NASA Offer : మార్స్‌పైకి మీ పేరు పంపాలా... ఇలా చెయ్యండి...

NASA Mars 2020 : 2030 కల్లా మార్స్‌పైకి మానవుల్ని పంపాలనుకుంటున్న నాసా... తాజాగా 2020 నాటికి ఓ రోవర్‌ను పంపబోతోంది. దాని ద్వారా మానవుల పేర్లను మార్స్‌పైకి పంపబోతోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: September 13, 2019, 7:20 AM IST
NASA Offer : మార్స్‌పైకి మీ పేరు పంపాలా... ఇలా చెయ్యండి...
మార్స్ పైకి మన పేరు (Image : NASA)
  • Share this:
భూమి తర్వాత మనుషులు బతికే అవకాశం ఉన్న గ్రహంగా మార్స్ (అంగారక గ్రహం లేదా అరుణ గ్రహం)ని చెబుతున్న నాసా... దాన్ని చేరుకునే దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా... ఇప్పటికే డజన్ల కొద్దీ శాటిలైట్లు, రోవర్లను అక్కడకు పంపింది. తాజాగా... మరో రోవర్‌ను జులై 17, 2020లో భూమిపై నుంచీ మార్స్‌కి పంపబోతోంది. ఆ రోవర్... 2021 ఫిబ్రవరి 18న రెడ్ ప్లానెట్‌ (మార్స్)పై దిగుతుంది. ఈసారి స్పెషల్ ఏంటంటే... ఆ రోవర్ ద్వారా... భూమిపై ఉన్న మనుషుల పేర్లను నాసా పంపబోతోంది. ఇందుకు మనల్ని పేర్లు ఎంటర్ చేసుకోమని కోరుతోంది. మీకు కూడా ఆసక్తి ఉంటే, మీ పేరును మార్స్‌పైకి పంపాలనుకుంటే... పంపొచ్చు. అందుకు సెప్టెంబర్ 30 వరకే టైమ్ ఉంది. ఆలోగా పంపాల్సి ఉంటుంది. అదేమీ కష్టమైన పని కాదు. నిమిషం కూడా పట్టదు. అదెలాగో తెలుసుకోండి మరి.

మీ పేరును ఇలా ఎంటర్ చెయ్యండి :- ముందుగా... ఈ లింక్‌ (mars.nasa.gov/participate/send-your-name/mars2020)లోకి వెళ్లాలి.
- లింక్ ఓపెన్ అయ్యాక... ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, దేశం పేరు, పోస్టల్ కోడ్, ఈమెయిల్ అడ్రెస్ ఇవ్వాలి.
- ఆ తర్వాత Send my name to Mars అన్నది క్లిక్ చెయ్యాలి.
- అంతే... మీ పేరు నమోదవుతుంది. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- కొత్త పేజీలో మీ పేరు ఎలా ఉన్నదీ బోర్డింగ్ పాస్ రూపంలో కనిపిస్తుంది.
- ఆ టికెట్‌ను మీరు ప్రింట్ తీసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎంబెడ్ కూడా చేసుకోవచ్చు.

మార్స్ పైకి మన పేరు (Image : NASA)


మీ పేరు ఇతర వివరాల్ని నాసా... ఓ మైక్రో చిప్‌లో సెట్ చేస్తుంది. 1000 కేజీల బరువున్న రోవర్... మార్స్‌పైకి వెళ్లి... అక్కడ సూక్ష్మజీవులు ఉన్నాయో లేదో తెలుసుకుంటుంది. అలాగే అక్కడి వాతావరణం, ఖనిజాలు, శాంపిల్స్ సేకరించి... తిరిగి భూమికి తెస్తుంది.

ఇప్పటికే 91 లక్షల మందికి పైగా తమ పేరును నమోదు చేసుకున్నారు. మీరూ చేసుకుంటే... భవిష్యత్తులో మార్స్ మిషన్లకు కూడా మీ పేరును పంపుతుంది నాసా. అయితే అందుకు మీ పర్మిషన్ కూడా తప్పక తీసుకుంటుంది.
First published: September 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>