నాసా బంపర్ ఆఫర్... రూ.26 లక్షల ప్రైజ్ మనీ... వెంటనే మీ ఐడియా చెప్పండిలా...

NASA : చందమామపై కాలనీ నిర్మించేందుకు సిద్ధమవుతున్న నాసా... ఓ చిన్న ఐడియాకి ఈ బంపర్ ప్రైజ్ మనీ ఇస్తోంది.

news18-telugu
Updated: June 29, 2020, 9:13 AM IST
నాసా బంపర్ ఆఫర్... రూ.26 లక్షల ప్రైజ్ మనీ... వెంటనే మీ ఐడియా చెప్పండిలా...
నాసా బంపర్ ఆఫర్... రూ.26 లక్షల ప్రైజ్ మనీ... వెంటనే మీ ఐడియా చెప్పండిలా... (credit - NASA)
  • Share this:
రూ.26,47,049 మీ సొంతం కావాలంటే... మీరో చిన్న పని చెయ్యాలి. నిజానికి అది పని కాదు. ఓ ఐడియా చెప్పాలి. ఏంటంటే... చందమామపై నిర్మించే టాయిలెట్ డిజైన్ ఎలా ఉండాలో చెప్పాలి. మన భూమిపై గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది కాబట్టి... టాయిలెట్ నిర్మాణం తేలిక. చందమామపై గురుత్వాకర్షణ శక్తి... ఆరు రెట్లు తక్కువ కదా... అందువల్ల అక్కడ టాయిలెట్ నిర్మాణం ఎలా ఉండాలి, దాని డిజైన్ ఎలా ఉండాలి అన్నది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ - నాసా వేస్తున్న ప్రశ్న. దీనికి సరైన సమాధానం చెప్పినవారు... బంపర్ ప్రైజ్ మనీ పొందగలరు.

2024 నాటికి వ్యోమగాముల్ని చందమామపైకి పంపాలనుకుంటోంది నాసా. జనరల్‌గానే వాళ్లు బాత్‌రూంకి వెళ్లక తప్పదు. చందమామపై దిగే ఆర్టెమిస్ ల్యూనార్ ల్యాండర్‌లో నాసా... ఓ ప్రత్యేక టాయిలెట్ నిర్మించనుంది. అది మైక్రో గ్రావిటీలో పనిచేయాల్సి ఉంటుంది. దీన్నో జీరో-జీ (Zero-G) అంటారు. అంటే... గ్రావిటీ జీరో అని అర్థం. గురుత్వాకర్షణ శక్తి ఉండదని అర్థం. దీనికి ఎలాంటి టాయిలెట్ నిర్మించాలో నాసా శాస్త్రవేత్తలకు తెలుసు. కానీ... తమ ఆలోచన కంటే బెటర్ ఐడియా ఎవరైనా ఇస్తారేమో... అని వాళ్లకు అనిపించింది. అందుకే ప్రజలనే ఐడియా ఇవ్వమంటోంది. ఇందుకు కొన్ని కండీషన్లు పెట్టింది. వాటిని నాసా తన వెబ్‌సైట్‌లో ఉంచింది.


ఈ మూన్ మిషన్‌లో ఓ మహిళా వ్యోమగామి కూడా ఉండబోతున్నారు. కాబట్టి టాయిలెట్... స్త్రీ, పురుషులు వాడుకునేలా ఉండాలనే కండీషన్ ఉంది. నీటి వాడకం తక్కువ ఉండాలి. ల్యాండర్ లోపల టాయిలెట్ వల్ల ఎలాంటి చెడు వాసనలూ, బ్యాక్టీరియా రాకుండా చెయ్యాలనే షరతులూ ఉన్నాయి. అంతేకాదు... అది 70 వాట్స్ కంటే తక్కువ కరెంటు వాడాలి. అలాగే... అందులో ఫ్యాన్ తక్కువ సౌండ్ రావాలి. తక్కువ ప్రదేశంలో డిజైన్ ఉండాలి. తక్కువ బరువు ఉండాలి. ఇంకో విషయం... ఎవరికైనా వాంతులు వస్తే... టాయిలెట్‌లో తల పెట్టకుండానే వాంతి చేసుకునేలా డిజైన్ ఉంటే... బోనస్ పాయింట్లు కూడా ఇస్తామని నాసా తెలిపింది.

ఈ మిషన్‌లో ఇద్దరు వ్యోమగాములు ఉంటారు. వాళ్లు 14 రోజులు చందమామపై ఉండి... అక్కడి చెత్తను తీసేస్తారు. అలాగే... కొన్ని వస్తువుల్ని అక్కడ సెట్ చేస్తారు.

మొదటి ప్రైజ్ రూ.26,47,049 కాగా... సెకండ్ ప్రైజ్... రూ.7,56,299... థర్డ్ ప్రైజ్ రూ.3,78,149. ఆగస్ట్ 17 నాటికి మీ డిజైన్ ఇచ్చేయాలి. విన్నర్లను అక్టోబర్‌లో నాసా ప్రకటిస్తుంది. పూర్తి వివరాలు ఈ లింక్‌లో ఉన్నాయి. https://www.nasa.gov/solve/index.html ఇంకెందుకాలస్యం... ఛాన్స్ కొట్టేయండి మరి.
First published: June 29, 2020, 9:13 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading