NASA : గ్రహశకలంపై మనిషి ముఖం... వైరల్ అయిన నాసా ఫొటో...

NASA - Bennu Asteroid : బెన్ను గ్రహశకలాన్ని అత్యంత దగ్గరగా తీసిన ఫొటోను నాసా సేకరించింది. దానిపై మనిషి ముఖం ఉందా?

Krishna Kumar N | news18-telugu
Updated: June 20, 2019, 7:53 AM IST
NASA : గ్రహశకలంపై మనిషి ముఖం... వైరల్ అయిన నాసా ఫొటో...
గ్రహశకలంపై అది మనిషి ముఖమేనా? (image : © NASA/Goddard/University of Arizona)
Krishna Kumar N | news18-telugu
Updated: June 20, 2019, 7:53 AM IST
NASA's OSIRIS-REx spacecraft : మన అంతరిక్షంలో తిరుగుతున్న బెన్ను గ్రహశకలాన్ని పరిశోధించేందుకు నాసా ఓసిరిస్-రెక్స్ అనే స్పేస్‌క్రాఫ్ట్‌ని పంపింది. ఆ శాటిలైట్... బెన్ను గ్రహశకలాన్ని తొలిసారిగా అత్యంత దగ్గర నుంచీ ఫొటోలు తీసింది. భూమికి దగ్గరగా తిరుగుతున్న గ్రహశకలాల్లో ఒకటైన బెన్నూని... డిసెంబర్ 31న చేరింది స్పేస్ క్రాఫ్ట్. అప్పటి నుంచీ దాన్ని సమీపిస్తూ... జూన్ 13న అత్యంత దగ్గరకు వెళ్లింది. 700 మీటర్ల దూరం నుంచీ గ్రహశకలం ఉపరితలాన్ని ఫొటోలు తీసింది. ఈ ఫొటోలో 1.6 అడుగుల దూరం కూడా ఎంతో స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఇలాంటి ఎన్నో ఫొటోలను స్పేస్ క్రాఫ్ట్... నాసాకి పంపింది. వాటిని ఫిల్టర్ చేసే పనిలో ఉన్నారు శాస్త్రవేత్తలు.

స్పేస్ క్రాఫ్ట్ తీసిన ఫొటో (image : © NASA/Goddard/University of Arizona)


అది మనిషి ముఖమేనా : నాసా రిలీజ్ చేసిన ఈ ఫొటోలో... పైన కనిపిస్తున్న భారీ రాయి... అచ్చం మనిషి ముఖంలా ఉందన్న వాదన వినిపిస్తోంది.

asteroid bennu,nasa,bennu,asteroid,asteroid bennu nasa,bennu asteroid,nasa asteroid bennu,osiris-rex mission to asteroid bennu,bennu asteroid impact,bennu asteroid nasa,nasa asteroid bennu's journey,nasa bennu,asteroid bennu sample,asteroid mining,asteroid bennu spins faster an,asteroid bennu impact,found on asteroid bennu as,asteroid bennu 2019,asteroids,asteroid bennu orbit,asteroid impact,గ్రహశకలం,నాసా,మనిషి ముఖం,గ్రహశకలంపై మనిషి,
గ్రహశకలంపై అది మనిషి ముఖమేనా? (image : © NASA/Goddard/University of Arizona)




ఈ ఫొటోని చూసిన నెటిజన్లు ఎవరికి తోచినట్లు వారు తమ అభిప్రాయం చెబుతున్నారు. కొందరైతే... ఆ రాయిపై స్కెచ్ వేసి... అది నవ్వుతున్న మనిషి ముఖమే అంటున్నారు.

స్కెచ్‌తో మార్పులు చేసిన ఫొటో (Image : Twitter / ΪǾ1➁⓿º)


నాసా ఇలాంటి ఫొటోలను రిలీజ్ చేసినప్పుడల్లా... ఇలాంటి ఊహాకల్పిత ఆలోచనలను పంచుకోవడం సహజమే. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అయ్యింది. మనిషి ముఖానికి సంబంధించి నాసా ఎలాంటి ప్రకటనా చెయ్యలేదు.
Loading...
బెన్నూ గ్రహశకలం ((Image: © NASA/Goddard/University of Arizona/Lockheed Martin)


ఇవి కూడా చదవండి :

Video : అయ్యో పాపం... ఐదేళ్ల చిన్నారిపై కుక్కల దాడి...

చెర్రీ ఫ్రీడమ్ పొందిన చైనా... మరి మనకెప్పుడు యాపిల్ ఫ్రీడమ్?

First published: June 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...