NASA : విక్రమ్ ల్యాండర్ ఫొటోలు తీసిన నాసా... త్వరలో ఇస్రోకి అందజేత
NASA - ISRO Vikram Lander : ఆశలు ఆవిరైన వేళ... నాసా తీసిన ఫొటోలు ఇస్రో శాస్త్రవేత్తలకు ఉపశమనం కలిగిస్తాయా? ఇవాళ్టితో విక్రమ్ ల్యాండర్ కాల పరిమితి ముగిసిపోయింది కాబట్టి... నాసా ఇచ్చే ఫొటోల వల్ల ఉపయోగం ఉంటుందా?

నాసా విడుదల చేసిన ఫొటో (Source - Twitter - NCCS User News)
- News18 Telugu
- Last Updated: September 20, 2019, 7:54 AM IST
చంద్రుడి దక్షిణ ప్రాంతంపై అనుకున్నదానికంటే ఎక్కువ వేగంతో దిగిన విక్రమ్ ల్యాండర్ ఎక్కడ దిగిందో... అక్కడి ఫొటోలు ఇప్పుడు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ - నాసా దగ్గర ఉన్నాయి. ప్రస్తుతం ఆ ఫొటోలను నాసా విశ్లేషిస్తోంది. ఇస్రోతోపాటూ... నాసా కూడా విక్రమ్ ల్యాండర్ నుంచీ సిగ్నల్స్ రాబట్టేందుకు ప్రయత్నించి విఫలమైంది. నాసా పంపిన అత్యంత శక్తిమంతమైన శబ్ద తరంగాలకు కూడా ల్యాండర్ స్పందించకపోవడాన్ని బట్టీ... అది బాగా దెబ్బతిని ఉండొచ్చన్న అనుమానాలున్నాయి.
Using @NASA_NCCS computing resources and data from @LRO_NASA, @NASAGISS, @Columbia, @CUBoulder, and @NASA_Langley scientists simulated an ancient lunar atmosphere that could have brought substantial amounts of water to the Moon’s poles: https://t.co/umrtqo2lbf pic.twitter.com/MdZYwrFenu
— NCCS User News (@NASA_NCCS) September 13, 2019
Chandrayaan-2 : విక్రమ్ ల్యాండర్‌ను కనిపెట్టిన కుర్రాడు ఇతనే...
చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్‌ను కనిపెట్టిన నాసా...
చంద్రయాన్ - 2 వైఫల్యంతో ఎన్నో విషయాలు తెలిశాయి..ఇస్రో చైర్మన్ శివన్
వావ్... చంద్రుడి అవతలివైపు ఫొటోతీసిన చంద్రయాన్-2
అక్కడుంది విక్రమ్ ల్యాండర్... 2GB ఇమేజ్ రిలీజ్ చేసిన నాసా... మీరే చూడండి
Chandrayaan-2 : విక్రమ్ ల్యాండర్ ఎక్కడుందో కనిపెట్టలేకపోయాం : నాసా
తాజాగా నాసా ల్యూనార్ రికొన్నైస్సాన్స్ ఆర్బిటర్ (LRO) విక్రమ్ దిగిన ప్రాంతంపై చక్కర్లు కొట్టింది. అక్కడ కొన్ని ఫొటోలు తీసింది. రేడియో తరంగాల్ని కూడా ప్రయోగించింది. ఆ ఫొటోలు, ఇతర డేటాను నాసా ఇప్పుడు విశ్లేషిస్తోంది. ఆ డేటాను త్వరలో ఇస్రోకి ఇస్తుంది. ఆ డేటా... విక్రమ్ ల్యాండర్‌ను కదిపేందుకు, దాన్నుంచీ సిగ్నల్స్ రాబట్టేందుకూ ఉపయోగపడే అవకాశాలు లేకపోయినా... అసలు ల్యాండర్ ఎలా కూలిందీ, ఏం జరిగిందీ కొంతవరకూ తెలిసే అవకాశాలుంటాయి.
#Chandrayaan2 Orbiter continues to perform scheduled science experiments to complete satisfaction. More details on https://t.co/Tr9Gx4RUHQ
Meanwhile, the National committee of academicians and ISRO experts is analysing the cause of communication loss with #VikramLander
— ISRO (@isro) September 19, 2019
ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగంలో భాగంగా... విక్రమ్ ల్యాండర్... సెప్టెంబరు 6న అర్థరాత్రి దాటాక చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్‌కు ప్రయత్నించింది. ఐతే చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్లు ఎత్తులో ఉన్న సమయంలో విక్రమ్ ల్యాండర్ నుంచి గ్రౌండ్ స్టేషన్‌కు సంకేతాలు నిలిచిపోయాయి. అప్పటి నుంచీ విక్రమ్‌తో కమ్యూనికేషన్‌ను పునరుద్ధరించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది ఇస్రో. ఏదేమైనా చంద్రయాన్-2 ప్రయోగం విఫలమయినట్లుగా మనం భావించకూడదు. చంద్రుడి దక్షిణ ధృవంపైకి ఇంతకు వరకు ఏ దేశమూ వెళ్లలేదు. అలాంటి ప్రాంతానికి ఇస్రో తొలిసారిగా విక్రమ్‌ను పంపి చరిత్ర సృష్టించింది. పైగా... చంద్రయాన్-2 ఆర్బిటర్... వందశాతం కచ్చితత్వంతో పనిచేస్తోంది. ఇది ఏడేళ్లపాటూ తన సేవలు అందించనుంది.