హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Free Internet Offer: వావ్.. 2 నెలలు ఇంటర్నెట్ ఫ్రీ.. అదిరిపోయే ఆఫర్!

Free Internet Offer: వావ్.. 2 నెలలు ఇంటర్నెట్ ఫ్రీ.. అదిరిపోయే ఆఫర్!

Free Internet Offer: వావ్.. 2 నెలలు ఇంటర్నెట్ ఫ్రీ.. అదిరిపోయే ఆఫర్!

Free Internet Offer: వావ్.. 2 నెలలు ఇంటర్నెట్ ఫ్రీ.. అదిరిపోయే ఆఫర్!

Broadband | రెండు నెలలు ఉచితంగా బ్రాడ్‌బాండ్ సర్వీసులు పొందొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? ఒక కంపెనీ ఇలాంటి ఆఫర్ తీసుకువచ్చింది. తక్కువ ధరలోనే హైస్పీడ్ ఇంటర్నెట్ అందిస్తోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Internet | బ్రాడ్‌బాండ్ సర్వీసులు పొందాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. ఎందుకని అనుకుంటున్నారా? ఫాస్ట్ ఇంటర్నెట్‌ను (Net) రెండు నెలల పాటు ఉచితంగానే పొందొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ ఆఫర్ (Offer) గురించి తెలుసుకోవాల్సిందే. నెట్‌ప్లస్ బ్రాడ్‌బాండ్ తాజాగా ఉచిత సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది

నెట్‌ప్లస్ బ్రాడ్‌బాండ్ ద్వారా 1 జీబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ పొందొచ్చు. అలాగే ఈ కంపెనీ ట్రూలీ అన్‌లిమిటెడ్ ప్లాన్స్ అందిస్తోంది. మీరు ఎంచుకునే ప్లాన్ వాలిడిటీ ఆధారంగా మీకు నెల లేదా రెండు నెలల ఉచిత సేవలు పొందొచ్చు. మీరు ఉచితంగా నెట్‌ప్లస్ బ్రాడ్‌బాండ్ సర్వీస్ పొందాలని భావిస్తే.. లాంగ్ టర్మ్ ప్లాన్స్ సబ్‌స్క్రైబ్ చేసుకోవాలి. ఐదు నెలల డబ్బులు చెల్లిస్తే ఒక నెల ఉచితంగా సర్వీసులు లభిస్తాయి. అలాగే పది నెలలు సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే రెండు నెలలు నెట్ ఫ్రీగా వాడుకోవచ్చు.

రూ.1,700కే విమాన టికెట్.. రిపబ్లిక్ డే ఆఫర్ అదుర్స్!

అంతేకాకుండా ఓటీటీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మీరు బండిల్ సర్వీసులు కావాలంటే పొందొచ్చు. నెట్‌ప్లస్ బేసిక్ 100 ఎంబీపీఎస్ ప్లాన్ ధర రూ. 499 నుంచి ప్రారంభం అవుతోంది. దీని ద్వారా అపరిమిత డేటా వస్తుంది. అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. రూ. 499కే 100 ఎంబీపీఎస్ స్పీడ్ అంటే మంచి డీల్ అని చెప్పుకోవచ్చు. అదే జియో , ఎయిర్‌టెల్ విషయానికి వస్తే.. 100 ఎంబీపీఎస్ స్పీడ్ కోసం కస్టమర్లు జియో వాడుతూ ఉంటే రూ. 699 కట్టాలి. అదే ఎయిర్‌టెల్ ప్లాన్‌లో 100 ఎంబీపీఎస్ స్పీడ్ కోసం రూ. 799 చెల్లించాలి.

ఈ బ్యాంక్‌లో అకౌంట్ ఉన్న వారికి భారీ శుభవార్త!

ఈ విధంగా చూస్తే.. నెట్‌ప్లస్ ప్లాన్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అలాగే కస్టమర్లు రూ. 99 లేదా రూ. 199తో బండిల్ ఓటీటీ సర్వీసులు పొందొచ్చు. రూ. 99 ప్లాన్‌తో అయితే 10 యాప్స్, రూ. 199 అయితే 14 యాప్స్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. అందువల్ల జియో, ఎయిర్ టెల్ కన్నా ఈ నెట్‌ప్లస్ ప్లాన్స్ చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు.

ప్రస్తుతం ఈ కంపెనీ కొన్ని ప్రాంతాల్లోనే బ్రాడ్‌బాండ్ సర్వీసులు అందిస్తోంది. హరియాణ, పంజాబ్ , హిమాచల్ ప్రదేశ్ , జమ్మూ అండ్ కశ్మీర్, రాజస్తాన్, ఉత్తరఖండ్, ఉత్తర ప్రదేశ్ వంటి ప్రాంతాల్లో ఈ బ్రాడ్‌బాండ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి సేవలు మన దక్షిణ భారత దేశంలో కూడా అందుబాటులోకి వస్తే బాగుంటుందని చెప్పుకోవచ్చు. కాగా దక్షిణ భారత దేశంలో కూడా స్థానికంగా పలు రకాల బ్రాడ్‌బాండ్ కంపెనీలు కస్టమర్లకు మెరుగైన సర్వీసులు అందిస్తున్నాయి.

First published:

Tags: AIRTEL, Internet, Jio fiber, Money, Wifi

ఉత్తమ కథలు