చందమామపై పుష్కలంగా నీరు... శుభవార్త చెప్పిన నాసా...

Nasa Moon : చందమామపై నీరు ఉందనే ప్రయోగాలకు మరో అడుగు ముందుకు పడింది.

Krishna Kumar N | news18-telugu
Updated: April 16, 2019, 9:49 PM IST
చందమామపై పుష్కలంగా నీరు... శుభవార్త చెప్పిన నాసా...
నాసా విడుదల చేసిన చిత్రం (Image : NASA)
Krishna Kumar N | news18-telugu
Updated: April 16, 2019, 9:49 PM IST
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ - ఇస్రో... త్వరలో చంద్రయాన్ - 2 ఉపగ్రహాన్ని చంద్రుడి చెంతకు పంపుతున్న తరుణంలో... అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ - నాసా అద్భుతమైన విషయం చెప్పింది. చందమామపై ఉల్కలు పడినప్పుడు... చందమామలోపలి నీరు పైకి చిమ్ముకుంటూ వచ్చిందని నాసా కనిపెట్టింది. చందమామ చెంత తిరిగిన ల్యూనార్ అట్మాస్పియర్ అండ్ డస్ట్ ఎన్విరాన్‌మెంట్ ఎక్స్‌ప్లోరర్ (LADEE) - రోబో మిషన్... 2013 అక్టోబర్ నుంచీ 2014 ఏప్రిల్ మధ్య సేకరించిన డేటాను విశ్లేషించిన నాసా... చందమామ ఉపరితలం నుంచీ 3 అంగుళాల లోపల నీరు ఉన్నట్లు గుర్తించింది. ఇదే విషయాన్ని నాసాకి చెందిన గొడ్డార్డ్ స్పేస్ ఫ్లైట్ కేంద్రం... నేచర్ జియోసైన్సెస్‌లో ప్రచురించింది.

చందమామ లోపల ఉన్న నీరు ఆవిరి రూపంలో బయటకు వచ్చిందంటున్న నాసా... ఈ దిశగా మరిన్ని పరిశోధనలు చేసేందుకు వీలున్నట్లు తెలిపింది. చందమామ అవతలి వైపున చలి ప్రాంతాల్లో నీరు గడ్డకట్టి ఉండొచ్చని నాసా అంచనా వేసింది.చందమామపైకి నీరు ఉల్లల ద్వారా వచ్చి ఉంటుందా అన్న విషయంపైనా పరిశోధన చేస్తున్నట్లు నాసా తెలిపింది. మొత్తమ్మీద భవిష్యత్తులో చందమామపై కాలనీలు నిర్మించాలనుకుంటున్న ఖగోళ శాస్త్రవేత్తలకు నాసా చెప్పిన విషయాలు మరింత ఉత్సాహం కలిగిస్తున్నాయి. 

ఇవి కూడా చదవండి :

ఏపీలో ఐదు చోట్ల రీపోలింగ్... ఎక్కడెక్కడ అంటే...
Loading...
విజయసాయిరెడ్డికి బెదిరింపు కాల్స్... ఎవరు చేస్తున్నారంటే...

పుదుచ్చేరిలో ఈసారి గెలిచేదెవరు... పుదుచ్చేరి లోక్ సభ స్థానం ఎందుకు ప్రత్యేకమైనది...

ముస్లింలంతా కాంగ్రెస్‌కి ఓటు వేయాలి... సిద్ధూ వ్యాఖ్యలపై చర్యలకు బీజేపీ డిమాండ్...
First published: April 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...