NCA IN THE UK RECOVERS A HUGE PILE OF STOLEN PASSWORDS AND HERE HOW TO CHECK WHETHER YOUR PASSWORD IS STOLEN OR NOT GH SRD
Stolen Passwords: వామ్మో.. దొంగతనానికి గురైన 22 కోట్ల పాస్వర్డ్స్.. మీ పాస్వర్డ్ హ్యాక్ అయిందో లేదో ఇలా చెక్ చేయండి
ప్రతీకాత్మక చిత్రం
Stolen Passwords: లీకైన పాస్వర్డ్లు సైబర్ నేరగాళ్లకు ఒక ‘నిధి’లా ఉపయోగపడతాయి. బ్యాంకింగ్ సహా ఇతర ఆన్లైన్ సేవలకు సంబంధించి మీ పాస్వర్డ్ ఎలా ఉంటుందో అంచనా వేయడానికి వీటిని ఉపయోగిస్తారు.
ప్రస్తుత డిజిటల్ యుగంలో ఈమెయిల్స్, సోషల్ మీడియా అకౌంట్లు, పాస్వర్డ్లు సైతం దొంగతనానికి గురవుతున్నాయి. దీన్నే హ్యాకింగ్ అంటున్నారు. అయితే ఇలా దొంగతనానికి గురైన ఈమెయిల్స్, పాస్‌వర్డ్స్‌ను తిరిగి సేకరించాయి UKలోని సెక్యూరిటీ ఏజెన్సీలు. అక్కడి నేషనల్ క్రైమ్ ఏజెన్సీ (NCA), నేషనల్ సైబర్ క్రైమ్ యూనిట్ (NCCU) సహా ఇతర ఏజెన్సీలు దొంగతనానికి గురైన పాస్వర్డ్లు, ఈమెయిల్ IDలను తిరిగి పొందాయి. హ్యాకింగ్‌కు గురైన క్లౌడ్ స్టోరేజ్ ఫెసిలిటీ నుంచి వీటిని అధికారులు రికవర్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇంటర్నెట్ యూజర్లను ఈ అంశం ప్రభావితం చేయనుంది. దాదాపు 22.5 కోట్ల పాస్‌వర్డ్‌లను రికవరీ చేశామని, వాటిని ‘హ్యావ్ ఐ బీన్ పాన్డ్’(Have I Been Pwned- HIBP) డేటాబేస్కు డొనేట్ చేశామని NCA తెలిపింది.
‘Have I Been Pwned’ అనేది ఒక ఫ్రీ సర్వీస్ ప్లాట్‌ఫాం. దీని ద్వారా ఎవరైనా తమ పాస్వర్డ్ లేదా ఈమెయిల్ ఐడీ లీక్ అయిందా లేదా అని తనిఖీ చేసుకోవచ్చు. పోలీసుల నుంచి స్వీకరించిన అతిపెద్ద డేటాబేస్ ఇదేనని HIBP వెల్లడించింది. ఈ సంస్థ డేటాబేస్‌లో ఇప్పటికే 61.3 కోట్ల స్టోలెన్ పాస్వర్డ్లు ఉండగా, బ్రిటన్ పోలీసులు అందించిన వాటిని వీటికి యాడ్ చేశారు.
లీకైన పాస్వర్డ్లు సైబర్ నేరగాళ్లకు ఒక ‘నిధి’లా ఉపయోగపడతాయి. బ్యాంకింగ్ సహా ఇతర ఆన్లైన్ సేవలకు సంబంధించి మీ పాస్వర్డ్ ఎలా ఉంటుందో అంచనా వేయడానికి వారు ఈ పాస్‌వర్డ్‌లను ఉపయోగిస్తారు. ఇందుకు ప్రత్యేకమైన సాఫ్ట్వేర్స్ వాడుతారు. ‘Have I Been Pwned’ వెబ్సైట్ ద్వారా మీ పాస్వర్డ్ ఇప్పటికే సైబర్ నేరగాళ్ల డేటాబేస్‌లో ఉందో లేదో తెలుసుకోవచ్చు. అనంతరం హ్యాకింగ్ బారిన పడకముందే వాటిని మార్చుకోవచ్చు.
* మీ పాస్వర్డ్ దొంగతనానికి గురైందో లేదో తనిఖీ చేయడం ఎలా?
మీ పాస్వర్డ్ లేదా ఈమెయిల్ ఐడీ ఇప్పటికే నేరస్థులకు అందుబాటులో ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఇందుకు ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.
- మీ ఈమెయిల్ ఐడీ సేఫ్‌గా ఉందో లేదో చెక్ చేయడానికి.. మీ ఈమెయిల్ ఐడీని ఎంటర్ చేసి, ‘pwned?’ బటన్‌పై క్లిక్ చేయండి. మీ ఐడీ లీక్ అయితే, దీని గురించి సైట్ మిమ్మల్ని హెచ్చరిస్తుంది.
- మీ పాస్వర్డ్ దొంగతనానికి గురైందో లేదో చెక్ చేయడానికి.. వెబ్సైట్ పై భాగంలో ఉన్న ‘Passwords’ ట్యాబ్‌కి వెళ్లండి. అందులో మీ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి చెక్ చేయండి
* డేటా లీక్ అయితే ఏం చేయాలి?
ఒకవేళ మీ వివరాలు లీక్ అయ్యాయని వెబ్సైట్ ద్వారా తెలిస్తే, వెంటనే పాత పాస్‌వర్డ్‌ను మార్చండి. మరింత సంక్లిష్టమైన, ట్రేస్ చేయడానికి కష్టమైన వాటిని పాస్‌వర్డ్‌గా ఎంచుకోండి. అయితే ఈ వెబ్సైట్ నుంచి మీకు హెచ్చరిక వచ్చినంత మాత్రాన, మీ అకౌంట్ హ్యాక్ అయిందని అర్థం కాదు. మీ ఈమెయిల్ ఐడీ లేదా పాస్వర్డ్ ఇప్పటికే సైబర్ నేరగాళ్ల రాడార్‌లో ఉందా లేదా అనే వివరాలను మాత్రమే ఈ వెబ్సైట్ తెలియజేస్తుంది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.