Home /News /technology /

NASA SPACEX CREW RETURN DRAGON CAPSULE SPLASHES DOWN SK

క్షేమంగా భూమికి చేరిన నాసా వ్యోమగాములు.. 45 ఏళ్ల తర్వాత తొలిసారి

సముద్రంలో దిగిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ మాడ్యుల్

సముద్రంలో దిగిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ మాడ్యుల్

సాధారణంగా అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చే క్యాప్సుల్స్‌ను భూ ఉపరితలంపై దిగుతుంటాయి. కజక్‌స్థాన్‌లోని ఎడారి ప్రాంతాలు అనువుగా ఉండడంతో అక్కడే ల్యాండ్ చేసేవారు. కానీ స్పేస్ ఎక్స్‌కు చెందిన డ్రాగన్ క్యాప్సుల్ అమెరికా తీరంలో క్షేమంగా ల్యాండై చరిత్ర సృష్టించింది.

ఇంకా చదవండి ...
    అంతరిక్ష ప్రయోగాల్లో అమెరికాకు చెందిన నాసా, స్పేస్ ఎక్స్ మరో అద్భుత విజయం సాధించాయి. స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సుల్ అంతరిక్షం నుంచి క్షేమంగా భూమికి చేరింది. ఒక కమర్షియల్ స్పేష్ మిషన్ అంతరిక్షం నుంచి భూమికి చేరడం ఇదే తొలిసారి. స్పేస్ ఎక్స్ డ్రాగన్‌ క్యాప్సుల్‌లో ప్రయాణించిన వ్యోమగాములు డగ్ హర్లే, బాబ్ బెన్‌కీన్ ప్లోరిడా గల్ఫ్ కోస్ట్ సమీపంలో గల్ఫ్ ఆఫ్ మెక్సికో వద్ద ల్యాండయ్యారు. స్థానిక కాలమానం ప్రకారం సరిగ్గా 14.48 గంటలకు సముద్ర జలాల్లో వీరు దిగారు.

    స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సుల్ క్షేమంగా భూమిని చేరడం పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. అమెరికాలో 45 ఏళ్ల తర్వాత ఇదే తొలి స్ప్లాష్ డౌన్ అని ఆయన ట్వీట్ చేశారు.

    ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ స్పేస్ ఎక్స్ ఈ ఏడాది మే చివరలో ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా డ్రాగన్ క్యాప్సుల్‌ను నింగిలోకి పంపించింది. అందులో ప్రయాణించిన వ్యోమగాములు డగ్ హర్లే, బాబ్ బెన్‌కీన్ రెండు నెలల పాటు అమెరికా అంతరిక్ష కేంద్రంలో గడిపారు. అనంతరం తిరిగి భూమికి క్షేమంగా చేరుకున్నారు. సాధారణంగా అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చే క్యాప్సుల్స్‌ను భూ ఉపరితలంపై దిగుతుంటాయి. కజక్‌స్థాన్‌లోని ఎడారి ప్రాంతాలు అనువుగా ఉండడంతో అక్కడే ల్యాండ్ చేసేవారు. కానీ స్పేస్ ఎక్స్‌కు చెందిన డ్రాగన్ క్యాప్సుల్ అమెరికా తీరంలో క్షేమంగా ల్యాండై చరిత్ర సృష్టించింది. అమెరికాలో స్పేస్ క్యాప్సుల్ దిగడం ఇది రెండోసారి. 45 ఏళ్ల క్రితం అపోలో కమాండ్ మాడ్యుల్ అమెరికాలో దిగింది.

    అంతరిక్షంలోకి మనుషులను పంపి, తిరిగి భూమికి చేర్చే ఈ ప్రైవేట్ ప్రాజెక్ట్ సక్సెస్ కావడంతో, రానున్న రోజుల్లో ఎన్నో అంతరిక్ష రంగం మరింత పురోగతి సాధిస్తుందని నిపుణులు చెబుతున్నారు. స్పేస్ ఎక్స్ వంటి ప్రైవేట్ సంస్థలు మనుషులను అంతరిక్షంలోకి తీసుకెళ్లే కార్యక్రమాలను వేగవంతం చేస్తాయని చెప్పారు. అప్పుడు విమానంలో వెళ్లినంత ఈజీగా.. రోదసిలోకి వెళ్లి అంతరిక్ష కేంద్రంలో గడపవచ్చని తెలిపారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: America, NASA, Space

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు