• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • NASA SPACECRAFT OSIRIS REX LEAVES MESS AFTER GRABBING ASTEROID BENNU SAMPLES HERE IS THE LATEST NASA REPORT NK

NASA: గ్రహశకలం నుంచి భూమి వైపు బయల్దేరిన స్పేస్‌క్రాఫ్ట్... అంతలో షాకింగ్ దృశ్యం

NASA: గ్రహశకలం నుంచి భూమి వైపు బయల్దేరిన స్పేస్‌క్రాఫ్ట్... అంతలో షాకింగ్ దృశ్యం

గ్రహశకలం నుంచి భూమి వైపు బయల్దేరిన స్పేస్‌క్రాఫ్ట్... అంతలో షాకింగ్ దృశ్యం (image credit - NASA)

NASA: నాసా ఏం చేసినా చాలా జాగ్రత్తగా చేస్తుంది. ఐతే... ఆ గ్రహశకలం దగ్గర నాసాకు ఏం కనిపించింది. రిటర్న్ బయల్దేరిన స్పేస్ క్రాఫ్ట్‌కి ఏమైంది. అక్కడ కనిపించిన దృశ్యమేంటి?

  • Share this:
    NASA: గ్రహాలపై అన్వేషించడం దశాబ్దాల నాటి చరిత్ర. గ్రహశకలాలపై పరిశోధించడం ఇప్పటి చరిత్ర. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ - నాసా (NASA)... ఓసీరిస్-రెక్స్ (Osiris-Rex spacecraft) అనే స్పేస్ క్రాఫ్ట్‌ని కొన్నేళ్లపాటూ తయారుచేసి... కొన్నేళ్లపాటూ... అంతరిక్షంలో ప్రయాణించేలా చేసి... చివరకు... గతేడాది బెన్నూ (Bennu Asteroid)ని చేరింది. దానిపై దిగింది. ఫొటోలు తీసి నాసాకు పంపింది. ఆ ఫొటోలు చూసిన నాసా శాస్త్రవేత్తలు... ఆ గ్రహశకలంపై ఏ జీవులూ లేవు అని డిసైడ్ అయ్యారు. ఆ తర్వాత స్పేస్ క్రాఫ్ట్‌లోని... ఓ రోబో చెయ్యి... గ్రహశకలంపై ఉన్న కొన్ని రాళ్లు మట్టిని సేకరించి... స్పేస్ క్రాఫ్ట్‌లోని ఓ బాక్సులో వేసి మూత పెట్టింది. ఆ తర్వాత... ఆ మట్టిని భూమికి తేవడమే మిగిలిన టార్గెట్. అంతలో ఏం జరిగిందంటే....

    భూమివైపు ప్రయాణం ప్రారంభించాలంటే గ్రహశకలం నుంచి స్పేస్ క్రాఫ్ట్... పైకి లేవాలి. అలా లేస్తోంది అనుకునేలోపు... సడెన్‌గా అక్కడ ఏదో జరిగింది. ఒక్కసారిగా గజిబిజి, గందరగోళం తలెత్తింది. అసలు అక్కడ ఏమైందో కచ్చితంగా అర్థం కావట్లేదు. గతేడాది ఏప్రిల్ 7న జరిగిన ఆ సంఘటనకు సంబంధించిన వివరాల్ని తాజాగా నాసా శాస్త్రవేత్తలు కొన్ని ఫొటోలను చూడటం ద్వారా గత గురువారం గుర్తించారు.

    శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే... గ్రహశకలంపై స్పేస్‌క్రాఫ్ట్ దిగినప్పుడు... చాలా ఒత్తిడి పనిచేసిందని అంటున్నారు. స్పేస్ క్రాఫ్ట్ దిగేముందు... ఆ ప్రదేశం స్మూత్‌గా ఉండేందుకు... నైట్రోజన్ గ్యాస్‌ని బలంగా వదులుతారు. ఆ గ్యాస్ ఒత్తిడితో... అక్కడున్న రాళ్లు మట్టి వంటివి పక్కకు వెళ్లిపోతాయి. ఇదంతా అయ్యాక స్పేస్ క్రాఫ్ట్ బాగానే దిగింది. తిరిగి లేచేటప్పుడు 40 అడుగుల ఎత్తుకు లేచాక ఏదో జరిగింది అని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఏం జరిగిందో చెప్పలేకపోతున్నారు. దీనిపై అరిజోనా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు డాక్యుమెంట్ రెడీ చేస్తున్నారు.

    ప్రస్తుతానికి స్పేస్ క్రాఫ్ట్ బాగానే ఉందనీ... అది కేజీ మట్టి శాంపిల్స్‌తో వచ్చే నెల భూమివైపు బయలుదేరుతుందని చెబుతున్నారు. 2023 నాటికి అది భూమిని చేరుతుంది. అప్పుడు దాన్లోని మట్టిని పరిశీలిస్తారు.

    Bennu Asteroid: అరకిలోమీటర్ సైజు ఉన్న బెన్నూ గ్రహశకలం చూడటానికి బాగుంటుంది. ఇది భూమి నుంచి 29.3 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. అదే భూమికీ, మార్స్ గ్రహానికీ మధ్య దూరం 28.7 కోట్ల కిలోమీటర్లు. ఈ గ్రహశకలం సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. ఇది 6 ఏళ్లకు ఓసారి భూమికి దగ్గరగా వస్తుంది. దీన్లో కార్బన్ ఎక్కువగా ఉంది. దీన్ని గనక సరిగ్గా పరిశీలిస్తే... మన సౌర కుటుంబం ఎలా ఏర్పడింది, ఎలా గ్రహాలు పుట్టాయి... ఎప్పుడు పుట్టాయి వంటి విషయాలు తెలుస్తాయి అని శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు.

    ఇది కూడా చదవండి: Viral Video: ఫుడ్ అడిగిన పిల్లి... ఇది తినే టైమ్ కాదన్న ఓనర్... పిల్లి ఫన్నీ రియాక్షన్ ఇదీ

    మీరూ చూడవచ్చు:
    మీరు ఈ బెన్నూ గ్రహశకలాన్ని అంగుళం కూడా వదలకుండా మొత్తం చూడాలి అనుకుంటే... చూడవచ్చు. అందుకు నాసా ఓ లింక్ ఇచ్చింది. అది ఇదే. https://solarsystem.nasa.gov/asteroids-comets-and-meteors/asteroids/101955-bennu/overview/ ఈ లింక్ క్లిక్ చేసి... ఓ నిమిషం వెయిట్ చెయ్యండి. మీ కళ్ల ముందు బెన్నూ గ్రహశకలం వస్తుంది. మీరు దాన్ని అటూ ఇటూ తిప్పుతూ అన్ని వైపులా చూడవచ్చు. అలాగే జూమ్ ఇన్ చేసి... దానిపై ఉన్న ప్రతీ రాయి, మైదానాలు, లోయలు అన్నీ చూడవచ్చు.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు