NAVRATRI 2021 WHATSAPP STICKERS HOW TO DOWNLOAD SHARE NAVRATRI STICKERS ON WHATSAPP MK GH
Navratri Stickers: వాట్సాప్‌లో నవరాత్రి స్టిక్కర్స్ ఎలా డౌన్ లోడ్ చేయాలి? ఎలా షేర్ చేయాలి? తెలుసుకోండి..
ప్రతీకాత్మకచిత్రం
నవరాత్రి- 2021 స్టికర్స్ ఉపయోగించి మీ శ్రేయోభిలాషులకు ఫెస్టివల్ విషెస్ వినూత్నంగా చెప్పవచ్చు. ఇందుకోసం వాట్సాప్ లాంటి మెసేజింగ్ యాప్స్ కు చెందిన సరికొత్త నవరాత్రి స్టిక్కర్స్ ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి.
దేశవ్యాప్తంగా పండుగ కోలాహలం మిన్నంటుతోంది. భారత్‌లో విజయదశమిని ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ముఖ్యంగా నవరాత్రి ఉత్సవాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. 9 రోజుల పాటు వివిధ అవతారాల్లో దుర్గాదేవిని పూజించి మొక్కులు చెల్లించుకుంటారు. అక్టోబరు 6న ప్రారంభమైన ఈ వేడుకలు అక్టోబరు 15న వచ్చే దసరాతో ముగుస్తాయి. గత సంవత్సరం మాదిరిగానే కరోనా మహమ్మారి ప్రభావం ఈ సారి కూడా పండుగపై పడింది. అయితే అంతమాత్రాన మన సన్నిహితులు, స్నేహితులు, బంధువులకు నవరాత్రి శుభాకాంక్షలు చెప్పకూడదని కాదు. నవరాత్రి 2021 స్టికర్స్ ఉపయోగించి మీ శ్రేయోభిలాషులకు ఫెస్టివల్ విషెస్ వినూత్నంగా చెప్పవచ్చు. ఇందుకోసం వాట్సాప్ లాంటి మెసేజింగ్ యాప్స్ కు చెందిన సరికొత్త నవరాత్రి స్టిక్కర్స్ ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి.
వాట్సాప్ మాత్రమే కాకుండా ఇతర మెసెజింగ్ యాప్స్ కు చెందిన స్టిక్కర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఈ ఫెస్టివ్ సీజన్ లో వాటిని డౌన్ లోడ్ చేసుకుని బంధు, మిత్రులకు పండుగ శుభాకాంక్షలు, అభినందనలు తెలపవచ్చు. మరి వాట్సాప్ లో ఈ స్టిక్కర్స్ ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో చూద్దాం.
* వాట్సాప్‌లో నవరాత్రి- 2021 స్టిక్కర్స్ ఎలా డౌన్ లోడ్ చేయాలి..
స్టెప్-1..
ముందు మీ స్మార్ట్ ఫోన్ లో యాప్ స్టోర్‌కు వెళ్లాలి. ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతుంటే గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లవచ్చు. ఐఫోన్ వాడుతున్నవారు యాపిల్ స్టోర్‌ను సందర్శించాలి.
స్టెప్-2..
అనంతరం నవరాత్రి 2021 వాట్సాప్ స్టిక్కర్స్ అని సెర్చ్ చేయాలి. అక్కడ మీకు కొన్ని అప్లికేషన్స్ సూచనలు కనిపిస్తాయి.
స్టెప్-3..
ఇమేజ్ ట్యాగ్ ద్వారా హ్యాపీ నవరాత్రి స్టిక్కర్స్, వాట్సాప్ ఫర్ నవరాత్రి స్టిక్కర్స్ ఎంచుకోవచ్చు లేదా మీకు నచ్చిన ఇతర యాప్స్ లోకి వెళ్లవచ్చు.
స్టెప్-4..
మీ డివైజ్ లో నవరాత్రి స్టిక్కర్స్ కు సంబంధించిన యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలి.
స్టెప్-5..
యాప్ లోపలికి వెళ్లి 'ఓపెన్ స్టిక్కర్ ప్యాక్స్' ఆప్షన్ పై నొక్కాలి.
స్టెప్-6..
ఇక్కడ మీకు వివిధ రకాల నవరాత్రి 2021 స్టిక్కర్స్ కనిపిస్తాయి.
స్టెప్-7..
అనంతరం మీకు కావాల్సిన స్టిక్కర్ ను ఎంచుకోవడానికి కుడివైపున ఉన్న ప్లస్ గుర్తుపై క్లిక్ చేసి, వాటిని కలెక్షన్ లో పెట్టుకోవచ్చు.
స్టెప్-8..
స్టిక్కర్స్ ను సపోర్ట్ చేసే అన్ని మెసేజింగ్ యాప్స్‌లో ఈ ఆప్షన్ ఉంటుంది. 'యాడ్' సింబల్‌పై క్లిక్ చేసి మీరు ఎంచుకున్న స్టిక్కర్ ఆప్షన్‌ను కన్ఫార్మ్ చేయాలి. అనంతరం తక్షణ సందేశంగా మీ వాట్సాప్‌కు ఈ స్టిక్కర్ ప్యాక్ యాడ్ అవుతుంది. అదనంగా వాట్సాప్ లో అందుబాటులో ఉన్న నవరాత్రి 2021 జీఐఎఫ్(GIF)లను ఎంచుకొని షేర్ చేసుకోవచ్చు.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.