Netflix UPI Payment: నెట్‌ఫ్లిక్స్‌లో ఇక‌ యూపీఐ పేమెంట్స్‌

(ప్రతీకాత్మకచిత్రం)

అంతార్జాతీయంగా ఓటీటీలో నెట్‌ఫ్లిక్స్(Netflix) అగ్ర‌గామిగా ఉంది. ఇండియాలోనే దాదాపు యాభై లక్షల మందికి పైగా చందాదారులు నెట్‌ఫ్లిక్స్ వాడుతున్నారు. దీంతో నెట్‌ఫ్లిక్స్ యూజ‌ర్ల‌ సౌకర్యం కోసం యూపీఏ పేమెంట్ మెథ‌డ్‌ను తీసుకొచ్చింది. ఇకపై నెట్‌ఫ్లిక్స్ లో పేమెంట్ చాలా సుల‌భంగా ఉంటుంది. తేలికగా, వేగంగా అకౌంట్‌ రెన్యువల్‌(Renewal) చేసుకునేలా కొత్త ఆప్షన్లను నెట్‌ఫ్లిక్స్ తీసుకొచ్చింది.

  • Share this:
    అంతార్జాతీయంగా ఓటీటీలో నెట్‌ఫ్లిక్స్(Netflix) అగ్ర‌గామిగా ఉంది. ఇండియాలోనే దాదాపు యాభై లక్షల మందికి పైగా చందాదారులు నెట్‌ఫ్లిక్స్ వాడుతున్నారు. అలాంటి నెట్‌ఫ్లిక్స్ యూజ‌ర్ల‌కు మ‌రింత చేరువ అయ్యేందుకు కృషిచేస్తోంది. అందులో భాగంగా యూపీఏ పేమెంట్ మెథ‌డ్‌ను తీసుకొచ్చింది. దీంతో నెట్‌ఫ్లిక్స్ యూజ‌ర్ల‌కు పేమెంట్ చాలా సుల‌భం(easy)గా ఉంటుంది. తేలికగా, వేగంగా అకౌంట్‌(Account) రెన్యువల్‌ చేసుకునేలా కొత్త ఆప్షన్లను నెట్‌ఫ్లిక్స్ తీసుకొచ్చింది.
    వినియోగించండి ఇలా..
    నెట్‌ఫ్లిక్స్‌లో స‌బ్‌స్క్రిప్ష‌న్‌ కనిష్టంగా నెలకు రూ. 200ల నుంచి రూ. 799 వరకు ఉంది. అంతే కాకుండా ప‌లు రకాల ప్లాన్స్ వినియోగ‌దారుల అవ‌స‌రాల‌క త‌గ్గ‌ట్టు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు ఈ ఖాతాల‌ను ఖాతాను రెన్యువల్‌ చేసుకోవాలంటే క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల ఆధారంగానే చేసుకోవాల్సి వచ్చేది. ఇటీవలే ఎయిర్‌టెల్‌, జియో, వోడాఫోన్‌ ఐడియా పేమెంట్‌ ఆప్షన్స్‌(Options)ని కూడా అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ ఫేస్‌ (యూపీఐ) పేమెంట్స్‌ని కూడా అందుబాటులోకి తెచ్చింది. కొత్తగా ఖాతా తెరిచేవారుసైతం ఈ పేమెంట్ మెథ‌డ్‌ను వాడుకోవ‌చ్చు.

    Netflix: iOS యూజ‌ర్ల‌కు గుడ్ న్యూస్‌.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ప‌టిక‌ల్ ఆడియో




    నెట్‌ఫ్లిక్స్‌ పేమెంట్స్‌ని యూపీఐ ద్వారా చేయాలంటే నెట్‌ఫ్లిక్స్‌ సెట్టింగ్స్‌(Settigs0లో మార్పులు చేసుకుంటే సరిపోతుంది. ముందుగా వినియోగ‌దారులు నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా వెబ్‌సైట్‌లోగాని మీరు వాడే యాప్‌ని ఓపెన్‌ చేసి అకౌంట్ విభాగంలోకి వెళ్లాలి. అక్క‌డ మేనేజ్‌ పేమెంట్‌ ఆప్షన్‌ని క్లిక్‌ చేయాలి. అనంత‌రం చేంజ్‌ ది పేమెంట్‌ మెథడ్‌ని ఎంచుకోవాలి. అక్కడ యూపీఐ ఆటోపే అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేసి యాక్టివేట్‌ చేసుకోవాలి. ఇక మీద చేసే పేమెంట్(Payment) సుల‌భంగా చేసుకోవ‌చ్చు.
    యూపీఏ పేమెంట్ ఎలా ప‌ని చేస్తుంది..
    యూపీఐ దీన్నే సంక్షిప్తంగా యూనిఫైడ్​ పేమెంట్స్​ ఇంటర్​ఫేస్ అంటారు. ఇది ఆర్‌బీఐ(RBI) నియంత్రిత సంస్థ అయిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ) చేత తక్షణ నగదు బదిలీ కోసం అభివృద్ధి చేయబడింది. యూపీఐ IMPS ఇన్​ఫ్రాస్ట్రక్చర్​పై పనిచేస్తుంది. అయినప్పటికీ, దీని ద్వారా ఐఎంపీఎస్​ను మించి అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. ఏవైనా రెండు బ్యాంక్​ ఖాతాల మధ్య తక్షణ నగదు బదిలీ చేయడానికి యూపీఐ మిమ్మల్ని అనుమతిస్తుంది. ఒకే మొబైల్​ అప్లికేషన్​ ద్వారా వివిధ బ్యాంకు ఖాతాల మధ్య నగదు బదిలీ చేసుకోవడానికి యూపీఐ సహకరిస్తుంది. ఇది ఆండ్రాయిడ్​, ఐఓఎస్​ రెండు ప్లాట్​ఫామ్స్​లోనూ పనిచేస్తుంది.
    Published by:Sharath Chandra
    First published: