Narendra Modi: ఆ విషయంలో ట్రంప్‌ కన్నా మోదీనే తోపు

Narendra Modi | డోనాల్డ్ ట్రంప్ ఫాలోయర్ల సంఖ్య 96 మిలియన్లు కాగా, భారత ప్రధాని నరేంద్ర మోదీకి 110 మిలియన్ ఫాలోయర్లు ఉండటం విశేషం. అయితే ట్విట్టర్‌లో మాత్రం రెండో స్థానంలో ట్రంప్ ఉన్నారు.

news18-telugu
Updated: May 7, 2019, 3:40 PM IST
Narendra Modi: ఆ విషయంలో ట్రంప్‌ కన్నా మోదీనే తోపు
Narendra Modi: ఆ విషయంలో ట్రంప్‌ కన్నా మోదీనే తోపు (image: PTI)
news18-telugu
Updated: May 7, 2019, 3:40 PM IST
ప్రపంచంలో సోషల్ మీడియాలో అత్యంత ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న నేతల్లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీది రెండో స్థానం. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో 110,912,648 ఫాలోయర్లు ఉన్నట్టు SEMrush సంస్థ లెక్క తేల్చింది. మొదటి స్థానంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఉన్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్లలో ఆయన ఫాలోయర్ల సంఖ్య 182,710,777. ఏకంగా ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌నే వెనక్కి నెట్టేశారు మోదీ. డోనాల్డ్ ట్రంప్ ఫాలోయర్ల సంఖ్య 96 మిలియన్లు కాగా, భారత ప్రధాని నరేంద్ర మోదీకి 110 మిలియన్ ఫాలోయర్లు ఉండటం విశేషం. అయితే ట్విట్టర్‌లో మాత్రం రెండో స్థానంలో ట్రంప్ ఉన్నారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రజాదరణ అపారంగా ఉంది. ప్రపంచంలో ఎక్కువ మంది ఫాలోయర్లు ఉన్న నేతల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తర్వాత మోదీ ఉండటం విశేషం.
ఫెర్నాండో అంగులో, హెడ్ ఆఫ్ ఇంటర్నేషనల్ పార్ట్‌నర్‌షిప్, SEMrush


సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అన్నింటిలో యాక్టీవ్ పొలిటికల్ ఆడియన్స్ ఎక్కువగా ఉన్నది ట్విట్టర్‌లోనే అని SEMrush తెలిపింది. ఇక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌లో 12 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు. సోషల్ మీడియాలో నరేంద్ర మోదీ మొదటి నుంచి చాలా యాక్టీవ్‌గా ఉన్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడానికి సోషల్ మీడియా ఫాలోయింగ్ కూడా ఒక కారణం.



Photos: హీరో నుంచి 3 కొత్త ప్రీమియం బైక్స్... అదిరిపోయే ఫీచర్స్

ఇవి కూడా చదవండి:

ATM Services: ఏటీఎం నుంచి మరిన్ని ఉచిత సేవలు... ఇలా పొందండి

Railway Jobs: రైల్వేలో ఏ ఉద్యోగం బెటర్? జీతం ఎంత? వివరాలు తెలుసుకోండి...

Akshaya Tritiya: సెంటిమెంట్ సరే... ఇప్పుడు గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చా?
First published: May 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...