NETFLIX PROVIDING FIRST VIDEO GAME STUDIO LAUNCHES ON OTT PLATFORM EVK
Netflix : ఓటీటీలో సినిమాలే కాదు.. గేమ్స్ ఆడుకోవచ్చు నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త ఫీచర్
Netflix (ప్రతీకాత్మక చిత్రం)
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ గతంలో నెట్‌ఫ్లిక్స్ ఆన్లైన్ (online) గేమ్స్‌ను కూడా తీసుకువస్తోదనే ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా నెట్‌ఫ్లిక్స్ (Netflix) ప్రముఖ గేమింగ్ దిగ్గజం నైట్ స్కూల్ స్టూడియోను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి నైట్ స్కూల్ స్టూడియో అధికారికంగా ట్వీట్ చేసింది.
భారత్‌లో వీడియో స్ట్రీమింగ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ (OTT Platform)లకు భారీ డిమాండ్ ఏర్పడింది. కరోనా లాక్డౌన్ తర్వాత ఇది ప్రతి ఒక్కరి జీవితంలో సాధారణంగా మారింది. ప్రస్తుతం తక్కువ ధరలోనే మొబైల్ ఇంటర్నెట్ (Internet), హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులోకి రావడంతో ఈ ధోరణి మరింతగా పెరిగింది. మరోవైపు కరోనా భయంతో జనాలు థియేటర్లకు రావడం దాదాపుగా మానేశారు. అందుకే నిర్మాణ సంస్థలు సైతం కొత్త సినిమాలను ఓటీటీల్లోనే విడుదల చేసేందుకు మొగ్గుచూపుతున్నాయి. వెబ్‌సిరీస్‌ల నుంచి ఒరిజినల్ షోల వరకూ అన్ని భాషల కంటెంట్ ఓటీటీల్లోనే రిలీజ్ అవుతున్నాయి. వీటితో పాటు ఇప్పుడు గేమ్స్ అడుకొనే అవకాశాన్ని కల్పిస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ గతంలో నెట్‌ఫ్లిక్స్ ఆన్లైన్ (online) గేమ్స్‌ను కూడా తీసుకువస్తోదనే ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా నెట్‌ఫ్లిక్స్ (Netflix) ప్రముఖ గేమింగ్ దిగ్గజం నైట్ స్కూల్ స్టూడియోను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. నైట్ స్కూల్ స్టూడియోకు చెందిన ఐదు మొబైల్ గేమ్స్‌ను యూరోపియన్ మార్కెట్లలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేసింది.
‘ఆక్సెన్ఫ్రీ’ ఈ గేమ్‌ను నైట్ స్కూల్ స్టూడియో డెవలప్ చేసింది. ఈ గేమ్ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. సోనీ ప్లేస్టేషన్, మైక్రోసాఫ్ట్ ఎక్స్‌బాక్స్, నింటెండో స్విచ్ , కంప్యూటర్లలో ఈ గేమ్‌ను అందుబాటులో ఉంచారు. నైట్ స్కూల్ స్టూడియో గేమ్స్ నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి తొలి సారిగా మొబైల్ స్మార్ట్‌ఫోన్స్ (Smart Phone)లో గేమ్స్‌ను లాంచ్ చేసింది. ఇది వినియోగదారులను ఎంతగానో ఆకర్షిస్తోందని గేమ్ డెవలపర్ నైట్ స్కూల్ స్టూడియో పేర్కొంటుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపింది.
ఈ గేమ్ నెట్‌ఫ్లిక్స్ సభ్యత్వం ఉన్న వారికి యాప్‌లో ఎలాంటి కొనుగోలు లేకుండా, యాడ్స్ లేకుండా యూజర్లు గేమ్స్‌ను ఆడుకోవచ్చునని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇంతే కాకుండా స్పెయిన్ ,ఇటలీలోని నెట్‌ఫ్లిక్స్ సభ్యులకు ఆండ్రాయిడ్‌లో "స్ట్రేంజర్ థింగ్స్: 1984", "స్ట్రేంజర్ థింగ్స్ 3: ది గేమ్", "కార్డ్ బ్లాస్ట్", "టీటర్ అప్" "షూటింగ్ హూప్స్" గేమింగ్ టైటిళ్లను ఇప్పటికే ప్రవేశపెట్టినట్లు గేమింగ్ కంపెనీ తెలిపింది. ఈ గేమింగ్ సదుపాయం త్వరలోనే భారత్‌లోను లాంచ్ చేసేందుకు ప్రయత్నాలను చేస్తోన్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. స్ట్రీమింగ్ (Streaming) స్పేస్‌లో తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో ఆదాయవనరులను పెంచుకునేందుకుగాను గేమింగ్ రంగంపై నెట్ఫ్లిక్ దృష్టి సారించినట్టు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.