హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Netflix: నెట్ ఫ్లిక్స్ బంపర్ ఆఫర్.. ఇకపై వీడియో గేమ్స్ కూడా..! ఛార్జ్ ఎంతంటే..!

Netflix: నెట్ ఫ్లిక్స్ బంపర్ ఆఫర్.. ఇకపై వీడియో గేమ్స్ కూడా..! ఛార్జ్ ఎంతంటే..!

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

టీవీ షోలు, వెబ్ సిరీస్లు, సినిమాలతో నెట్ఫ్లిక్స్ (Netflix) దుమ్మురేపుతోంది. ఇప్పుడు కొత్తగా సబ్ స్క్రైబర్స్ కు మరో బంపర్ ఆఫర్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.

  టీవీ షోలు, వెబ్ సిరీస్లు, సినిమాలతో నెట్ఫ్లిక్స్ దుమ్మురేపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా నానాటికి ఈ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ యూజర్లు పెరిగిపోతున్నారు. ఇటీవల భారీ సినిమాలు కూడా నెట్ఫ్లిక్స్లోకి వచ్చేస్తున్నాయి. భారత్లోనూ దీనికి ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సబ్స్క్రైబర్లను మరింత పెంచుకునే దిశగా నెట్ఫ్లిక్స్ కీలక అడుగు వేస్తోంది. ఇంత వరకు ఏ ఓటీటీ ఫ్లాట్ఫామ్ తీసుకురాని విధంగా వీడియో గేమ్స్ను కూడా ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దీంతో త్వరలోనే సినిమాలు, కార్యక్రమాలు మాత్రమే కాకుండా వీడియో గేమ్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం ఫేస్బుక్కు చెందిన ఓ ఎగ్జిక్యూటివ్ను, ఓ ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ మాజీ బాస్ను నియమించింది. మైక్ వెర్డ్ ను గేమ్స్ డెవలప్మెంట్ ఆఫ్ గేమ్ డెవలప్మెంట్గా నియమించిన నెట్ఫ్లిక్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా గ్రెగ్ పీటర్స్కు బాధ్యతలు ఇచ్చింది. ఈ విషయాన్ని సంస్థ అధికారికంగా ప్రకటించింది.

  మైక్ వెర్డ్ గతంలో ఫేస్బుక్కు వైస్ ప్రెసిడెంట్గా పని చేశారు. గేమ్స్ డెవలప్ చేయడంతో పాటు వర్చువల్ కంటెంట్ కోసం ఫేస్బుక్ ఆయన పని చేయగా.. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో వీడియో గేమ్స్ తీసుకొచ్చే బాధ్యతలను చేపట్టారు.వచ్చే ఏడాది కల్లా తమ ఫ్లాట్ఫామ్పై వీడియో గేమ్స్ తీసుకురావాలని నెట్ఫ్లిక్స్ నిర్ణయించుకుందని సమాచారం. నెట్ఫ్లిక్స్ యాప్లోనే వీడియో గేమ్స్ అనే జానర్ను యాడ్ చేస్తుందట. అయితే గేమ్స్ కోసం అదనపు డబ్బు వసూలు చేసేలా ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ ఏ ప్లాన్ చేయడం లేదని సంస్థకు చెందిన ఓ వ్యక్తి వెల్లడించారు. అయితే గేమ్స్ కోసం ఇప్పటికే అడ్వర్టైజ్ మెంట్లపై కసరత్తులు చేస్తోందని తెలిపారు.

  మరోవైపు ఇప్పటికే ఉన్న ప్రముఖ గేమింగ్ కంపెనీలతో కూడా చేతులు కలపాలని నెట్ఫ్లిక్స్ ఆలోచిస్తోందని సమాచారం. ఇందుకోసం గేమింగ్ సంస్థలతో ఒప్పందం చేసుకోవాలని భావిస్తోందని టెక్ వర్గాల టాక్. దీనిద్వారా కొత్త కస్టమర్లను ఎక్కువగా ఆకర్షించవచ్చని నెట్ఫ్లిక్స్ అనుకుంటోంది.

  ముఖ్యంగా చిన్నపిల్లలను కూడా తమ ఫ్లాట్ఫామ్కు ఆకర్షితులను చేయాలనే ప్లాన్తోనే నెట్ఫ్లిక్స్ వీడియోగేమ్స్ను తీసుకొస్తోంది. ఇప్పటికే పిల్లల కోసం ప్రత్యేక ప్రోగ్రామ్లను ఎక్కువగా ప్లాన్ చేస్తోంది. అలాగే పిల్లల కోసం మర్చండైజ్ షాప్లు కూడా ఓపెన్ చేస్తోంది. అలాగే స్టీవెన్ స్పీల్బర్గ్ సినిమాలను వరుసగా ఫ్లాట్ఫామ్లోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది. ఇప్పటికే డిస్నీ ప్లస్, హెచ్బీవో మ్యాక్స్ లాంటి ప్రత్యర్థి ఓటీటీ ఫ్లాట్ఫామ్ల కంటే సబ్స్క్రైబర్స్ విషయంలో నెట్ఫ్లిక్స్ చాలా ముందుంది. ఇప్పుడు వీడియో గేమ్లను ప్రవేశపెట్టి ఎవరినీ అందనంత ఎత్తులోకి చేరుకోవాలని ప్లాన్ చేస్తోంది.

  First published:

  Tags: Netflix, Ott, Video Games

  ఉత్తమ కథలు