హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Instagram: రాజస్థాన్ యువకుడికి ఇన్‌స్టాగ్రామ్ రూ.38 లక్షల రివార్డ్.. ఎందుకో తెలిస్తే వావ్ అంటారు..

Instagram: రాజస్థాన్ యువకుడికి ఇన్‌స్టాగ్రామ్ రూ.38 లక్షల రివార్డ్.. ఎందుకో తెలిస్తే వావ్ అంటారు..

ఇన్‌స్ట్రాగ్రామ్‌

ఇన్‌స్ట్రాగ్రామ్‌

Instagram: రాజస్థాన్‌కు చెందిన ఓ యువకుడికి ఏకంగా రూ.38 లక్షలు రివార్డుగా అందించింది ఇన్‌స్టాగ్రామ్ . ఇంత భారీ మొత్తం అందించడానికి ఓ పెద్ద కారణమే ఉంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఈరోజుల్లో సోషల్ మీడియా (Social Media) వాడకం పెరిగిపోయింది. ఇదే సమయంలో హ్యాకర్ల దాడులు కూడా పెరిగాయి. యూజర్ల పర్సనల్ డేటా (Personal Data)ను స్కామర్లు అక్రమంగా సేకరిస్తున్నారు. దీంతో వారిని హ్యాకర్ల బారిన నుంచి కాపాడటం సోషల్ మీడియా దిగ్గజాలకు పెద్ద సవాలుగా మారింది. అయితే ఒక్కోసారి ఈ సంస్థలు తమ ఫ్లాట్‌ఫామ్‌ల్లో లోపాలను కనిపెట్టలేక హ్యాక్ చేయడానికి నేరగాళ్లకు మార్గం సుగమం చేస్తున్నాయి. ఈ క్రమంలో సాధారణ యూజర్లు ఈ లోపాలను కనిపెడుతూ సోషల్ మీడియా సైట్స్‌కి ఎంతో హెల్ప్ చేస్తున్నారు. తాజాగా రాజస్థాన్‌ (Rajasthan)కు చెందిన ఓ యువకుడు కూడా కోట్లాది మంది ఇన్‌స్టాగ్రామ్ (Instagram) అకౌంట్స్ హ్యాక్​ అవ్వకుండా కాపాడాడు. ఒక పెద్ద సాంకేతిక లోపాన్ని గుర్తించి ఆ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌కు తెలియజేశాడు. దాంతో ఆ సంస్థ అతడికి ఏకంగా రూ.38 లక్షలు రివార్డుగా అందించింది.

వివరాల్లోకి వెళితే.. జైపూర్‌కు చెందిన నీరజ్ శర్మ అనే విద్యార్థికి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వీడియోలు చూసే అలవాటు ఉంది. అయితే ఒకరోజు ఈ రీల్స్‌లో ఒక సాంకేతిక సమస్య ఉన్నట్లు గుర్తించాడు. లాగిన్, పాస్‌వర్డ్ అవసరం లేకుండా ఏ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ అప్‌లోడ్ చేసిన థంబ్‌నెయిల్‌నైనా మార్చవచ్చని కనిపెట్టాడు.

గతేడాది డిసెంబర్‌​లో రీల్స్​ సెగ్మెంట్​లో ఈ బగ్​ ఉన్నట్లు తెలుసుకున్నాడు. దాదాపు 30 రోజుల పాటు దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుంటూ జనవరి 31న ఈ సాంకేతిక లోపాన్ని పూర్తిస్థాయిలో గుర్తించాడు. దీని గురించి ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లకు తెలియజేశాడు.

* భారీగా రివార్డు

నీరజ్‌ పంపిన రిపోర్టు చదివాక ఈ లోపాన్ని సోషల్ మీడియా దిగ్గజాలు గుర్తించాయి. ఆపై దీనివల్ల ఎలా యూజర్లకు హాని జరుగుతుందో తెలియజేయాలని ఫేస్‌బుక్‌ సంస్థ అతడిని అడిగింది. దాంతో అతడు వెంటనే ఒక డెమో చేసి పంపించాడు. ఈ డెమోలో ఓ రీల్​ థంబ్​నెయిల్‌ను 5 నిమిషాల్లో మార్చేసి వారికి చూపించాడు.

ఇది కూడా చదవండి : తక్కువ మొత్తానికే బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్.. రూ.30వేల లోపు లభించే మోడళ్లు ఇవే..

దాంతో ఫేస్‌బుక్ కంపెనీ మే 11 రాత్రి సమయంలో ఒక మెయిల్ ఐడీ పంపించి 45,000 డాలర్లు (దాదాపు రూ.35 లక్షలు) రివార్డ్ ఇస్తామని చెప్పింది. కానీ రివార్డు ఫేస్‌బుక్ చెప్పిన సమయానికి అతనికి అందలేదు. 4 నెలల సమయం తర్వాత ఆ అమౌంట్ సెండ్ చేసింది. నాలుగు నెలల పాటు ఆలస్యం చేసినందుకు గాను 4500 డాలర్లు (దాదాపు రూ.3 లక్షలు) బోనస్‌గా ఆఫర్ చేసింది. దీంతో నీరజ్‌కు ఏకంగా రూ.38 లక్షలు దక్కాయి.

* బగ్ బౌంట్రీ ప్రోగ్రామ్ ద్వారా..

ఈ రివార్డ్‌గా గెలుచుకున్న తర్వాత శర్మ మీడియాతో మాట్లాడాడు. “ఫేస్‌బుక్‌కి చెందిన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక బగ్ ఉంది. దాని ద్వారా ఎవరి రీల్ థంబ్‌నెయిల్‌నైనా మార్చవచ్చు. వారి అకౌంట్ పాస్‌వర్డ్ ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా వీటిని మార్చొచ్చు. థంబ్‌నెయిల్‌ మార్చడానికి అకౌంట్ మీడియా ID ఉంటే సరిపోతుంది." అని పేర్కొన్నాడు. బగ్ బౌంట్రీ ప్రోగ్రామ్ కింద నీరజ్‌కు రివార్డ్ వచ్చినట్లు టెక్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Instagram, Rajasthan, Tech news

ఉత్తమ కథలు