Asteroid Bennu: భూమిని ఢీకొట్టేలా ఉన్న గ్రహశకలం... అలర్ట్ అయిన నాసా... ఏం చేస్తోందంటే...

NASA mission on Asteroid Bennu: మన భూమికి బయటి నుంచి గ్రహశకలాల వల్ల ప్రమాదం ఉంటోంది. అలాంటి ఓ గ్రహశకలంపై నాసా ఇప్పుడు దృష్టిసారిస్తోంది.

news18-telugu
Updated: October 21, 2020, 8:17 AM IST
Asteroid Bennu: భూమిని ఢీకొట్టేలా ఉన్న గ్రహశకలం... అలర్ట్ అయిన నాసా... ఏం చేస్తోందంటే...
భూమిని ఢీకొట్టేలా ఉన్న గ్రహశకలం. అలర్ట్ అయిన నాసా (credit - twitter - nasa)
  • Share this:
Asteroid Bennu: భూమికి కాస్త దగ్గర్లో తిరుగుతున్న గ్రహశకలం బెన్నూ ఉపరితలంపై అమెరికా స్పేస్ సెంటర్ నాసా (NASA)... విజయవంతంగా తన స్పేస్ క్రాఫ్ట్ ని దింపింది. నాసా ప్రయోగించిన తర్వాత... ఆ స్పేస్ క్రాఫ్ట్ రెండేళ్లపాటూ... అంతరిక్షంలో ప్రయాణించి... ఇప్పుడు సక్సెస్ ఫుల్ గా ఆస్టరాయిడ్ పై దిగింది. ఈ స్పేస్ క్రాఫ్ట్ కి ఓ రోబోటిక్ చెయ్యి ఉంది. ఆ చెయ్యితో అది... గ్రహశకలంపై మట్టిని తవ్వి... తన దగ్గరున్న ఓ పెట్టెలో దాస్తుంది. పెట్టె నుంచి ఆ మట్టి కింద పడకుండా సీల్ చేసుకుంటుంది. ఆ తర్వాత... గ్రహశకలాన్ని అటూ ఇటూ ఓసారి చూసి... ఓకే... అని తిరిగి అక్కడి నుంచి ఎగిరి.. భూమివైపు ప్రయాణం మొదలుపెడుతుంది. 2023లో నాసాను చేరుతుంది. నేను ఏం తెచ్చానో చూడండి అని... అందరికీ ఆ మట్టిని చూపిస్తుంది. ఆ మట్టిపై నాసా శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తారు.


ఇదో అద్భుతమైన విజయం. ఎందుకంటే... ఇప్పటివరకూ ఇలా ఏ స్పేస్ క్రాఫ్టూ చెయ్యలేదు. మనం చందమామపై నుంచి చంద్ర శిలలు తెచ్చాం గానీ... గ్రహశకలాలపై ఎప్పుడూ తేలేదు. నాసా పంపిన స్పేస్ క్రాఫ్ట్ చిన్నదేమీ కాదు. వ్యాన్ అంత సైజులో ఉంటుంది అది. ఓ 20 కార్లు పట్టేంత స్థలంలో దిగేలా దానికి ప్లాన్ ఇచ్చారు. సరిగ్గా అదే ప్రదేశంలో గ్రహశకలంపై దిగింది. అది తెచ్చే మట్టి బరువు దాదాపు 2 కేజీలు ఉండనుంది.


ఇదంతా పదేళ్లుగా నాసా వేసుకున్న ప్లాన్. విజయవంతం అవ్వడంతో శాస్త్రవేత్తలు సంతోషంగా ఉన్నారు. స్పేస్ క్రాఫ్ట్ పంపిన ఫొటోలను బట్టి... అది మట్టిని విజయవంతంగా సేకరించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.




బెన్నూ గ్రహశకలం భూమికి 20 కోట్ల మైళ్ల దూరంలో ఉంది. ఇది న్యూయార్క్ నగరంలోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అంత సైజులో ఉంటుంది. నిజానికి అది ఒకటే రాయి కాదు. అనేక చిన్న రాళ్లన్నీ ఆకర్షణ శక్తి వల్ల కలిసి ఒకటే రాయిగా ఉన్నాయి. భూమిని ఢీకొట్టే అవకాశం ఉన్న గ్రహశకలాల్లో బెన్నూ కూడా ఉంది. ఇది భూమిని ఢీకొంటే... ఒక్కసారిగా దానిలోని రాళ్లన్నీ విడిపోతాయి. భూమిపై పిడుగులు పడినట్లుగా ఎక్కడ బడితే అక్కడ పడతాయి. తద్వారా... ప్రళయం వస్తుంది. అలా జరగకుండా ఉండేందుకు ఏం చెయ్యాలో శాస్త్రవేత్తలు ఆలోచిస్తున్నారు. అందులో భాగంగానే ఈ పరిశోధన సాగిస్తున్నారు. అంతేకాదు... గ్రహాలు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకోవడానికి కూడా ఈ ప్రయోగం ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
Published by: Krishna Kumar N
First published: October 21, 2020, 8:17 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading