ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ యాప్ ఇ-గవర్నెన్స్‌లో నేషనల్ అవార్డ్ సొంతం చేసుకుంది. ఈ యాప్ ద్వారా రైలు టికెట్ బుకింగ్‌ను సులభతరం చేయడంతో పాటు ప్రయాణికులకు మరిన్ని సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది ఐఆర్సీటీసీ. ఐఆర్సీటీసీ నెక్స్ట్-జెనరేషన్ ఇ-టికెటింగ్ సిస్టమ్ 2014లో లాంఛైంది. 2014లో IRCTC Connect పేరుతో లాంఛ్ చేసిన యాప్‌ను 2017లో 'IRCTC Rail Connect' యాప్‌ను రీలాంఛ్ చేయడం విశేషం. బుకింగ్ సామర్థ్యాన్ని నిమిషానికి 2,000 టికెట్ల నుంచి 20,000 టికెట్లకు పెంచారు. 2017 జనవరి నాటికి మూడు కోట్ల యూజర్లు ఉండగా 14 కోట్ల బుకింగ్స్ జరిగాయి. ఇప్పటికీ రోజూ 45 లక్షల మంది యూజర్లు సేవలు పొందుతున్నారని అంచనా ప్యాసింజర్ ఫ్రెండ్లీ ఫీచర్స్‌తో సేవలు అందిస్తున్న ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ యాప్ సేవలకు డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటీవ్ రీఫామ్స్ అండ్ పబ్లిక్ గ్రీవియెన్సెస్ అవార్డు ప్రకటించింది. మరి ఆ IRCTC Rail Connect యాప్ అందిస్తున్న టాప్ 10 సేవల గురించి తెలుసుకోండి.
1. ప్రతీసారి యూజర్ నేమ్, పాస్వర్డ్ చేయాల్సిన అవసరం లేకుండా 4 అంకెల పిన్‌తో లాగిన్ చేయొచ్చు.
2. ఈ యాప్ ద్వారా మీ రైలు ప్రయాణాన్ని ఇంకా బాగా ప్లాన్ చేసుకోవచ్చు. ముందుగానే కన్ఫర్మేషన్ ప్రాబబిలిటీ తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్లాలో రైల్వే స్టేషన్ల పేర్లు, తేదీ ఎంటర్ చేయాలి. మీరు కోరుకునే రైలు, క్లాస్‌లో కన్ఫర్మేషన్ ప్రాబబిలిటీ చూడొచ్చు. మీరు టికెట్ బుక్ చేస్తే కన్ఫామ్ అయ్యే అవకాశాలు ఎంత శాతం ఉన్నాయో తెలిసిపోతుంది.
3. సీటు లభ్యతను బట్టి మీరు టికెట్ బుక్ చేయడానికి నెక్స్ట్ స్టెప్‌కి వెళ్లొచ్చు. పేరు, వయస్సు, జెండర్, బెర్త్ ప్రిఫరెన్స్ లాంటి ప్రయాణికుల వివరాలు ఎంటర్ చేసి టికెట్ బుక్ చేయొచ్చు. మీరు ఒకేసారి ఆరుగురు ప్రయాణికులకు టికెట్లు తీసుకోవచ్చు.
4. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, తత్కాల్, ప్రీమియం తత్కాల్ కోటా బుకింగ్ చేయొచ్చు. కరెంట్ రిజర్వేషన్ ఫెసిలిటీ, బోర్డింగ్ పాయింట్ ఛేంజ్ ఫెసిలిటీ ఉన్నాయి.
5. ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్‌లో బుక్ చేసిన టికెట్లను ఏ ప్లాట్ఫామ్లో అయినా క్యాన్సిల్ చేయొచ్చు. టీడీఆర్ ఫైల్ చేయొచ్చు.
6. ఐఆర్సీటీసీ ఇ-వ్యాలెట్‌లో రీఫండ్ ట్రాక్ చేయొచ్చు. యూపీఐ, భీమ్, వ్యాలెట్స్, క్రెడిట్, డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ ద్వారా లావాదేవీలు జరపొచ్చు.
7. వికల్ప్ స్కీమ్‌లో భాగంగా వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులు ప్రత్యామ్నాయ రైళ్లను ఎంచుకోవచ్చు. పీఎన్ఆర్, ట్రెయిన్ నెంబర్ లాంటి టికెట్ వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
8. ఆధార్ ధృవీకరణ మొబైల్ యాప్ ద్వారా చేయొచ్చు. అన్ని రకాల టికెట్ల పీఎన్ఆర్ ఎంక్వైరీ సాధ్యం. మాస్టర్ ప్యాసింజర్ లిస్ట్‌లో కొత్త ప్రయాణికులను యాడ్ చేయొచ్చు.
9. ఐఆర్సీటీసీ ఆథరైజ్డ్ ఆన్లైన్ ట్రావెల్ ఏజెంట్స్ దగ్గర బుగ్ చేసిన ఇ-టికెట్స్ స్టేటస్ కూడా ఐఆర్సీటీసీ కొత్త యాప్‌లో తెలుసుకోవచ్చు. అంతేకాదు మీ పాత టికెట్ల వివరాలు కూడా యాప్‌లో ఉంటాయి.
10. రైల్ కనెక్ట్ యాప్‌లో 'బుక్ ఎ మీల్' పేరుతో కొత్త ఫీచర్ ఉంది. రెస్టారెంట్ ఫుడ్ నేరుగా మీ సీటు దగ్గరకే వస్తుంది. ఈ సర్వీస్ ఉపయోగించడానికి మీరు మీ 10 అంకెల పీఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ యాప్‌తో చాలా ఉపయోగాలు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ యూజర్లు పెరిగిపోతుండటంతో మొబైల్ యాప్‌లో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తోంది ఐఆర్సీటీసీ. ఈ యాప్‌ను మీరు గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Photoshoot: క్యాన్సర్‌తో యువతి పోరాటం... పెళ్లి కూతురులా ముస్తాబై ఫోటోలు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.