చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్‌ను కనిపెట్టిన నాసా...
NASA ISRO Chandrayaan-2 : చందమామ దక్షిణ ధ్రువంలో పడిపోయిన ఇస్రో విక్రమ్ ల్యాండర్ ఎక్కడుందో నాసా కనిపెట్టి... ఫొటోలు పంపింది.
news18-telugu
Updated: December 3, 2019, 7:04 AM IST

చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్‌ను కనిపెట్టిన నాసా... (credit - twitter - nasa)
- News18 Telugu
- Last Updated: December 3, 2019, 7:04 AM IST
NASA ISRO Chandrayaan-2 : ఇస్రో చంద్రయాన్-2లో భాగమైన విక్రమ్ ల్యాండర్.... చందమామ దక్షిణ ధ్రువంలో పడిపోయిందన్న విషయం మనకు తెలుసు. ఐతే... చందమామపై చీకటి వల్ల ఇన్నాళ్లూ ఆ ల్యాండర్ ఎక్కడ కూలిపోయిందో కనిపెట్టలేకపోయాం. ఐతే... అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ-నాసా... తాజాగా ఇస్రో విక్రమ్ ల్యాండర్‌ను చందమామపై కనిపెట్టింది. అందుకు సంబంధించిన ఫొటోల్ని షేర్ చేసింది. సెప్టెంబర్ 26న ఏ ప్రదేశంలో పడిందో గుర్తించింది. నాసాకు చెందిన ల్యూనార్ రికొన్నైస్సాన్స్ ఆర్బిటర్ (LRO) ఈ ల్యాండర్‌ను గుర్తించి ఫొటోలు తీసింది. ఐతే... కూలిన ల్యాండర్ నుంచి కొన్ని శకలాలు చిందరవందరగా పడినట్లు నాసా తెలిపింది. మొత్తం 24 చోట్ల ఈ శకలాలు పడినట్లు గుర్తించింది. ఓవరాల్‌గా కొన్ని కిలోమీటర్ల ప్రాంతంలో ఇవి ఉన్నట్లు తెలిపింది.
షణ్ముగ సుబ్రహ్మణ్యన్ అనే వ్యక్తి... LRO ప్రాజెక్టు సభ్యుల్ని కాంటాక్ట్ అయ్యారు. ఆయన తొలిసారిగా విక్రమ్ ల్యాండర్‌కి సంబంధించి ఓ విడి భాగాన్ని అది పడిన ప్రదేశానికి 750 మీటర్ల దూరంలో గుర్తించారు. తద్వారా విక్రమ్ ల్యాండర్ ఎక్కడ పడిందీ తెలిసింది.
జులైలో ఇస్రో... చంద్రయాన్ 2 ప్రయోగాన్ని చేపట్టింది. అమెరికా, రష్యా, చైనా, తర్వాత చంద్రుడిపై ల్యాండర్‌ను దింపిన దేశం భారతే. అంతేకాదు... చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి ల్యాండర్‌ను పంపిన తొలి దేశం భారతే. ప్రస్తుతం చంద్రయాన్ 2లో కీలకమైన ఆర్బిటర్... చందమామ చుట్టూ బ్రహ్మాండంగా తిరుగుతోంది. విక్రమ్ ల్యాండర్ అందులోని ప్రజ్ఞాన్ రోవర్ మాత్రం పనిచెయ్యట్లేదు.
The #Chandrayaan2 Vikram lander has been found by our @NASAMoon mission, the Lunar Reconnaissance Orbiter. See the first mosaic of the impact site https://t.co/GA3JspCNuh pic.twitter.com/jaW5a63sAf
— NASA (@NASA) December 2, 2019
షణ్ముగ సుబ్రహ్మణ్యన్ అనే వ్యక్తి... LRO ప్రాజెక్టు సభ్యుల్ని కాంటాక్ట్ అయ్యారు. ఆయన తొలిసారిగా విక్రమ్ ల్యాండర్‌కి సంబంధించి ఓ విడి భాగాన్ని అది పడిన ప్రదేశానికి 750 మీటర్ల దూరంలో గుర్తించారు. తద్వారా విక్రమ్ ల్యాండర్ ఎక్కడ పడిందీ తెలిసింది.
Chandrayaan-2 : విక్రమ్ ల్యాండర్‌ను కనిపెట్టిన కుర్రాడు ఇతనే...
చంద్రయాన్ - 2 వైఫల్యంతో ఎన్నో విషయాలు తెలిశాయి..ఇస్రో చైర్మన్ శివన్
వావ్... చంద్రుడి అవతలివైపు ఫొటోతీసిన చంద్రయాన్-2
అక్కడుంది విక్రమ్ ల్యాండర్... 2GB ఇమేజ్ రిలీజ్ చేసిన నాసా... మీరే చూడండి
Chandrayaan-2 : విక్రమ్ ల్యాండర్ ఎక్కడుందో కనిపెట్టలేకపోయాం : నాసా

Loading...