• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • NEED FAST BROADBAND BEST 40MBPS 50MBPS AND 100MBPS PLANS YOU CAN SIGN UP FOR MK GH

WFH Broadband: వర్క్​ ఫ్రం హోమ్ చేస్తున్నారా...బెస్ట్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ కోసం...చూడండి..

WFH Broadband: వర్క్​ ఫ్రం హోమ్ చేస్తున్నారా...బెస్ట్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ కోసం...చూడండి..

2. ఈ ప్లాన్స్ నెలకు రూ.901 రెంటల్‌తో ప్రారంభమౌతాయి. రూ.10,001 వరకు ప్లాన్స్ ఉన్నాయి. వేర్వేరు ప్లాన్స్‌కి బెనిఫిట్స్ కూడా వేరుగా ఉంటాయి. ఈ ప్లాన్స్‌లో అన్‌లిమిటెడ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఫిక్స్‌డ్ మొబైల్ కన్వర్జెన్స్, స్టాటిక్ ఐపీ, ప్రొడక్టివిటీ, జియో అటెండెన్స్, మార్కెటింగ్, కాన్ఫరెన్సింగ్, డివైజ్‌లు లభిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)

WFH Broadband: వర్క్​ ఫ్రం హోమ్ చేస్తున్నారా?.. అయితే అన్ని అవసరాలకు సరిపోయే ఉత్తమ బ్రాడ్​బ్యాండ్​ ప్లాన్లపై ఒక లుక్కేయండి

  • Share this:
కరోనా కారణంగా ఏడాది నుంచి అన్ని కంపెనీలు వర్క్​ ఫ్రమ్​ హోమ్​ అమలు చేస్తున్నాయి. విద్యాబోధన కూడా తరగతి గది నుంచి ఆన్​లైన్​కు మారింది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఇంటర్నెట్​ సౌకర్యం అనివార్యమైంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రముఖ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసు ప్రొవైడర్లు లేదా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఉత్తమ బ్రాడ్​బ్యాండ్​ ప్లాన్లను అందిస్తున్నాయి. రిలయన్స్ జియో ఫైబర్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్, ACT, బిఎస్‌ఎన్‌ఎల్, టాటా స్కై, ఎక్సైటెల్ వంటి బ్రాడ్​బ్యాండ్​ సర్వీస్​ ప్రొవైడర్లు రూ.500లోపే మంచి ప్లాన్లను అందిస్తున్నాయి. తక్కువ ధరలోనే 30Mbps నుంచి 50Mbps వరకు డేటా స్పీడ్ ఉండే ప్లాన్లను అందిస్తున్నాయి.

ప్రస్తుతం ఇంటర్నెట్​ సర్వీస్​లో ముందున్న రిలయన్స్ జియో తమ కస్టమర్ల సంఖ్యను మరింతగా పెంచుకునేందుకు రూ. 399 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. దీని కింద 30Mbps అప్‌లోడ్, డౌన్‌లోడ్ స్పీడ్‌తో ఇంటర్నెట్ లభిస్తుంది. దీంతో పాటు రూ. 699 ప్లాన్‌తో 100Mbps వేగంతో మరో డేటా ప్లాన్​ను కూడా అమలు చేస్తోంది. రూ.999 ప్లాన్‌తో 150 Mbps ప్లాన్​ను​ కూడా అమలు చేస్తోంది.

జియోకు పోటీగా ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ కూడా అన్‌లిమిటెడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను అందిస్తోంది. 40Mbps అప్​లోడ్, డౌన్​లోడ్ స్పీడ్‌తో డేటా లబించే ప్లాన్ కేవలం రూ.499 ధర వద్దే లభిస్తుంది. దీంతో పాటు రూ.799కే 100Mbps డేటా స్పీడ్‌తో మరో డేటా ప్లాన్​ అందిస్తుంది. ఈ ప్లాన్లలో చేరిన వారికి అదనంగా ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ వీడియో స్ట్రీమింగ్ సర్వీస్, వింక్ మ్యూజిక్ స్ట్రీమింగ్​ సౌకర్యాలను ఉచితంగా అందిస్తుంది.

ప్రభుత్వ రంగ టెల్కో సంస్థ బీఎస్​ఎన్​ఎల్‌ కూడా ప్రైవేటు కంపెనీలకు గట్టి పోటీనిస్తోంది. చాలా సర్కిల్‌లలో రూ.449 ధర వద్ద 30Mbps డేటా స్పీడ్ ఉండే ఫైబర్ బేసిక్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను అమలు చేస్తోంది. దీంతో పాటు రూ.799 ప్లాన్‌తో 100Mbps వేగంతో కూడిన ఫైబర్ వాల్యూ అనే ప్లాన్‌ను కూడా అందిస్తుంది.

ముంబై కేంద్రంగా పనిచేస్తున్న మరో ప్రభుత్వ టెల్కో సంస్థ MTNL కూడా బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందింస్తుంది. 100 Mbps వేగంతో కూడిన ఎంట్రీ ప్లాన్‌ను రూ.777 కే అందిస్తుంది. వీటితో పాటు టాటా స్కై కూడా బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్​లను అమలు చేస్తోంది. 100Mbps వేగం గల ప్లాన్​ కోసం నెలకు సుమారు రూ. 599, 3 నెలలకు రూ.1797, 6 నెలలకు రూ. 3300, 12 నెలలకు రూ. 6000 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ ప్లాన్ల కింద ఎటువంటి స్ట్రీమింగ్ యాప్​ సభ్యత్వాలు లభించవు.

మరో బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్​ ప్రొవైడర్​ ఎక్సైటెల్, 100 Mbps అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్​కు ప్రతి నెలా రూ. 699 ఖర్చవుతుంది. అయితే మీరు మూడు నెలల మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తే రూ. 565 లకే ఈ ప్లాన్​ లభిస్తుంది.

మరో పాలపులర్​ సర్వీస్​ ప్రొవైడర్​​ ACT బ్రాడ్‌బ్యాండ్.. రూ. 549 వద్ద 40 ఎంబీపీఎస్​, రూ.710 ధర వద్ద 50Mbps వేగం గల డేటా ప్లాన్లను అమలు చేస్తుంది. పైన పేర్కొన్న ఈ బ్యాండ్​బ్యాండ్​ ప్లాన్లతో మీ వర్క్​ ఫ్రం హోమ్​, ఆన్​లైన్​ క్లాసులను అంతరాయం లేకుండా కొనసాగించవచ్చు.
First published:

అగ్ర కథనాలు