వచ్చే ఏడాది మార్స్‌‌పైకి మరో నాసా రోవర్... ఇవీ ప్రత్యేకతలు

MARS 2020 : అంగారక గ్రహంపై ఎలాగైనా మనుషుల కోసం కాలనీ నిర్మించాలనుకుంటున్న నాసా... ఆ దిశగా మరో అడుగు 2020లో వెయ్యబోతోంది.

news18-telugu
Updated: December 20, 2019, 7:11 AM IST
వచ్చే ఏడాది మార్స్‌‌పైకి మరో నాసా రోవర్... ఇవీ ప్రత్యేకతలు
వచ్చే ఏడాది మార్స్‌‌పైకి మరో నాసా రోవర్... ఇవీ ప్రత్యేకతలు (credit - NASA)
  • Share this:
MARS 2020 : మనందరికీ తెలుసు 2004లో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (NASA)... అంగారక గ్రహంపైకి క్యూరియోసిటీ రోవర్‌ని పంపింది. కారు అంత సైజున్న ఆ రోవర్... మార్స్‌పై జాగ్రత్తగా దిగి... కొన్ని వేల ఫొటోల్ని నాసాకు పంపింది. వాటి ద్వారా మనకు అర్థమైనది ఒకటే. ప్రస్తుతం మార్స్‌పై జీవం లేదు. నీటి జాడలు ఉన్నట్లు తెలుస్తున్నా... ఆ విషయంపైనా పూర్తి స్పష్టత లేదు. అయినప్పటికీ పట్టు వదలని నాసా... మరో రోవర్‌ను 2020 వేసవిలో పంపబోతోంది. ఆ రోవర్ 10 నెలలు రోదసిలో ప్రయాణించి... 2021లో మార్స్‌పై దిగుతుంది. అది అంగారక గ్రహంపై ఒకప్పుడు జీవం ఉండేదా లేదా అన్న విషయాన్ని కచ్చితంగా తెలుసుకోబోతోంది. నాసా అంచనా ఏంటంటే... ఇప్పుడు మన భూమి ఎలా ఉందో... కొన్ని వందల కోట్ల సంవత్సరాల కిందట మార్స్ కూడా అలాగే ఉండేదని. ఐతే... అప్పట్లో మార్స్‌పై ఉండే నీరు ఇప్పుడు ఎందుకు లేదు? అది ఏమైపోయింది? అన్న ప్రశ్నలకు సరైన సమాధానం లేదు. ఐతే... మార్స్‌పై ఒకప్పుడు నీరు ఉండేదని స్పిరిట్, ఆపర్చునిటీ, క్యూరియోసిటీ రోవర్లు పంపిన ఫొటోలూ, డేటాను బట్టీ తెలిసింది. మార్స్ 2020 అనే రోవర్‌కి ఓ భారీ ఎలక్ట్రానిక్ చెయ్యి ఉంటుంది. అది ఒక్కటే 45 కేజీల బరువు ఉంటుంది. ఆ చెయ్యి... మార్స్ భూమిని డ్రిల్లింగ్ చేసి తవ్వుతుంది. అక్కడి రాళ్లను ముక్కలు చేస్తుంది. ఆ శాంపిల్స్‌ని భూమికి పంపుతుంది. ఇదంతా జరిగేది జెజెరో పగులు లోయలో. అక్కడే ఎందుకంటే... వందల కోట్ల ఏళ్ల కిందట ఆ లోయలో నీరు ఉండేదనీ... ఆ డెల్టా ప్రాంతంలో పంటలు పండేవని అంచనా. అందుకే 1025 కేజీల బరువుండే మార్స్ 2020 రోవర్... అక్కడ పరిశోధన చెయ్యబోతోంది.First published: December 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు