి ఉందని తెలియజేస్తుంది. ఈ ఫీచర్ అదనపు బ్యాటరీని ఉపయోగిస్తుందని.. ఇది ప్రస్తుతం బీటా మోడ్‌లో అందుబాటులో ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి.

దాదాపు మూడు నెలల క్రితమే గూగుల్ మార్కెట్‌లోకి తీసుకొచ్చిన ఆండ్రాయిడ్ 12 బీటా వెర్షన్‌ను మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని వాటిలోని ఫీచర్లను ఆస్వాదించవచ్చు. ఇందుకు ఆండ్రాయిడ్ 12 బీటా వెబ్‌సైట్ లోకి వెళ్లి “view your eligible devices” పై క్లిక్ చేసి నమోదు చేసుకుంటే సరిపోతుంది. మీ ఫోన్ బీటా వెర్షన్‌కి సపోర్ట్ చేయకపోతే.. 'డౌన్లోడ్ నాట్ అవైలబుల్' అనే మెసేజ్ కనిపిస్తుంది.
Published by:Kishore Akkaladevi
First published: