భూమి పక్క నుంచీ వెళ్లిన గ్రహశకలం... నాసా ఏం చెప్పింది?

NASA Asteroid : కొన్నేళ్ల తర్వాత మళ్లీ వరుసగా గ్రహశకలాలు భూమివైపు వస్తున్నాయి. శుక్రవారం ఓ భారీ గ్రహశకలం భూమి పక్క నుంచీ వెళ్లిపోయింది.

Krishna Kumar N | news18-telugu
Updated: July 20, 2019, 5:49 AM IST
భూమి పక్క నుంచీ వెళ్లిన గ్రహశకలం... నాసా ఏం చెప్పింది?
గ్రహశకలం ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
శుక్రవారం మనందరం నిద్రపోతున్న సమయంలో... మనకు తెలియకుండానే ఓ భారీ ప్రమాదం నుంచీ భూమి బయటపడింది. ఎందుకంటే... మనం చెప్పుకుంటున్న ఆ గ్రహశకలం చిన్నది కాదు. 207 అడుగుల సైజ్ ఉంది. అది గానీ భూమిని ఢీకొట్టి ఉంటే... పెను విధ్వంసమే జరిగివుండేది. లక్కీగా ఏమీ కాలేదు. ఆ గ్రహశకలానికి సైంటిస్టులు పెట్టిన పేరు... 2019 ఎన్‌జే2. అది గంటకు 48,280 కిలోమీటర్ల వేగంతో అంటే... సెకండ్‌కి 13 కిలోమీటర్ల వేగంతో వెళ్తోంది. మనం కన్ను మూసి తెరిచేలోపే అది మనకు కనిపించనంత దూరం వెళ్లిపోతుంది. అంత వేగంతో ఆ గ్రహశకలం శుక్రవారం తెల్లవారు జామున 1.30 సమయంలో భూమికి దగ్గరగా వచ్చింది. అంటే దాదాపు 50 లక్షల కిలోమీటర్ల దూరం నుంచీ వెళ్లిపోయింది. నాసా లెక్కలో చెప్పాలంటే... అది చాలా దగ్గర నుంచీ వెళ్లినట్లే. ఇక ఇప్పట్లో ఆ గ్రహ శకలంతో మనకు సమస్య లేదు. మళ్లీ అది 2119, జూలై 7న... భూమికి దగ్గరగా వస్తుంది. వందేళ్ల తర్వాత కాబట్టి... అప్పటికి సైన్స్ చాలా డెవలప్ అవుతుంది కాబట్టి... మనం ఆందోళన చెందాల్సిన పనిలేదు.

ఆగస్ట్ 10న మరో గ్రహశకలం : అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ - నాసా ప్రకారం ఆగస్ట్ 10న భూమికి దగ్గర నుంచీ 2006 QQ23 అనే గ్రహశకలం వెళ్లబోతోంది. ఆ సమయంలో ఆ గ్రహశకలం భూమికి 74లక్షల 45వేల 486కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అది భూమిని టచ్ చేసే అవకాశం లేకపోయినా... ఎప్పుడు ఏం జరుగుతుందో ముందే చెప్పలేమంటోంది నాసా. ఎందుకంటే అది చిన్నదేమీ కాదు. 568 మీటర్ల సైజ్ ఉంది. అంటే అరకిలోమీటర్ కంటే పెద్దదే. అందుకే అప్రమత్తమైన నాసా 1901 నుంచీ ఆ గ్రహశకలం ఎలా తిరుగుతున్నదీ డేటా పరిశీలిస్తోంది. అది భూమివైపు వస్తున్న విషయం 2006 ఆగస్ట్ 21న తెలిసింది. అప్పటి నుంచీ దానిపై ఓ కన్నేసి ఉంచింది.

2012 మేలో బస్సు అంత సైజులో ఉన్న ఓ గ్రహశకలం భూమి పక్క నుంచీ వెళ్లిపోయింది. అది వెళ్లిపోయిన తర్వాతే ఆ విషయం నాసాకి తెలిసింది. ఆ గ్రహశకలం బుల్లెట్ కంటే... పది రెట్లు వేగంగా వెళ్తోంది. అది ఢీ కొట్టి ఉంటే... భూమి ముక్కలైపోయేంత ప్రమాదం. 2018లో కూడా GE3 అనే గ్రహశకలం... సూపర్ మార్కెట్ అంత సైజులో ఉండేది... భూమికి లక్షా 91వేల 511 కిలోమీటర్ల దూరం నుంచీ వెళ్లింది. ఈ రెండూ కూడా భూమిని ఢీకొనకపోవడాన్ని మన అదృష్టం అనుకోవచ్చు.
First published: July 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading