హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Netflix Games: ఆండ్రాయిడ్ యూజర్ల కోసం మూడు కొత్త గేమ్స్​ను లాంచ్​ చేసిన నెట్‌ఫ్లిక్స్.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

Netflix Games: ఆండ్రాయిడ్ యూజర్ల కోసం మూడు కొత్త గేమ్స్​ను లాంచ్​ చేసిన నెట్‌ఫ్లిక్స్.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

నెట్​ఫ్లిక్స్​ ఇటీవలే తన ప్లాట్‌ఫాంపై ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు కోసం 7 గేమ్స్ తీసుకొచ్చింది నెట్‌ఫ్లిక్స్. మళ్లీ ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్ల కోసం మరో మూడు కొత్త గేమ్‌లను రిలీజ్ చేసింది. దాంతో ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు మొత్తం 10 గేమ్‌లు అందుబాటులోకి వచ్చాయి.

ఇంకా చదవండి ...

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) తన యూజర్లకు అమితమైన వినోదం పంచే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆకట్టుకునే వీడియో కంటెంట్‌తో పాటు అదిరిపోయే గేమ్స్ (games) పరిచయం చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇటీవలే తన ప్లాట్‌ఫాంపై ఆండ్రాయిడ్ (Android), ఐఓఎస్ (IOS) యూజర్లు కోసం 7 గేమ్స్ (Games) తీసుకొచ్చింది నెట్‌ఫ్లిక్స్. మళ్లీ ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్ల కోసం మరో మూడు కొత్త గేమ్‌లను (New games) రిలీజ్ చేసింది. దాంతో ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్ల (Android Users)కు మొత్తం 10 గేమ్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇంతకు మునుపు విడుదల చేసిన గేమ్స్ లాగానే ఇవి కూడా పూర్తిగా ఉచితం. ఎలాంటి ఫీజు (fee) చెల్లించకుండా ఉచితంగా డౌన్‌లోడ్ (free download) చేసుకోవడానికి, ఆడటానికి ఇవి నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్‌లకు (Netflix subscribers) అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతానికి ఐఓఎస్ వెర్షన్ లో కొత్త గేమ్‌లను విడుదల చేయలేదు. అయితే త్వరలో వాటిని విడుదల చేసే అవకాశం ఉంది.

వండర్‌పుట్ ఫరెవర్, నిట్టెన్స్

నెట్‌ఫ్లిక్స్‌కి కొత్తగా జోడించిన గేమ్‌ల్లో వండర్‌పుట్ ఫరెవర్, నిట్టెన్స్ (Knittens), డామినోస్ కేఫ్ (Dominoes café) ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం నెట్‌ఫ్లిక్స్ స్ట్రేంజర థింగ్స్: 1984, స్ట్రేంజర్ థింగ్స్ 3: ది గేమ్, కార్డ్ బ్లాస్ట్, టీటర్ అప్, అస్ఫాల్ట్ ఎక్స్‌ట్రీమ్, బౌలింగ్ బ్యాలర్స్, షూటింగ్ హోప్స్ గేమ్‌లను లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి కొత్త గేమ్‌లైన వండర్‌పుట్ ఫరెవర్, నిట్టెన్స్ (Knittens), డామినోస్ కేఫ్ (Dominoes café) అందుబాటులో ఉన్నాయి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత గేమ్స్ నెట్‌ఫ్లిక్స్ యాప్‌లో ఆడుకోవడానికి అందుబాటులో ఉంటాయి.

నెట్​ఫ్లిక్స్​ చందాదారులకు ఉచితంగానే గేమ్స్​..

మొబైల్ యూజర్లు తమ నెట్‌ఫ్లిక్స్ యాప్‌లో అందుబాటులో ఉన్న డెడికేటెడ్ గేమ్‌ల వరుస లేదా గేమ్‌ల ట్యాబ్ ద్వారా కొత్త గేమ్‌లను ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అన్ని ఇతర నెట్‌ఫ్లిక్స్ కంటెంట్‌ల వలె గేమ్‌లు డెడికేటెడ్ రౌ(row) లేదా కేటగిరిలో కనిపిస్తాయి. ఇవి అదనపు రుసుములు, ప్రకటనలు లేదా యాప్‌లో కొనుగోళ్లు (in-app purchases) లేకుండా స్టాండర్డ్ సబ్‌స్క్రిప్షన్ సభ్యత్వంలో భాగంగా అందుబాటులో ఉంటాయి. నెట్‌ఫ్లిక్స్ గేమ్‌లు సబ్‌స్క్రైబర్‌ల కోసం ఆడటానికి ఉచితం, నెట్‌ఫ్లిక్స్ అదనంగా ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదు.

నెట్‌ఫ్లిక్స్ గత నెలలో గేమింగ్‌ రంగంలోకి ప్రవేశించింది. మొదటగా ఆండ్రాయిడ్ యూజర్లకు.. ఒక వారం తర్వాత ఐఓఎస్ యూజర్లకు గేమ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. గేమింగ్‌ సర్వీస్ తో ఇప్పటికే ఉన్న యూజర్లను ఎంటర్‌టైన్‌ చేయడమే కాకుండా కొత్త యూజర్లను ఆకట్టుకునే దిశగా నెట్‌ఫ్లిక్స్ అడుగులు వేస్తోంది. నెట్‌ఫ్లిక్స్ తీసుకొచ్చిన అన్ని గేమ్స్ ఆడేందుకు చాలా ఈజీ గా ఉంటాయి. ఆటలకు కొత్త వారు ఎవరైనా సరే వీటిని ఈజీగా ఆడుకోవచ్చు. అలాగే ఇవి చక్కటి ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తాయి. అయితే భద్రతా కారణాల దృష్ట్యా నెట్‌ఫ్లిక్స్ కిడ్స్ ప్రొఫైల్ లో ఆటలను అందించడం లేదు. అయితే ఈ గేమ్స్ లో కొన్నిటికి ఇంటర్నెట్ కనెక్షన్ అవసరమైతే మిగతా వాటికి ఇంటర్నెట్ అవసరం లేదు. దాంతో ఒకసారి డౌన్‌లోడ్ చేసుకుంటే.. ఇంటర్నెట్ లేకపోయినా వీటిని ఆడుకోవచ్చు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Android, Games, Mobile game, Netflix, New feature

ఉత్తమ కథలు