హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Netflix Password Sharing: కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తున్న నెట్‌ఫ్లిక్స్.. అలా లాగిన్ అయ్యేవారికి ఇక ఇబ్బందులే..

Netflix Password Sharing: కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తున్న నెట్‌ఫ్లిక్స్.. అలా లాగిన్ అయ్యేవారికి ఇక ఇబ్బందులే..

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

ఇంట్లోనే ఖాళీగా ఉండడం, చాలా సినిమాలు ఓటీటీల్లోనే విడుదల కావడంతో చాలామంది ప్రీమియం సబ్ స్క్రిప్షన్లు తీసుకొని వాటిని ఉపయోగించడం ప్రారంభించారు. అందుకేకస్టమర్లను ఆకట్టుకునేందుకు సంస్థలు కూడా ఎన్నో ఆఫర్లను ప్రకటించాయి. అయితే..

గత ఏడాది లాక్‌డౌన్ తరువాత వీడియో స్ట్రీమింగ్ యాప్‌లను చూసేవారి సంఖ్య భారీగా పెరిగింది. ఇంట్లోనే ఖాళీగా ఉండడం, చాలా సినిమాలు ఓటీటీల్లోనే విడుదల కావడంతో చాలామంది ప్రీమియం సబ్ స్క్రిప్షన్లు తీసుకొని వాటిని ఉపయోగించడం ప్రారంభించారు. అందుకేకస్టమర్లను ఆకట్టుకునేందుకు సంస్థలు కూడా ఎన్నో ఆఫర్లను ప్రకటించాయి. నెట్‌ఫ్లిక్స్ కూడా ఒక అకౌంట్, పాస్‌వర్డ్ ద్వారా ఎక్కువ మంది యూజర్లు లాగిన్ అయ్యే అవకాశం కల్పించింది. కానీ ఇప్పుడు ఆ సంస్థ తన పాస్‌వర్డ్ షేరింగ్ నియమాలను కఠినతరం చేస్తోంది. దీనికి సంబంధించిన కొత్త ఫీచర్‌ను నెట్‌ఫ్లిక్స్ పరీక్షిస్తోంది. ఇప్పుడు యూజర్లు.. సంబంధిత అకౌంట్‌ ద్వారా నెట్ ఫ్లిక్స్‌కు లాగిన్ అయ్యే అధికారం తమకు ఉందని ధ్రువీకరించాల్సి ఉంటుంది. యూజర్ల కుటుంబ సభ్యులు కాకుండా ఇతర వ్యక్తులు పాస్‌వర్డ్ షేరింగ్ ద్వారా లబ్ధిపొందడం కుదరదని సంస్థ పేర్కొంది. ఈ వివరాలన్నీ సర్వీస్ రూల్స్‌లో ఉన్నాయని సంస్థ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

కొంతమంది యూజర్లు షేర్డ్ నెట్‌ఫ్లిక్స్ అకౌంట్‌లో తమ ప్రొఫైల్‌ను ఎంచుకున్నప్పుడు ఒక నోటిఫికేషన్ కనిపిస్తోంది. అకౌంట్‌ను వెరిఫికేషన్ చేయాలని, అకౌంట్ హోల్డర్‌కు పంపిన మెసేజ్ లేదా ఈమెయిల్ ద్వారా వివరాలను ధ్రువీకరించాలని నోటిఫికేషన్ లో ఉంది. కస్టమర్లు వెరిఫికేషన్‌ను వాయిదా వేసే ఆప్షన్‌ కూడా ఉంది. కానీ వారికి నిర్ణీత సమయంలో మళ్లీ నోటిఫికేషన్ కనిపిస్తుంది. తాము అధికారిక వినియోగదారులమని యూజర్లు ధ్రువీకరించకపోతే.. నెట్‌ఫ్లిక్స్‌ వాడేందుకు కొత్త అకౌంట్ ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది. ఈ కొత్త ఫీచర్ టెస్టింగ్ దశలోనే ఉంది. ప్రస్తుతం కొంతమంది నెట్‌ఫ్లిక్స్ టీవీ యాప్‌ వినియోగదారులకే ఇలాంటి నోటిఫికేషన్లు వస్తున్నాయి.

నష్టపోతున్న సంస్థలు

గత ఏడాది లాక్‌డౌన్ సమయంలో నెట్‌ఫ్లిక్స్‌ డౌన్‌లోడ్లు భారీగా పెరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమంది యూజర్లు ఉన్న వీడియో స్ట్రీమింగ్ యాప్‌లలో నెట్‌ఫ్లిక్స్ ఒకటి. ఈ సంస్థతో పాటు ఇతర స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫాంలు కూడా పాస్‌వర్డ్ షేరింగ్ విధానం వల్ల నష్టపోతున్నాయి. దీంతో కంపెనీలు ఈ ఆప్షన్‌ దుర్వినియోగం కాకుండా నిరోధించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే నెట్‌ఫ్లిక్స్ కొత్తగా అకౌంట్ వెరిఫికేషన్ ఫీచర్‌ను ప్రవేశపెడుతోందని నిపుణులు చెబుతున్నారు.

First published:

Tags: Netflix, Ott

ఉత్తమ కథలు