NASA Tour: అంతరిక్ష కేంద్రానికి టూర్... ఒక్క రాత్రికి ఎంతో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

NASA Tour | ప్రైవేట్ ఆస్ట్రోనాట్స్ ఐఎస్ఎస్‌లో 30 రోజుల వరకు ఉండొచ్చు. అయితే ప్రైవేట్ ఆస్ట్రోనాట్స్‌కు ఆరోగ్య పరీక్షలతో పాటు శిక్షణ తప్పనిసరి.

  • Share this:
    నాసా నుంచి గుడ్ న్యూస్. ఎవరైనా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు టూర్ వెళ్లొచ్చు. ప్రైవేట్ వ్యక్తులకు ఈ అవకాశం కల్పిస్తోంది నాసా. నెల రోజుల పాటు నాసాలో స్టే చేయొచ్చు. మరి ఒక్క రాత్రి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌‌లో బస చేయాలంటే ఎంత చెల్లించాలో తెలుసా? 35,000 డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.25 లక్షలు. సాధారణంగా నాసాకు చెందిన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌‌కు ప్రైవేట్ వ్యక్తులు, టూరిస్టులకు అనుమతి ఉండదు. కానీ నిబంధల్ని సడలిస్తోంది నాసా. ఆర్బిటింగ్ స్టేషన్‌ను టూరిజమ్ స్పాట్‌గా మార్చడం మాత్రమే కాకుండా, వ్యాపార కార్యకలాపాలను ప్రోత్సహించాలని భావిస్తోంది నాసా. అందులో భాగంగానే టూరిస్టులకు స్వాగతం పలుకుతోంది.

    అంతేకాదు.. ప్రతీ ఏడాది రెండు ప్రైవేట్ ఆస్ట్రోనాట్ మిషన్స్ నిర్వహించబోతున్నట్టు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్-ISS డిప్యూటీ డైరెక్టర్ రాబిన్ గేటెన్స్ తెలిపారు. ప్రైవేట్ ఆస్ట్రోనాట్స్ ఐఎస్ఎస్‌లో 30 రోజుల వరకు ఉండొచ్చు. అయితే ప్రైవేట్ ఆస్ట్రోనాట్స్‌కు ఆరోగ్య పరీక్షలతో పాటు శిక్షణ తప్పనిసరి. సో... అంతరిక్ష కేంద్రానికి వెళ్లాలనే ఆసక్తి ఉన్నవాళ్లు టూర్ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ అవకాశం ఇప్పుడు కాదు వచ్చే ఏడాది ప్రారంభం కాబోతోంది. మరి అంతరిక్ష కేంద్రంలో ఒక్క రాత్రి గడపాలంటే రూ.25 లక్షలు చెల్లించాల్సిందే.

    Cricket Score: క్రికెట్ స్కోర్ ఎంత? ఈ యాప్స్‌లో చూడండి


    ఇవి కూడా చదవండి:

    Credit Card: క్రెడిట్ కార్డులో ఈ 5 ఫీచర్లు మీకు తెలుసా?

    IRCTC: ట్రైన్ టికెట్ బుక్ చేస్తున్నారా? ఈ 3 టిప్స్ ట్రై చేయండి

    Mobile Insurance: మీ స్మార్ట్‌ఫోన్‌కు ఇన్స్యూరెన్స్ ఎందుకు అవసరమో తెలుసా?
    First published: