• Home
  • »
  • News
  • »
  • technology
  • »
  • MWC 2019 XIAOMI LAUNCHES THE MI MIX 3 5G THE WORLDS FIRST CONSUMER 5G SMARTPHONE SS

MI MIX 3 5G: తొలి 5జీ స్మార్ట్‌ఫోన్ లాంఛ్ చేసిన షావోమీ... ఫీచర్లు ఇవే

MI MIX 3 5G: తొలి 5జీ స్మార్ట్‌ఫోన్ లాంఛ్ చేసిన షావోమీ... ఫీచర్లు ఇవే

MI MIX 3 5G | స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్‌తో వస్తున్న ఈ ఫోన్‌ ర్యామ్, స్టోరేజీ వివరాలు తెలియాల్సి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడే మార్కెట్లోకి రాదు. 2019 మేలో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రానుంది.

  • Share this:
    2జీ, 3జీ తర్వాత ఇప్పుడు 4జీ హవా నడుస్తోంది. ఇక త్వరలో 5జీ దుమ్మురేపబోతోంది. అందుకే స్మార్ట్‌ఫోన్ కంపెనీలన్నీ 5జీపై దృష్టిపెట్టాయి. తొలి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేసింది షావోమీ. మొబైల్ వాల్డ్ కాంగ్రెస్‌ ఈవెంట్‌లో 5జీ రెడీ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ముందే ఊహించినట్టుగా 5జీ వర్షన్ ఎంఐ మిక్స్ 3 లాంఛ్ చేసింది ఆ కంపెనీ. స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్‌తో వస్తున్న ఈ ఫోన్‌ ర్యామ్, స్టోరేజీ వివరాలు తెలియాల్సి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడే మార్కెట్లోకి రాదు. 2019 మేలో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రానుంది.


    ఎంఐ మిక్స్ 3 స్పెసిఫికేషన్స్
    డిస్‌ప్లే: 6.39 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే, 19.5:9 యాస్పెక్ట్ రేషియో, 2,340 x 1,080 రెజల్యూషన్
    ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 855
    రియర్ కెమెరా: 12+12 మెగాపిక్సెల్ ఏఐ కెమెరా
    ఫ్రంట్ కెమెరా: 24+2 మెగాపిక్సెల్ కెమెరా
    బ్యాటరీ: 3,800 ఎంఏహెచ్
    ధర: సుమారు రూ.48,000
    Vivo V15 Pro: 32 మెగాపిక్సెల్ పాప్-అప్ సెల్ఫీ కెమెరాతో వివో వీ15 ప్రో రిలీజ్


    ఇవి కూడా చదవండి:

    Realme 3: మార్చి 4న రియల్‌మీ 3 లాంఛింగ్

    RuPay Card: రూ.2 లక్షల ఇన్స్యూరెన్స్, మరెన్నో లాభాలు... రూపే కార్డ్ మీ దగ్గర ఉందా?

    Jobs: పది పాసైతే వాలంటీర్ ఉద్యోగం... నెహ్రూ యువ కేంద్ర సంఘటన్‌లో 12,000 పోస్టులు
    First published: