భారత్ మిషన్ శక్తి ప్రయోగం ప్రమాదకరం... స్పేస్ వ్యర్థాలతో వ్యోమగాములకు ఇబ్బందే... నాసా ప్రకటన

Mission Shakti : ఇస్రో ఊహించినదే జరుగుతోందా... అమెరికా నాసా... భారత రోదశీ ప్రయోగాలకు అడ్డుతగులుతోందా?

Krishna Kumar N | news18-telugu
Updated: April 2, 2019, 9:41 AM IST
భారత్ మిషన్ శక్తి ప్రయోగం ప్రమాదకరం... స్పేస్ వ్యర్థాలతో వ్యోమగాములకు ఇబ్బందే... నాసా ప్రకటన
శాటిలైట్ (Image : NASA)
  • Share this:
Mission Shakti : మిషన్ శక్తి ప్రయోగం ద్వారా... భారత్... అంతరిక్షంలో అనితర సాధ్యమైనది సాధించిందనీ, ప్రపంచంలో అమెరికా, రష్యా, చైనా తర్వాతి స్థానంలో భారత్ నిలిచిందనీ ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ప్రసంగంలో తెలిపారు. అప్పుడే భారత్‌పై అమెరికా మండిపడింది. అలాంటి ప్రయోగాల వల్ల అంతర్జాతీయ సమాజానికి ఇబ్బందులు తలెత్తుతాయని నానా యాగీ చేసింది. తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కూడా కుళ్లుకుంటోంది. భారత్ చేపట్టిన శాటిలైట్ నాశనం చేసే ప్రయోగం వల్ల రోదసిలో 400 స్పేస్ వ్యర్థాలు ఏర్పడ్డాయనీ... వాటిలో కొన్ని 10 సెంటీమీటర్ల కంటే పెద్దగా ఉన్నాయని.. అవి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఢీకొట్టే ప్రమాదం ఉందని నాసా చీఫ్ జిమ్ బ్రిడెన్స్టైన్ అభిప్రాయపడ్డారు.

భారత యాంటీ శాటిలైట్ ప్రయోగాన్ని ప్రమాదకరం అని అభివర్ణించిన నాసా... అమెరికా సైన్యం... కొన్ని స్పేస్ వ్యర్థాల్ని కనిపెట్టిందని తెలిపింది. అవి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండే వ్యోమగాములకు ప్రమాదకరంగా మారతాయని తెలిపింది. ఐదు రోజుల కిందట భారత్... దిగువ కక్ష్యలో తిరుగుతున్న ఓ ప్రయోగాత్మక శాటిలైట్‌ను మిషన్ శక్తి కార్యక్రమం ద్వారా విజయవంతంగా కూల్చివేసింది. అది జరిగిన ఐదు రోజులకు నాసా అభ్యంతరాలు తెలుపుతోంది.


అన్ని వ్యర్థాలూ పెద్దవి కాదు. అన్నీ ప్రమాదకరమైనవి కూడా కాదు. కానీ... దాదాపు 60 ముక్కలు మాత్రం... దాదాపు 10 సెంటీమీటర్లు ఉన్నాయనీ... అవి ప్రమాదకరం అని నాసా చెబుతోంది.

భారత్ పేల్చిన ప్రయోగాత్మక శాటిలైట్ భూమి నుంచీ 300 కిలోమీటర్ల ఎత్తులో తిరిగింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తులో భూమి చుట్టూ తిరుగుతోంది. ఐతే... శాటిలైట్ పగిలినప్పుడు... 24 ముక్కలు... అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం తిరిగే దిశలోకి వెళ్లాయని నాసా చెబుతోంది. ఇది భవిష్యత్తులో మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలకు ఇబ్బందికరం అని నాసా అభ్యంతరం చెబుతోంది. దీన్ని ఒప్పుకునేది లేదన్న నాసా... ఆ ప్రభావం తమపై పడటానికి వీల్లేదని మండిపడుతోంది.


ప్రస్తుతం అంతరిక్షంలో 23,000 వ్యర్థాలు ఇష్టారాజ్యంగా తిరుగుతున్నాయని అమెరికా సైన్యం తెలిపింది. ఇవన్నీ పది సెంటీమీటర్ల కంటే పెద్దవేనని వివరించింది. వీటిలో 10వేల వ్యర్థాలు శాటిలైట్ల నుంచీ వచ్చినవేనని తెలిపింది. వాటిలో 3వేల వ్యర్తాలు... 2007లో చైనా చేపట్టిన యాంటీ శాటిలైట్ ప్రయోగం వల్ల ఏర్పడ్డాయని వివరించింది.

తాజాగా భారత్ చేసిన ప్రయోగం వల్ల అంతరిక్ష కేంద్రాన్ని వ్యర్థాలు ఢీకొట్టే ప్రమాదం 44 శాతం ఎక్కువైందని మండిపడింది. ఐతే... కాలక్రమంలో వ్యర్థాల్లో చాలా వరకూ భూ వాతావరణంలోకి రాగానే కాలిపోతాయనీ, తద్వారా ప్రమాదం తగ్గుతుందనీ వివరించింది.

 ఇవి కూడా చదవండి :

హ్యాట్రిక్ కొట్టిన టీంఇండియా... టెస్టుల్లో మళ్లీ ఛాంపియన్లుగా కోహ్లీ సేన

టాస్ బదులు ట్విట్టర్ పోల్... ఫోర్ కొడితే 8, సిక్స్ కొడితే 12... ఇది ఏప్రిల్ ఫూల్ కాదు... ఐసీసీ నిర్ణయాలు

భర్తపై దాడి చేసి... భార్యను గ్యాంగ్ రేప్ చేసి... హర్యానాలో నడిరోడ్డుపై అరాచకం...

భర్త నిక్ జోనాస్‌పై అభిమాని బ్రా విసిరితే... గాల్లో ఊపి సందడి చేసిన ప్రియాంక చోప్రా
First published: April 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading