శాశ్వతంగా Netflix సబ్స్క్రిప్షన్ పొందాలని ఉందా...అయితే Netflix ఓ బంపర్ ఆఫర్ తో ముందుకు వచ్చింది. నెల కాదు. రెండు నెలల కాదు...ఏకంగా 83 సంవత్సరాల సబ్ స్క్రిప్షన్ అందించేందుకు అవకాశాన్ని కల్పించింది. అంటే సుమారు 1000 నెలల పాటు ఫ్రీగా Netflix వాడుకోవాలంటే మీరు చేయాల్సిందల్లా ఓ గేమ్ ఆడటమే. The Old Guard పేరిట ఉన్న గేమ్ ఆడి అందులో విజేతగా నిలవాల్సి ఉంది. అయితే ఈ ఆఫర్ జులై 17న మొదలు కాగా.. జులై 19వ తేదీ వరకు ఆడే ఛాన్స్ ఉంది. The Old Guard గేమ్‌లో అత్యధిక స్కోరు చేసిన విజేతకు వెయ్యి నెలల ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను Netflix అందించనుంది.
చార్లిజ్ థెరాన్, కికి లేన్, మాథియాస్ స్చోనెర్ట్స్, మార్వాన్ కెంజారి తదితరులు నటించిన అమెరికన్ సూపర్ హీరో చిత్రం The Old Guardను Netflixలో విడుదల చేశారు. గ్రెగ్ రుక్కా రచించిన కామిక్ నవల ఆధారంగా, ఈ చిత్రం ఓ రివేంజ్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ సినిమాను చూస్తేనే గేమ్ గురించి తెలుస్తుంది. ది ఓల్డ్ గార్డ్ విడుదలైన తరువాత, నెట్‌ఫ్లిక్స్ బ్రౌజర్ ఆధారిత వీడియో గేమ్‌ను ప్రవేశపెట్టింది,
అయితే ఈ గేమ్ కోసం ఈ క్రింద ఉన్న లింక్ క్లిక్ చేయండి. oldguardgame ఈ గేమ్ లో మీరు విజేతగా నిలవగానే మీరు నేరుగా 1000 నెలల Netflix సభ్యత్వం పొందుతారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Information Technology, Netflix, Ott, Technology