Home /News /technology /

MYLAB COVID 19 SELF TESTING KIT COVISELF NOW AVAILABLE ON FLIPKART SS

Covid self-testing kit: ఇంట్లోనే కరోనా టెస్ట్... ఫ్లిప్‌కార్ట్‌లో కోవిడ్ సెల్ఫ్ టెస్టింగ్ కిట్ సేల్

Covid self-testing kit: ఇంట్లోనే కరోనా టెస్ట్... ఫ్లిప్‌కార్ట్‌లో కోవిడ్ సెల్ఫ్ టెస్టింగ్ కిట్ సేల్
(image: Mylab)

Covid self-testing kit: ఇంట్లోనే కరోనా టెస్ట్... ఫ్లిప్‌కార్ట్‌లో కోవిడ్ సెల్ఫ్ టెస్టింగ్ కిట్ సేల్ (image: Mylab)

Covid self-testing kit | మీరు ఇంట్లోనే కోవిడ్ 19 టెస్ట్ చేసుకోవాలనుకుంటున్నారా? మైల్యాబ్ కోవీసెల్ఫ్ కిట్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది.

    ఇకపై కోవిడ్ 19 నిర్ధారణ కోసం ఆస్పత్రులు, ల్యాబరేటరీల చుట్టూ పరుగులు తీయాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే మీరే స్వయంగా కోవిడ్ టెస్ట్ చేసుకోవచ్చు. మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ భారతదేశంలోనే మొదటి కోవిడ్ 19 సెల్ఫ్ టెస్టింగ్ కిట్ 'కోవీసెల్ఫ్' ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. వీటి అమ్మకాలు మొదలయ్యాయి. మీకు దగ్గర్లోని ఫార్మసీల్లో 'కోవీసెల్ఫ్' కొనుక్కోవచ్చు. అంతేకాదు... 'కోవీసెల్ఫ్' అమ్మకాలు ఫ్లిప్‌కార్ట్‌లో కూడా మొదలయ్యాయి. మైల్యాబ్ కోవిడ్ 19 సెల్ఫ్ టెస్టింగ్ కిట్ ధర రూ.250 మాత్రమే. ఫ్లిప్‌కార్ట్‌తో కలిసి భారతదేశంలోని 95 శాతం పిన్ కోడ్స్‌కి వీటిని డెలివరీ చేస్తామని మైల్యాబ్ ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాలకు కూడా 'కోవీసెల్ఫ్' కిట్స్ డెలివరీ అవుతాయి.

    IRCTC: కోవిడ్ నుంచి కోలుకున్నవారికి ఐఆర్‌సీటీసీ నేచురోపతి ప్యాకేజీ

    Oximeter Apps: ఫోన్​లో ఆక్సిమీటర్ యాప్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త


    పూణెకు చెందిన మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్-ICMR ఆమోదం పొందిన తర్వాత గత నెలలో కోవిడ్ 19 సెల్ఫ్ టెస్టింగ్ కిట్ 'కోవీసెల్ఫ్'ను పరిచయం చేసింది. ఇప్పుడు మార్కెట్లోకి అధికారికంగా రిలీజ్ చేసింది. మొదటి వారంలోనే 7 లక్షల కోవీసెల్ఫ్ యూనిట్స్‌ని అమ్మేందుకు ఏర్పాట్లు చేసింది. 'కోవీసెల్ఫ్' కిట్ ఉంటే ఇంట్లోనే కోవిడ్ 19 నిర్ధారణ చేసుకోవచ్చు. అంటే కరోనా సోకిందో లేదో తెలుసుకోవడానికి ఆస్పత్రికి, ల్యాబరేటరీకి వెళ్లాల్సిన అవసరం లేదు. కరోనా సోకినవాళ్లు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే నిర్ధారించుకుంటారు కాబట్టి కోవిడ్ 19 వ్యాప్తి తగ్గుతుంది. ఈ కిట్ ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.

    Realme 5G Phone: రియల్‌మీ మరో సంచలనం... రూ.7,000 ధరకే 5జీ ఫోన్

    Realme Anniversary Sale: రియల్‌మీ సేల్‌లో ఈ 28 స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్స్


    కోవిడ్ 19 సెల్ఫ్ టెస్టింగ్ కిట్ 'కోవీసెల్ఫ్' ఉపయోగించడం పెద్ద కష్టమేమీ కాదు. కేవలం రెండు నిమిషాల్లో టెస్ట్ చేసుకోవచ్చు. 15 నిమిషాల్లో ఫలితాలు వస్తాయి. ఈ కిట్ ఎలా ఉపయోగించాలనే దానిపై యూజర్ మ్యాన్యువల్ ఉంటుంది. అది పూర్తిగా చదివితే ఈ కిట్ ఎలా ఉపయోగించాలన్న అవగాహన వస్తుంది. ఒకవేళ ఈ టెస్ట్ ద్వారా కోవిడ్ 19 పాజిటీవ్ అని తేలితే మళ్లీ ఆర్‌టీ-పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదని ఐసీఎంఆర్ తేల్చినట్టు మైల్యాబ్ డైరెక్టర్ సుజీత్ జైన్ తెలిపారు.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Covid test, Covid-19, Flipkart

    తదుపరి వార్తలు