హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

ప్రభుత్వ కంప్యూటర్లపై సైబర్ దాడి... ప్రధాని మోదీ, అజిత్ ధోవల్ సమాచారానికి ముప్పు

ప్రభుత్వ కంప్యూటర్లపై సైబర్ దాడి... ప్రధాని మోదీ, అజిత్ ధోవల్ సమాచారానికి ముప్పు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Data Breach | కేంద్ర ప్రభుత్వానికి చెందిన కంప్యూటర్లపై సైబర్ దాడి జరిగింది. బెంగళూరు నుంచి ఈ సైబర్ దాడి జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించారు.

ప్రధాన మంత్రి మోదీ, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ ధోవల్ లాంటి వీవీఐపీలతో పాటు ఇతర కీలకమైన సమాచారం ఉండే కంప్యూటర్లపై సైబర్ దాడి జరిగినట్టు నేషనల్ ఇన్ఫర్మెటిక్ సెంటర్ గుర్తించింది. దీనిపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఢిల్లీ పోలీస్‌కు చెందిన స్పెషల్ సెల్ వెంటనే ఈ సైబర్ దాడిపై కేసు ఫైల్ చేసింది. బెంగళూరు నుంచి ఈ దాడి జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఈ కంప్యూటర్లలో ప్రధాని మోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, ఇతర సీనియర్ ప్రభుత్వ అధికారులు, సంస్థలు, భారత పౌరులకు సంబంధించిన సమాచారం స్టోర్ అయి ఉంటుంది. ప్రభుత్వానికి చెందిన ఇలాంటి కీలక సమాచారాన్ని భద్రపరచడం, రక్షించడం లాంటి బాధ్యతల్ని నేషనల్ ఇన్ఫర్మెటిక్ సెంటర్ చూసుకుంటుంది.

Samsung Galaxy M51: ఈరోజే సాంసంగ్ గెలాక్సీ ఎం51 ఫస్ట్ సేల్... రూ.2,000 డిస్కౌంట్

Realme Narzo 20: షాక్... రిలీజ్‌కు ముందే లీకైన రియల్‌మీ నార్జో 20 స్పెసిఫికేషన్స్

సెప్టెంబర్ మొదటి వారంలో ఈ సైబర్ దాడి జరిగినట్టు బయటపడింది. నేషనల్ ఇన్ఫర్మెటిక్ సెంటర్ ఉద్యోగులకు ఇమెయిల్ పంపి ఈ సైబర్ దాడి చేసినట్టు తెలుస్తోంది. ఉద్యోగులు ఆ ఇమెయిల్ క్లిక్ చేయగానే కొంత డేటా కంప్యూటర్‌లో స్టోర్ అయింది. ఆ తర్వాత కంప్యూటర్ సిస్టమ్స్‌పై ఆ డేటా సాయంతో హ్యాకర్లు దాడి చేశారు. ఆ ఇమెయిల్ ఐడీ ఎక్కడి నుంచి వచ్చిందని ఐపీ అడ్రస్ ద్వారా ఆరా తీస్తే బెంగళూరులో ఉన్న అమెరికాకు చెందిన కంపెనీదని తేలింది. దీనిపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది.

Redmi 9i: కాసేపట్లో రెడ్‌మీ 9ఐ సేల్... రూ.10,000 లోపే 4GB+128GB స్మార్ట్‌ఫోన్

SBI ATM: అలర్ట్... ఎస్‌బీఐ ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా? కొత్త రూల్ తెలుసుకోండి

ఇప్పటికే చైనాకు చెందిన ఝెన్హువా డేటా ఇన్ఫర్మేషన్ భారత ప్రధాన మంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఆర్మీ చీఫ్‌తో పాటు వేలాది మంది వీవీఐపీలపై రహస్యంగా నిఘా పెడుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇంతలో ఇప్పుడు ఈ సైబర్ దాడి బయటపడటం కలకలం రేపుతోంది. ఈ ఆరోపణలపై నేషనల్ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 30 రోజుల్లో నివేదిక రానుంది.

First published:

Tags: Ajit Doval, Breaking news, DATA BREACH, Data theft, Narendra modi, Personal Data, Pm modi, PM Narendra Modi

ఉత్తమ కథలు