చందమామలో భారీ వింత లోహం... ఆశ్చర్యపోతున్న సైంటిస్టులు...

NASA Moon : మన చందమామకు సంబంధించి ఎన్నో సంగతులు. తాజాగా వాటిలో మరొకటి చేరింది. అది ఎక్కువ ఆసక్తి కలిగిస్తోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: June 11, 2019, 6:10 AM IST
చందమామలో భారీ వింత లోహం... ఆశ్చర్యపోతున్న సైంటిస్టులు...
ఈ ఫొటోలో బ్లూ కలర్‌ ఉన్న చోట లోయ ఉంది. ఆ సర్కిల్‌లో లోహ పదార్థం ఉంది. (Image Credit : NASA/Goddard Space Flight Center/University of Arizona)
  • Share this:
చందమామపై భారీగా నీరు ఉందని ఈమధ్యే అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ - నాసా తెలిపింది. ఇప్పటికే అక్కడకు పంపేందుకు మన అంతరిక్ష పరిశోధనా సంస్థ - ఇస్రో... చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని రెడీ చేస్తోంది. ఇలాంటి సమయంలో ఓ ఆసక్తికర విషయాన్ని బేలోర్ యూనివర్శిటీ పరిశోధకులు కనిపెట్టారు. చందమామపై ఉండే అతి పెద్ద లోయలో... మిస్టీరియస్ వస్తువు (లోహం) ఉందని తేల్చారు. హవాయ్‌లోని అతి పెద్ద దీవి కంటే... ఐదు రెట్లు పెద్దగా ఆ వస్తువు (లోహం లాంటిది) ఉందని వారు చెబుతున్నారు. అదేంటో తెలిస్తే, చందమామ ఎలా ఏర్పడిందో తెలిసేందుకు వీలవుతుందని అంటున్నారు. చందమామ దక్షిణ ధృవంలోని అయిట్కెన్ బేసిన్ (Aitken basin) లోయ లోపల అది ఉన్నట్లు చెబుతున్నారు.

moon,mystery,moon landing,moon mystery,the moon,moon surface,moon mysteries,dark side of the moon,moon base,moon conspiracy,moon rock,mysteries,moon photos,space,moon ufo,moon is hollow,mystery of the moon,nasa,చందమామ, చంద్రుడు,మూన్,మిస్టరీ,వస్తువు, లోహం, చందమామలో నీరు,నాసా,సైంటిస్టులు, విశ్వం,అంతరిక్షం, గ్రహశకలం,
ఈ ఫొటోలో బ్లూ కలర్‌ ఉన్న చోట లోయ ఉంది. ఆ సర్కిల్‌లో లోహ పదార్థం ఉంది. (Image Credit : NASA/Goddard Space Flight Center/University of Arizona)


ఎలా వచ్చి ఉంటుంది : అంత పెద్ద లోహం చందమామలోకి ఎలా వచ్చిందన్నది సైంటిస్టుల్ని ఆశ్చర్యపరుస్తోంది. వాళ్లు చెబుతున్నదేంటంటే... 40 లక్షల సంవత్సరాల కిందట భారీ గ్రహశకలం చందమామను ఢీకొట్టిందనీ... అప్పుడు ఆ భారీ లోయ ఏర్పడిందనీ... ఆ గ్రహ శకలంలోని లోహ పదార్థమే... ఆ లోయ లోపల ఉందని అంచనా వేశారు.

లోయలో 300 కిలోమీటర్ల లోపల అది ఉందని అంటున్నారు. మనం చందమామను టెలిస్కోప్‌లో చూసినా... ఆ లోయ మనకు కనిపించదు. ఎందుకంటే... అది భూమివైపు కాకుండా... చందమామకు వెనకవైపు ఉన్న దక్షిణ ధృవంలో ఉందట. ఆ వస్తువు ఏ గ్రహాంతర వాసుల స్పేస్ షిప్పో కావచ్చని సైంటిస్టులు చెప్పట్లేదు. అది ఎలాంటి లోహమో కచ్చితంగా తెలియదంటున్నారు. ఓ అంచనా ప్రకారం అది ఐరన్-నికెల్ కలగలిసిన లోహం కావచ్చని చెబుతున్నారు. ఇంట్రస్టింగ్ కదా.
First published: June 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading