గతేడాది 5 కెమెరాలతో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేస్తామని నోకియా ప్రకటించినప్పుడు అంతా షాకయ్యారు. ఒక ఫోన్‌కు వెనుకవైపు 5 కెమెరాలు ఉండటం మామూలు విషయం కాదు. అసలు ఒకప్పుడు ఫోన్‌కు ఒక కెమెరా ఉండటమే గొప్ప. ఆ తర్వాత ఫ్రంట్ కెమెరా వచ్చింది. కొన్నాళ్లకు వెనుకవైపు రెండు, ముందువైపు రెండు కెమెరాలొచ్చాయి. ఇటీవల ట్రిపుల్ కెమెరా స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు నోకియా ఏకంగా వెనుకవైపు 5 కెమెరాలతో స్మార్ట్‌ఫోన్ లాంఛ్ చేసేసింది. అదే నోకియా 9 ప్యూర్‌వ్యూ. పెంటా కెమెరా సెటప్‌తో కొత్త ఫోన్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది నోకియా.
Read this: Flipkart Month-end Mobile Fest: ఫ్లిప్‌కార్ట్‌లో మళ్లీ మొదలైన స్మార్ట్‌ఫోన్ సేల్... ఆఫర్లు ఇవే
వెనుకవైపు ఏకంగా ఐదు కెమెరాలు ఉండటమే ఈ ఫోన్ ప్రత్యేకత. వెనుకవైపు మొత్తం ఏడు రింగ్స్ కనిపిస్తాయి. అందులో ఐదు కెమెరా లెన్సులు. రెండు 12 మెగాపిక్సెల్ RGB సెన్సార్లు, మూడు 12 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్లు ఉంటాయి. ఆరో రింగ్‌లో డ్యూయెల్ టోన్ ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్, ఏడో రింగ్‌లో డ్యూయల్ సెన్సార్ ఉన్నాయి. పెంటా-కెమెరా సెటప్‌తో వచ్చిన మొదటి ఫోన్ ఇదే. మొబైల్ వాల్డ్ కాంగ్రెస్ 2019 ఈవెంట్‌లో రిలీజైన ఈ ఫోన్... మార్చిలో మార్కెట్లోకి రానుంది. ఇండియాలో ఎప్పుడు రిలీజ్ అవుతుందో స్పష్టత లేదు.
Read this: MI MIX 3 5G: తొలి 5జీ స్మార్ట్‌ఫోన్ లాంఛ్ చేసిన షావోమీ... ఫీచర్లు ఇవే
నోకియా 9 ప్యూర్ వ్యూ స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6 అంగుళాల 2కే అమొలెడ్
ర్యామ్: 6 జీబీ ర్యామ్
ఇంటర్నల్ స్టోరేజ్: 128 జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్
రియర్ కెమెరా: రెండు 12 మెగాపిక్సెల్ RGB సెన్సార్లు, మూడు 12 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్లు
ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,150 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై
ధర: 699 డాలర్లు (సుమారు రూ.50,000)
Photos: అమరవీరుల స్మృతి చిహ్నం 'నేషనల్ వార్ మెమోరియల్'
ఇవి కూడా చదవండి:
Personal Finance: క్రెడిట్ కార్డుపై లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు మర్చిపోవద్దు
LIC Children's Policy: రోజుకు రూ.12... మీ పిల్లల భవిష్యత్తుకు భరోసా
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Android, Nokia, Smartphone