హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

ChatGPT: చాట్‌ జీపీటీ దెబ్బకి ఉద్యోగాలు ఫసక్.. భవిష్యత్తుపై ఉద్యోగుల్లో టెన్షన్!

ChatGPT: చాట్‌ జీపీటీ దెబ్బకి ఉద్యోగాలు ఫసక్.. భవిష్యత్తుపై ఉద్యోగుల్లో టెన్షన్!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ChatGPT: ఉద్యోగాలకు సంబంధించి సలహాలు ఇచ్చే వెబ్‌సైట్‌ Resumebuilder.com సుమారు 1,000 మందిపై సర్వే చేసింది. ఆ సర్వేలో కొన్ని ఆసక్తికర అంశాలు తెలిశాయి. యూఎస్‌ కంపెనీల్లో సగానికి పైగా కంపెనీలు చాట్‌జీపీటీని ఉపయోగిస్తున్నాయి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఆర్టిఫిషయల్‌ ఇంటెలిజెన్స్‌(AI)పై ఎన్నో ఏళ్లుగా చర్చ నడుస్తోంది. ఈ టెక్నాలజీ (Technology) అందుబాటులోకి వస్తే ఉద్యోగాలకు భారీ స్థాయిలో కోత పడుతుందనే ఆందోళన చాలామందిలో ఉంది. అయితే ఆ స్థాయిలో ఏఐ రావడానికి చాలా టైం పడుతుందని అందరూ అనుకున్నారు. కానీ చాట్‌జీపీటీ (ChatGPT) వచ్చిన దగ్గర నుంచి అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. చాలా యూఎస్‌ కంపెనీల్లో సంస్థ కార్యకలాపాల్లో భాగంగా అధికారికంగా చాట్‌జీపీటీని ఉపయోగిస్తున్నారు. దీని ఉచిత వెర్షన్‌తో పాటు కొంతమంది పెయిడ్‌ వెర్షన్‌ (20 డాలర్లు)ను కూడా ఉపయోగిస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ సర్వే ప్రకారం చాట్‌జీపీటీ ఎలాంటి ఉద్యోగాలను ఎంతమేర ప్రభావితం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

* ఉద్యోగుల్లో ఆందోళన

ఉద్యోగాలకు సంబంధించి సలహాలు ఇచ్చే వెబ్‌సైట్‌ Resumebuilder.com సుమారు 1,000 మందిపై సర్వే చేసింది. ఆ సర్వేలో కొన్ని ఆసక్తికర అంశాలు తెలిశాయి. యూఎస్‌ కంపెనీల్లో సగానికి పైగా కంపెనీలు చాట్‌జీపీటీని ఉపయోగిస్తున్నాయి. ఉద్యోగుల స్థానంలో దీన్ని ఉపయోగించడం వల్ల సమయం, డబ్బు ఆదా అవుతున్నాయని అవి భావిస్తున్నాయి.

మైక్రోసాఫ్ట్‌ (Microsoft)లో కూడా చాట్ జీపీటీ.. ఉద్యోగుల స్థానాన్ని భర్తీ చేస్తోంది. ఆ కంపెనీ యాజమాన్యాలు చాట్‌జీపీటీ సేవలపై సంతృప్తిగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైందని Resumebuilder.com చీఫ్‌ కెరీర్‌ అడ్వైజర్‌ స్టాసీ హాలర్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

2022 నవంబర్‌లో ప్రారంభమై ఇప్పుడిప్పుడే ఆదరణ పొందుతున్న ఈ టెక్నాలజీ ముందు ముందు ఎలా ప్రభావితం చేస్తుందో ఆలోచించాల్సిన సమయం. ఏదో ఒక్క పనికి మాత్రమే పరిమితం కాకుండా అనేక రకాలుగా దీన్ని ఉపయోగిస్తున్నారు.

కోడ్‌ రాసేందుకు 66% మంది, కంటెంట్‌ క్రియేట్‌ చేయడం కోసం 58% మంది, కస్టమర్ సేవల కోసం 57% మంది, ఆఫీసుల్లో ఈమెయిల్స్‌, మినిట్స్‌ ఆఫ్‌ మీటింగ్స్‌ తదితర డాక్యుమెంటేషన్‌ వర్క్‌ కోసం 52% మంది చాట్‌ జీపీటీని ఉపయోగిస్తున్నట్లు సర్వేలో తెలిసింది. దీని సేవలు అద్భుతంగా ఉన్నాయని 55% మంది, బాగున్నాయని 34% మంది కంపెనీ యజమానులు సర్వేలో తెలిపారు.

ఇది కూడా చదవండి : ఈ ఒక్క రూల్ పాటిస్తే ఫోన్ బ్యాటరీ సేఫ్.. ఈ నిజం తెలియకపోతే మీ స్మార్ట్‌ఫోన్‌ ఫసక్కే!

* భవిష్యత్తు ఏంటి?

చాట్‌జీపీటీ మేలైన సేవలు పొందవచ్చును కానీ దీనిపై పూర్తిగా ఆధారపడొద్దని చాట్‌జీపీటీ వ్యవస్థాపకుడు సామ్ ఆల్ట్‌మాన్ సూచిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కలిగే నష్టాల గురించి ఆయన కొంత ఆందోళన వ్యక్తం చేశారు. ఇండియాలో సైతం కొన్ని కంపెనీలు చాట్‌ జీపీటీ వంటి ఏఐ ఫ్లాట్‌ఫామ్స్‌ను ఉపయోగిస్తున్నాయి. అయితే ఇది ఉద్యోగంలో మనకు సహాయపడుతుంది తప్ప, ఉద్యోగాలకు నష్టం ఉండదని అంటున్నారు.

ఆఫీస్‌లో మన పని మరింత సులువు చేసేందుకు చాట్‌ జీపీటీ ఉపయోగపడుతుంది, కానీ ఉద్యోగుల స్థానాన్ని భర్తీ చేయదని టీసీఎస్‌ చీఫ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ ఆఫీసర్‌ మిలింద్‌ లక్కడ్‌ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కంపెనీ, కస్టమర్‌- సెంట్రిక్‌గా ఉపయోగపడుతుందని అన్నారు. భవిష్యత్తులో దీని ఫలితాలు ఎలా ఉండనున్న ఉద్యోగుల్లో మాత్రం అభద్రత నెలకొందనేది మాత్రం నిజం.

First published:

Tags: Chatgpt, JOBS, Tech news, USA

ఉత్తమ కథలు