• Home
  • »
  • News
  • »
  • technology
  • »
  • NASA MARS NASA RELEASES AUDIO RECORDINGS OF WIND AND LASER STRIKES ON MARS RECORDED BY PERSEVERENCE ROVER NK

NASA Mars: మార్స్ గ్రహంపై గంటల గలగల.. మాటల గుసగుసలు.. నాసా వీడియో వినండి

నాసా పెర్సెవరెన్స్ రోవర్

NASA Mars: ఆ వీడియో వింటే... అక్కడ ఎవరో ఉన్నారని మీరే అంటారు. అక్కడ ఎవరూ లేరు అని నాసా చెప్పినా.. మీరు నమ్మరు. కావాలంటే మీరే ఆ వీడియో వినండి మరి.

  • Share this:
    NASA Mars: మార్స్ గ్రహానికి సంబంధించి ఇప్పటివరకూ అమెరికా స్పేస్ రీసెర్చ్ సెంటర్ - నాసా (NASA) మనకు ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పింది. వేల కొద్దీ ఫొటోలు, వందల వీడియోలు చూపించింది. వాటన్నింటికంటే ఆసక్తిగా ఉన్న మరో వీడియోని తాజాగా రిలీజ్ చేసింది. మీకు తెలుసుగా... ఫిబ్రవరి 18న నాసా రోవర్ పెర్సెవరెన్స్ (Perseverence - తెలుగులో పట్టుదల) రోవర్... మార్స్‌పై క్షేమంగా దిగిందని. మిగతా రోవర్లకూ దానికీ ఓ తేడా ఉంది. దానికి సూపర్ క్యామ్ మైక్రోఫోన్ ఉంది. అందువల్ల అది మార్స్‌పై ధ్వనులను అదే సౌండ్‌లను వినగలదు. అందువల్ల ఇంతకు ముందు ఎప్పుడూ లభించని సౌండ్ల గోల ఫుటేజ్... ఇప్పుడు లభించింది.

    ఆరు చక్రాల పెర్సెవరెన్స్ రోవర్... భూమి నుంచి 470,000,000 కిలోమీటర్లు 7 నెలలపాటూ ప్రయాణించి... మార్స్‌పై దిగింది. భూమిపై కంటే మార్స్‌పై గాలి ధ్వనులు బాగా వినిపిస్తాయి. మన దగ్గర లాగా చెట్లు, భవనాలూ అడ్డుగా ఉండవు కదా... అందుకే అక్కడ గాలి ప్రవాహం స్వేచ్ఛగా ఉంటుంది. దాని సౌండ్ చెవులు చిల్లులు పడేలా ఉంటుంది. ఈ 25 సెకండ్ల వీడియో క్లిప్‌లో నాసా... ఆ ధ్వనులను మనకు వినిపిస్తోంది. ఈ ధ్వనుల్లో సముద్రం అలలు, రాకాసి గాలులు, గంటలు మోగిన శబ్దాలు, మనుషులు గుసగుసలాడినట్లు రకరకాలుగా ఉన్నాయి. వీటిలో కొన్ని లేజర్ సౌండ్లు కూడా ఉన్నాయి. మీరూ వినండి.


    ఈ సౌండ్లు విన్నాక... హర్రర్ మూవీస్ గుర్తొస్తున్నాయని నెటిజన్లు అంటున్నారు. భయంకరంగా ఉన్నాయని అంటున్నారు.





    ఇలా రకరకాల సౌండ్లు రావడానికి కారణం... అక్కడి రాళ్లే. మార్స్‌పై రాళ్ల నిర్మాణాన్ని బట్టీ... వాటిలో గట్టిదనాన్ని బట్టీ... రకరకాల సౌండ్లు వినిపిస్తున్నాయి. మనం గమక మార్స్‌కి వెళ్తే... మనకు డైరెక్టుగా ఇలాంటి శబ్దాలు వినిపిస్తాయన్నమాట. చివరిగా ఓ జనరల్ నాలెడ్జ్ బిట్... మార్స్‌పై గాలి వేగం ఎంత.... ఆన్సర్... మార్స్ ఉపరితలంపై గాలులు గంటకు 16 నుంచి 32 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. అదే దుమ్ము తుఫాను (Dust Storm) వస్తే గంటకు 113 కిలోమీటర్ల వేగంతో కూడా వీయగలవు.
    Published by:Krishna Kumar N
    First published: