ఇంటర్‌స్టెల్లార్ తోకచుక్క నీటి లెక్క తేల్చిన నాసా... వైరల్ వీడియో...

NASA : అది మిగతా తోక చుక్కల లాంటిది కాదు. తొలిసారిగా మన సౌర కుటుంబంలోకి వచ్చింది. దాని విశేషాలు తెలుసుకుందాం.

news18-telugu
Updated: April 28, 2020, 7:09 AM IST
ఇంటర్‌స్టెల్లార్ తోకచుక్క నీటి లెక్క తేల్చిన నాసా... వైరల్ వీడియో...
ఇంటర్‌స్టెల్లార్ తోకచుక్క నీటి లెక్క తేల్చిన నాసా... వైరల్ వీడియో... (credit - NASA)
  • Share this:
NASA : అది 2019 సంవత్సరం. ఎక్కడో వేరే నక్షత్ర మండలం నుంచి 21/బొరిసోవ్ అనే తోకచుక్క... మన సౌర వ్యవస్థలోకి వచ్చింది. అది క్రమంగా సూర్యుడికి దగ్గరగా వస్తూ... వస్తూ... ఆ పక్క నుంచి అలా అలా వెళ్లిపోయింది. ఐతే... ఆ తోక చుక్కను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ - నాసా (NASA)కి చెందిన నెయిల్ గెహరెల్స్ స్విఫ్ట్ అబ్జర్వేటరీ... ట్రాక్ చేసింది. ఈ విశ్వంలో ఎన్నో తోకచుక్కలు మన సౌర కుటుంబంలోకి వచ్చి పోతుంటాయి. వాటికీ బొరిసోవ్‌కి కొన్ని తేడాలున్నాయి. ఎందుకంటే... ఈ తోకచుక్క (Comet) గురించి శాస్త్రవేత్తలు కాస్త ఎక్కువగా తెలుసుకునే వీలు కుదిరింది.

బొరిసోవ్ విశేషాలు :

- ఇది సూర్యుడి దగ్గరకు చేరే కొద్దీ ఎక్కువ నీటిని వదులుకుంది. సూర్యుడికి దూరం అవుతున్న కొద్దీ నీటి విడుదల తగ్గింది.
- ప్రతి 10 సెకండ్లకూ ఓ బాత్ టబ్ నిండేంత నీటిని ఈ తోకచుక్క వదులుకుంది.
- ఈ తోక చుక్క నీటితోపాటూ... దుమ్మును కూడా వదిలింది.
- ఈ తోకచుక్క మన సౌర వ్యవస్థలోది కాదు. వేరే ఏదో సౌర వ్యవస్థ నుంచి మన దగ్గరకు మొదటిసారి వచ్చి, వెళ్లింది.
- మూడేళ్ల కిందట... ఔమువామువా అనే తోక చుక్క కూడా ఇలాగే వేరే సౌర వ్యవస్థ నుంచి మన సౌర కుటుంబంలోకి వచ్చి వెళ్లింది.- 2019 ఆగస్ట్ 30న బొరిసోవ్... సూర్యుడికి దగ్గరగా వచ్చింది. దీని వేగం గంటకు 161000 కిలోమీటర్లు. నిమిషానికి 2683 కిలోమీటర్లు. సెకండ్‌కి 44 కిలోమీటర్లు. అంటే ఇది హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 35 సెకండ్లలో వెళ్లగలదు.
- బొరిసోవ్ నుంచి సెకండ్‌కి 30 లీటర్ల నీరు విడుదలైంది. మన సౌరవ్యవస్థలోకి వచ్చి వెళ్లేలోపు ఇది 23 కోట్ల లీటర్ల నీటిని అంతరిక్షంలో వదులుకుంది. అంటే... ఆ నీటితో మనం 92 ఒలింపిక్ స్టేడియంలను నింపవచ్చు.

ఇలాంటి ఆసక్తికరమైన అంశాలతో ఓ వీడియోని నాసా రిలీజ్ చేసింది. అది ఇదే...
Published by: Krishna Kumar N
First published: April 28, 2020, 7:09 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading