Mars2020 : నాసా మార్స్2020 రోవర్ రెడీ... ఇవీ ప్రత్యేకతలు...

NASA Mars2020 Rover : 2011లో నాసా క్యూరియోసిటీ రోవర్‌ను మార్స్‌పైకి పంపింది. మళ్లీ అలాంటి రోవర్ తయారుచెయ్యడానికి శాస్త్రవేత్తలకు 8 ఏళ్లు పట్టింది. మరి ఈ కొత్త రోవర్ ఎందుకు? మార్స్‌పై అది ఏం చేస్తుంది? చకచకా తెలుసుకుందాం.

Krishna Kumar N | news18-telugu
Updated: September 17, 2019, 11:06 AM IST
Mars2020 : నాసా మార్స్2020 రోవర్ రెడీ... ఇవీ ప్రత్యేకతలు...
నాసా మార్స్2020 రోవర్ రెడీ... ఇవీ ప్రత్యేకతలు... (Source - NASA)
  • Share this:
మన సౌరకుటుంబంలో భూమి తర్వాత మనం జీవించగలిగేందుకు వీలు ఉన్న గ్రహంగా... అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ - నాసా... మార్స్‌ని ఎంపిక చేసింది. 2030లో మార్స్‌పైకి మనుషుల్ని పంపాలనుకుంటోంది. అందుకోసం ఆల్రెడీ ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగానే... మార్స్ గ్రహాన్ని లోతుగా పరిశోధిస్తోంది. మనకు తెలుసు... నాసా 2011లో కారు అంత సైజ్ ఉండే క్యూరియోసిటీ రోవర్‌ను ప్రయోగించిన విషయం. అది గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఆ రోవర్... మార్స్‌కి సంబంధించి కొన్ని లక్షల ఫొటోలను నాసాకు పంపింది. వాటి ద్వారా... మార్స్ కూడా భూమిలాగే ఉందనీ, కాకపోతే అక్కడ నీరు లేదని నాసా భావించింది. కొన్ని సందర్భాల్లో మాత్రం నీటి జాడలు కనిపిస్తున్నాయని తెలిపింది.




మార్స్‌పైన నీరు లేదు... మరి లోపల నీరు ఉందా అన్నది తెలుసుకోవడానికి నాసా... ఇన్‌సైట్ అనే ల్యాండర్‌ను 2018లో పంపింది. అది మార్స్‌పై దిగి... లోతుగా, తిన్నగా సన్నటి గొయ్యి తవ్వి... లోపలకి కెమెరాని పంపి... మార్స్ లోపల ఎలా ఉందో తెలుసుకుంది. అక్కడ భూకంపాలు వస్తున్నాయో లేదో కనిపెట్టి ఆ వివరాలు నాసాకు పంపింది.
Loading...


ఇక ఇప్పుడు మార్స్2020 రోవర్ వంతు వచ్చింది. ఈ రోవర్ కూడా కారు అంత సైజులోనే... 10 అడుగుల పొడవు, 9 అడుగుల వెడల్పు ఉంటుంది. 6 చక్రాలతో చాలా వేగంగా వెళ్లగలదు. క్యూరియోసిటీ రోవర్ కంటే ఇది ఎన్నో రెట్లు పవర్‌ఫుల్ కెమెరాలతో తయారైంది. దీన్ని నాసా... 2020 ఆగస్ట్ 5న ఫ్లోరిడాలోని కేప్ కెనవరాల్ ఎయిర్ ‌ఫోర్స్ స్టేషన్ నుంచీ రాకెట్‌లో మార్స్‌పైకి పంపనుంది. ఆ రాకెట్... 2021 ఫిబ్రవరి 18న కొత్త రోవర్‌ను మార్స్‌పై దింపుతుంది. ఇక ఆ తర్వాత రోవర్ నడక ప్రారంభిస్తుంది. జెజెరో పగులు లోయలో దిగే రోవర్... తన చక్రాలతో ముందుకు సాగుతూ... కొత్త పరిశోధనలు చెయ్యనుంది.


687 రోజులు పనిచేసే కొత్త మార్స్2020 రోవర్... మార్స్‌పై రకరకాల తవ్వకాలు జరుపుతుంది. మార్స్ రాళ్లను డ్రిల్లింగ్ చేస్తుంది. అంతే కాదు... కొన్ని మట్టి శాంపిళ్లు, ఖనిజాల వివరాల్ని తనలో దాచుకుంటుంది. అంతేకాదు... ఇది నాసా శాస్త్రవేత్తలతో కంప్యూటర్ భాషలో మాట్లాడుతుంది. అలాగే వాళ్లు చెప్పేది శ్రద్ధగా వింటుంది. అలా అన్ని పనులూ చక్కబెట్టి... తిరిగి భూమికి వచ్చి... మొత్తం సమాచారాన్ని నాసాకు ఇస్తుంది. అందుకే నాసా... మార్స్2020 రోవర్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ రోవర్‌ని విజయవంతం చెయ్యడం ద్వారా... మార్స్ రహస్యాలన్నీ పూర్తిగా తెలుసుకోవాలన్నది నాసా ఆలోచనగా తెలుస్తోంది.


పేరు నమోదు చేసుకోవచ్చు :
NASA Mars Offer : మార్స్‌పైకి మార్స్2020 రోవర్ ద్వారా నాసా మన పేర్లు పంపాలని అనుకుంటోంది. ఇందుకు మనల్ని పేర్లు ఎంటర్ చేసుకోమని కోరుతోంది. మీకు కూడా ఆసక్తి ఉంటే, మీ పేరును మార్స్‌పైకి పంపాలనుకుంటే... పంపొచ్చు. అందుకు సెప్టెంబర్ 30 వరకే టైమ్ ఉంది. ఆలోగా పంపాల్సి ఉంటుంది. అదేమీ కష్టమైన పని కాదు. నిమిషం కూడా పట్టదు. అదెలాగో తెలుసుకోండి మరి.

మార్స్ పైకి మన పేరు (Image : NASA)


మీ పేరును ఇలా ఎంటర్ చెయ్యండి :
- ముందుగా... ఈ లింక్‌ (mars.nasa.gov/participate/send-your-name/mars2020)లోకి వెళ్లాలి.
- లింక్ ఓపెన్ అయ్యాక... ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, దేశం పేరు, పోస్టల్ కోడ్, ఈమెయిల్ అడ్రెస్ ఇవ్వాలి.
- ఆ తర్వాత Send my name to Mars అన్నది క్లిక్ చెయ్యాలి.
- అంతే... మీ పేరు నమోదవుతుంది. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- కొత్త పేజీలో మీ పేరు ఎలా ఉన్నదీ బోర్డింగ్ పాస్ రూపంలో కనిపిస్తుంది.
- ఆ టికెట్‌ను మీరు ప్రింట్ తీసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎంబెడ్ కూడా చేసుకోవచ్చు.

ఇప్పటికే 93 లక్షల మందికి పైగా తమ పేరును నమోదు చేసుకున్నారు. మీరూ చేసుకుంటే... భవిష్యత్తులో మార్స్ మిషన్లకు కూడా మీ పేరును పంపుతుంది నాసా. అయితే అందుకు మీ పర్మిషన్ కూడా తప్పక తీసుకుంటుంది.
First published: September 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...