NETFLIX INVITES FANS TO TAKE PART IN SQUID GAME REALITY SHOW WITH RS 35 CRORE CASH PRIZE
Squid Game: నెట్‌ఫ్లిక్స్ వేరే లెవల్ ఐడియా.. రియల్ లైఫ్ స్క్విడ్ గేమ్ ప్లాన్.. ప్రైజ్‌మనీ తెలిస్తే షాక్ అవుతారు..!
NetFlix Reality show
నెట్‌ఫ్లిక్స్ (NetFlix) రియల్ లైఫ్ లో స్క్విడ గేమ్ (Squid Game) నిర్వహించేందుకు సిద్ధమైంది. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది.. రియల్ లైఫ్‌లో ఆడే ఈ ఆటలో ఓడిపోయిన వారిని చంపేయరు. వారిని సింపుల్‌గా ఇంటికి పంపించేస్తారు. విజేతగా నిలిచిన వారికి మాత్రం 4.56 మిలియన్ డాలర్లు (రూ.35 కోట్లు) ప్రైజ్ మ?
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఓటీటీ వ్యూయర్లను ఆకట్టుకున్న కొరియన్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ స్క్విడ్ గేమ్ (Squid Game) గురించి స్పెషల్‌గా ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఈ వెబ్‌సిరీస్‌లో 456 మంది పార్టిసిపెంట్లు, ఆరు పోటీలు ఉంటాయి. ఒక పోటీలో విజేతలుగా నిలిచిన వారందరినీ నెక్స్ట్ పోటీలో ఆడనిస్తారు. ఓడిపోయిన వారిని చంపేస్తారు. అన్ని ఆటల్లో గెలిచిన వారికి 45.6 బిలియన్ కొరియన్ వన్ (39 మిలియన్ డాలర్లు) ప్రైజ్‌మనీగా అందిస్తారు. అయితే ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఇలాంటి గేమ్‌ను రియల్ లైఫ్ (Real Life)లో కూడా నిర్వహించేందుకు సిద్ధమైంది. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది.. రియల్ లైఫ్‌లో ఆడే ఈ ఆటలో ఓడిపోయిన వారిని చంపేయరు. వారిని సింపుల్‌గా ఇంటికి పంపించేస్తారు. విజేతగా నిలిచిన వారికి మాత్రం 4.56 మిలియన్ డాలర్లు (రూ.35 కోట్లు) ప్రైజ్ మనీగా అందజేస్తారు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ఈ రియాలిటీ టీవీ షో కోసం పార్టిసిపెంట్లను రిక్రూట్ చేస్తోంది.
మెగా-హిట్ ఒరిజినల్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్’ ఆధారంగా కొత్త రియాలిటీ షో ‘స్క్విడ్ గేమ్: ది ఛాలెంజ్ (Squid Game: The Challenge)’ త్వరలోనే లాంచ్ చేస్తున్నట్లు జూన్ 14న నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ఈ రియల్ లైఫ్ స్క్విడ్ గేమ్‌లో పాల్గొనేవారు కొత్త గేమ్‌లతో పాటు ఒరిజినల్ షోలో కనిపించిన వివిధ గేమ్‌లను ఆడతారు. ప్రపంచంలో ఇంగ్లీష్ మాట్లాడగలిగే ఎవరైనా సరే ఈ రియాలిటీ సిరీస్‌లో పాల్గొనడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రియాలిటీ సిరీస్ 10 ఎపిసోడ్లుగా రూపుదిద్దుకోనుంది. అసలు సిరీస్‌లా కాకుండా, ఈ టీవీ షోలో ఓడిపోయిన వారు కేవలం ఖాళీ చేతులతో ఇంటికి వెళతారు. నెట్‌ఫ్లిక్స్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 456 మంది ఈ గేమ్‌ల్లో ఆడతారు. గెలిచినవారు 4.56 మిలియన్ డాలర్లను బహుమతిని అందుకుంటారు. తన కొత్త 10-ఎపిసోడ్ సిరీస్ - స్క్విడ్ గేమ్: ది ఛాలెంజ్ రియాలిటీ టీవీ చరిత్రలో అతిపెద్ద తారాగణం, లంప్ క్యాష్ ప్రైజ్"ను అందజేస్తుందని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.
"ఆటగాళ్లు అసలైన షో నుంచి ప్రేరణ పొందిన గేమ్‌ల్లో పోటీ పడుతున్నారు. అలానే కొత్త గేమ్‌ల్లో కూడా ఆడాల్సి ఉంటుంది. పార్టిసిపెంట్ల వ్యూహాలు, పొత్తులు, పాత్రలు ఈ గేమ్‌ల్లో పరీక్షించడం జరుగుతుంది. ఓడిపోయిన వారు ఎలిమినేట్ అవుతారు" అని నెట్‌ఫ్లిక్స్ వివరించింది. పార్టిసిపెంట్లకు కనీసం 21 సంవత్సరాలు ఉండాలి. వారు తప్పనిసరిగా ఇంగ్లీష్ మాట్లాడాలి. షూటింగ్ కోసం 2023 ప్రారంభంలో 4 వారాల వరకు వారు అందుబాటులో ఉండాలి. ఆసక్తిగలవారు https://www.squidgamecasting.com/ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
హ్వాంగ్ డాంగ్-హ్యూక్ స్క్విడ్ గేమ్ డైరెక్టర్, రచయితగా సెప్టెంబర్ 17, 2021న రిలీజైన ఈ 9 ఎపిసోడ్ సిరీస్ ప్రతిక్షణం ఉత్కంఠ రేపుతుంది. ఆర్థిక సమస్యలతో బాధపడే 456 మంది ఇందులో డబ్బుకోసం పాల్గొంటారు కానీ ఓడిపోతే చనిపోతారని ఆటల్లో పాల్గొన్న తర్వాత మాత్రమే తెలుసుకుంటారు. ఆ తర్వాత ఈ సిరీస్ ఎంతో థ్రిల్లింగ్ గా సాగుతుంది. అందుకే ఇంతలా ఫేమస్ అయ్యింది. ఈ సిరీస్ వల్ల నెట్‌ఫ్లిక్స్ భారీ ఎత్తున డబ్బు కూడా సంపాదించింది. అయితే ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ తన సబ్స్క్రైబర్లను భారీగా కోల్పోతుంది. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మందిని కోల్పోయే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో నెట్‌ఫ్లిక్స్ మార్కెట్ వ్యాల్యూ 50 డాలర్లకు పైగా తుడిచిపెట్టుకుపోయింది. దీనితో నెట్‌ఫ్లిక్స్ ఉన్న సబ్స్క్రైబర్లను కాపాడుకోవడంతో పాటు కొత్త వారిని ఆకర్షించేందుకు వినూత్న ఆలోచనలు చేస్తోంది.
Published by:Mahesh
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.