Netflix: iOS యూజ‌ర్ల‌కు గుడ్ న్యూస్‌.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ప‌టిక‌ల్ ఆడియో

Netflix (ప్రతీకాత్మక చిత్రం)

iOS వినియోగదారులను ప్ర‌ముఖ గ్లోబ‌ల్ స్ట్రీమింగ్ స‌ర్వీస్ నెట్‌ఫ్లిక్స్(Netflix) గుడ్ న్యూస్ చెప్పింది. ఇక‌పై iOSలో నెట్‌ఫ్లిక్స్ చూసేవారికి స్పటికల్(spatial) ఆడియో సపోర్ట్‌ను అందించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. iOS లేదా iPadOS 14.6 రన్ అవుతున్న ఐఫోన్, ఐప్యాడ్‌ల‌లో ఈ ఫీచర్ అందుబాటులోకి రానున్నది.

  • Share this:
    iOS వినియోగదారులను ప్ర‌ముఖ గ్లోబ‌ల్ స్ట్రీమింగ్ స‌ర్వీస్ నెట్‌ఫ్లిక్స్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇక‌పై iOSలో నెట్‌ఫ్లిక్స్ చూసేవారికి స్పటికల్(spatial) ఆడియో సపోర్ట్‌ను అందించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. iOS లేదా iPadOS 14.6 రన్ అవుతున్న ఐఫోన్, ఐప్యాడ్‌ల‌లో ఈ ఫీచర్ అందుబాటులోకి రానున్నది. ప్ర‌స్తుతం ఎయిర్‌పాడ్స్ ప్రో లేదా ఎయిర్‌పాడ్స్ మాక్స్ ద్వారా మాత్ర‌మే ఈ స్ప‌టిక‌ల్ ఆడియోను అందిస్తోంది. దీనితో పాటు యాపిల్ టీవి, మ్యూజిక్‌ల‌లో ఈ స‌దుపాయం క‌లిగించ‌నుంది. భ‌విష్య‌త్‌లో మాక్‌(Mac), యాపిల్ టీవీ (Apple TV) పరికరాలకు స్పటికల్ ఆడియో స‌పోర్ట్ చేసేలా చూసేందుకు సంస్థ ప్ర‌య‌త్నిస్తోంది. ఈ ఫీచ‌ర్‌ను వినియోగ‌దారులకు నెలాఖ‌రులోగా అందుబాటులోకి తెచ్చేలా సంస్థ క‌స‌ర‌త్తు ప్రారంభించింది. ఈ ఫీచ‌ర్ అందుబాటులోకి రాగానే నెట్‌ఫ్లిక్స్‌లో ప్ర‌సారం అయ్యే అన్ని కార్య‌క్ర‌మాల‌ను స్ప‌టిక‌ల్ ఆడియో ద్వారా విన‌వ‌చ్చు.
    స్ప‌టిక‌ల్ ఆడియోలో కార్య‌క్ర‌మాల‌ను వీక్షించేందుకు ఇలా చేయండి..
    ముందుగా మీ ఎయిర్‌పాడ్ ప్రో (Air Pods Pro), ఎయిర్‌పాడ్ మాక్స్ (AirPods Max)ని మీ వ‌ద్ద ఉన్న iPhone లేదా iPad కి కనెక్ట్ చేయాలి. అనంత‌రం మీ ఆపిల్ డివైస్‌లో నెట్‌ఫ్లిక్స్ అప్లికేషన్‌ను ఓపెన్ చేసి 5.1 సరౌండ్ లేదా డాల్బీ(dolby audio) అట్మోస్ వంటి సరౌండ్ సౌండ్ మిక్సింగ్‌తో కంటెంట్‌ను గుర్తించాలి. త‌ర్వాత మీ డివైస్ స్క్రీన్(Display screen) కుడివైపు పైన మూలలో క్రిందికి స్వైప్ చేసి కంట్రోల్ పానెల్లో(Control panel)కి వెళ్లాలి.

    Electric Scooter: "సింపుల్" సూప‌ర్... మార్కెట్‌లోకి కొత్త ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌




    అక్క‌డ ఆడియో ఎంపికలను సెల‌క్ట్ చేసుకోవాలి. వాల్యూమ్(Volume) స్లయిడర్‌ను ప్రెస్ చేసి ప‌ట్టుకోవాలి. అప్పుడు మీ స్క్రీన్‌పై ఆడియో ఎంపికలు ఓపెన్ అవుతాయి. అక్క‌డ ఫీచర్‌ను ప్రారంభించడానికి స్పటికల్ ఆడియో సింబ‌ల్‌ మీద నొక్కాలి. స్ప‌టిక‌ల్ ఆడియోను ఎంచుకొన్న‌త‌ర్వాత బ్లూటూత్ విభాగానికి వెళ్తే అక్క‌డ ఆడియోను టోగుల్ చేయవచ్చు. అనంత‌రం బ్లూటూత్(Bluetooth) జాబితాలో డివైస్ పేరు పక్కన ఉన్న "i" సింబ‌ల్‌(symbol)ను ప్రెస్ చేయాలి. అనంత‌ర స్క్రోల్(Scroll) చేసి "స్పటికల్ ఆడియో" స్లయిడర్‌పై క్లిక్ చేయాలి. మీ ఆపిల్ డివైస్ ఈ ఫీచర్ ప్రారంభించిన తర్వాత కూడా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్న మొత్తం కంటెంట్ స్పటికల్ ఆడియో కోసం అందుబాటులో ఉండదని గమనించాలి. ఎందుకంటే ఈ ఫీచర్ సినిమాలు మరియు కొన్ని రకాల సరౌండ్ సౌండ్ మిక్సింగ్‌తో మాత్రమే పనిచేస్తుంది.
    Published by:Sharath Chandra
    First published: