Home /News /technology /

NETFLIX NOW HAS GAMES FOR ANDROID IOS HOW TO DOWNLOAD AND PLAY ON YOUR PHONE GH VB

Netflix Games: నెట్‌ఫ్లిక్స్‌లో సైతం ఆండ్రాయిడ్, ఐఓఎస్ గేమ్స్​.. మీ ఫోన్‌లో ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

నెట్ ఫ్లిక్స్

నెట్ ఫ్లిక్స్

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ బాగా చేరువయ్యింది. ఇందులో అందుబాటులో ఉన్న వెబ్‌సిరీస్‌లు, సినిమాలు భారతీయులను కూడా ఆకట్టుకుంటున్నాయి. వీడియో కంటెంట్‌తో అందరికీ ఎంతో వినోదం పంచుతున్న నెట్‌ఫ్లిక్స్‌ ఇప్పుడు గేమ్‌లతో యూజర్లను ఎంటర్‌టైన్‌ చేయడానికి ఓ ముందడుగు వేసింది.

ఇంకా చదవండి ...
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ బాగా చేరువయ్యింది. ఇందులో అందుబాటులో ఉన్న వెబ్‌సిరీస్‌లు, సినిమాలు భారతీయులను కూడా ఆకట్టుకుంటున్నాయి. వీడియో కంటెంట్‌తో అందరికీ ఎంతో వినోదం పంచుతున్న నెట్‌ఫ్లిక్స్‌ ఇప్పుడు గేమ్‌లతో యూజర్లను ఎంటర్‌టైన్‌ చేయడానికి ఓ ముందడుగు వేసింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్‌ల కోసం ఐదు ఉచిత మొబైల్ గేమ్స్ తీసుకొచ్చింది. దాంతో యూజర్లు ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి తమ టాబ్లెట్‌లు, ఫోన్‌లలో గేమ్‌లను ఇన్‌స్టాల్ చేసి ఆడవచ్చు. నెట్‌ఫ్లిక్స్ ఈ నెల ప్రారంభంలో ఐదు ఆండ్రాయిడ్ గేమ్‌లతో మొబైల్ గేమింగ్‌లోకి ప్రవేశించింది.

Smart Tv: స్మార్ట్ టీవీ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరల్లో లభ్యం.. కేవలం రూ.7,990 మాత్రమే..


కొన్ని రోజుల తర్వాత ఐఓఎస్ కోసం కూడా గేమ్‌లను పరిచయం చేసింది. నెట్‌ఫ్లిక్స్ తన కొత్త గేమ్స్ సెక్షన్ ఎలా పని చేస్తుందో బ్లాగ్ పోస్ట్‌లో వివరించింది. అన్ని ఇతర నెట్‌ఫ్లిక్స్ కంటెంట్‌ల వలె గేమ్‌లు కూడా నిర్దేశించిన వరుస లేదా కేటగిరీలో కనిపిస్తాయని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. అదనపు రుసుములు, ప్రకటనలు లేదా యాప్‌లో కొనుగోళ్లు (in-app purchases) లేకుండా స్టాండర్డ్ సబ్‌స్క్రిప్షన్‌లో భాగంగా గేమ్స్ అందుబాటులో ఉంటాయని పేర్కొంది. నెట్‌ఫ్లిక్స్ నిర్దిష్ట ప్లేయర్ల సంఖ్య గురించి తెలియజేయనప్పటికీ.. డివైజ్ లిమిట్ మించనంత వరకు మల్టిపుల్ యూజర్లు ఒకే సబ్‌స్క్రిప్షన్‌లో గేమ్‌లను ఆడుకునే వెసులుబాటు కల్పించింది.

Google Home Remote: ఆండ్రాయిడ్ యూజర్లకు మరో యాప్ బేస్డ్ గూగుల్ టీవీ రిమోట్‌ ఆప్షన్.. వివరాలివే..


అయితే, కొన్ని గేమ్‌లకు ఇంటర్నెట్ కనెక్షన్ అవసరమైతే.. ఇతర గేమ్‌లకు ఇంటర్నెట్ అవసరం లేదని నెట్‌ఫ్లిక్స్ చెప్పింది. అయితే పిల్లల ఖాతాలలో గేమ్‌లు అందుబాటులో ఉండవు. కంపెనీ తన గేమింగ్ ప్రయాణాన్ని స్ట్రేంజర్ థింగ్స్: 1984, స్ట్రేంజర్ థింగ్స్ 3: ది గేమ్, షూటింగ్ హోప్స్, టీటర్ అప్, కార్డ్ బ్లాస్ట్ అనే ఐదు గేమ్‌లతో ప్రారంభించింది. నెట్‌ఫ్లిక్స్ గేమ్‌లు వివిధ భాషల్లో అందుబాటులో ఉంటాయి. ఆటగాళ్లు హిందీ, బెంగాలీ, పంజాబీ, మరాఠీ, తమిళంతో సహా వివిధ భారతీయ భాషలలో గేమ్‌లను యాక్సెస్ చేయవచ్చు.

Chief Minister KCR: దళితులకు గుడ్ న్యూస్.. ఆ పథకం కింద రూ.250 కోట్లు విడుదల..


నెట్‌ఫ్లిక్స్ గేమ్‌లను యాక్సెస్ చేయండిలా..

1. ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో నెట్‌ఫ్లిక్స్ యాప్‌ని ఓపెన్ చేసి సైన్ ఇన్ చేయండి.

2. నెట్‌ఫ్లిక్స్ గేమ్‌లను హోమ్‌పేజీ లేదా గేమ్‌ల ట్యాబ్​లో చూడొచ్చు.

3. మీరు ఆడాలనుకుంటున్న గేమ్‌ని సెలక్ట్ చేసుకోండి.

4. మీ స్మార్ట్‌ఫోన్‌లోని యాప్ స్టోర్ నుంచి గేమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

5. గేమ్‌ని యాక్సెస్ చేయడానికి నెట్‌ఫ్లిక్స్ యాప్‌ని ఉపయోగించండి.
Published by:Veera Babu
First published:

Tags: Games, Netflix

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు