రోడ్డు మీద మొబైల్ చూస్తూ, నడుచుకుంటూ ఎదుటి మనుషుల్ని గుద్దేసిన వారిని చూశారా? స్మార్ట్‌ఫోన్ వాట్సప్ చెక్ చేసుకుంటూ ఎదురుగా కరెంట్ పోల్ చూసుకోకుండా తనుకున్న వాళ్లను చూశారా? ఫోన్‌లో తలదూర్చేసి పక్కన ఉన్నది ఎవరో కూడా తెలియని వాళ్లను చూశారా? ఇలాంటివాళ్లనే కాదు, ఇంకా చాలామందిని చూసే ఉంటారు మీరు. వాళ్లను మొబైల్ మానియాక్స్ అని ముద్దుగా పిలుచుకుంటుంటారు. మా వాడి చేతికి మొబైల్ ఇస్తే ఇక ప్రపంచాన్నే మరచిపోతాడు అనే మాటలు ప్రతి కుటుంబంలోనూ వినిపిస్తున్న రోజులివి. ఇదంతా వినడానికి ఏదో సరదాగా ఉన్నా, ఈ శైలి మానవుని ప్రాణాల మీదకు తెస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా పరిశోధనలు ఈ విషయాన్ని రుజువు చేశాయని లెక్కలతో సహా చెబుతున్నారు.
Moto G60: అదిరిపోయే ఫీచర్స్‌తో మోటోరోలా నుంచి రెండు స్మార్ట్‌ఫోన్లు రిలీజ్... ధర రూ.13,999 నుంచి
Google Nest Mini: రూ.99 ధరకే గూగుల్ నెస్ట్ మినీ స్మార్ట్ స్పీకర్... వారికి మాత్రమే
మొబైల్ ఫోన్ వినియోగం గురించి ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం డ్రైవర్లు మొబైల్స్ వాడటం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పింది. మొబైల్ వాడకుండా డ్రైవింగ్ చేసేవారి కంటే మొబైల్ చూస్తూ డ్రైవింగ్ చేస్తే ప్రమాదాల భారిన పడే అవకాశం నాలుగు రెట్లు ఎక్కువగా ఉందనేది డబ్ల్యూహెచ్‌వో నివేదిక సారాంశం. మొబైల్ వాడుతూ డ్రైవింగ్ చేయడం పని మీద నుండి దృష్టి మరలడం కారణమని పరిశోధకులు చెబుతున్నారు.
Oppo A54: ఇండియాలో రిలీజైన ఒప్పో ఏ54... ధర ఎంతంటే
Samsung Galaxy A32: ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.3,000 తగ్గింది... రూ.1,500 డిస్కౌంట్ కూడా
డ్రైవింగ్ లోనే కాదు నడకలోనూ ఈ సమస్య కనిపిస్తుంది. వందలో 17 మంది యువతీయువకులు మొబైల్ చూస్తూనో, కాల్ మాట్లాడుతూనో ఎదురుగా వస్తున్న మనిషి లేదా ఉన్న వస్తువును చూడకుండా గుద్దుకుంటున్నారట. మరోవైపు మొబైల్ ప్రభావం క్లాస్ రూమ్‌లోనూ ఎక్కువగా కనిపిస్తోందని ఓహియో విశ్వవిద్యాలయం చెబుతోంది. చదువుకునేటప్పుడు మొబైల్‌లో మెసేజ్‌లు పంపుతూ, కాల్స్ మాట్లాడే విద్యార్థులు తక్కువ మార్కులు తెచ్చుకుంటున్నారట. అదే సమయంలో మొబైల్‌ను పెద్దగా వినియోగించని విద్యార్థులకు ఎక్కువ మార్కులు వస్తున్నాయట.
మొబైల్ ఫోన్ అతి వినియోగంపై వస్తున్న ఈ నివేదికలను పరిశీలించి... దీనిపై చర్యలు ప్రారంభిస్తే బాగుంటుందని నివేదికలు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్స్ వినియోగాన్ని నిషేధిస్తూ కొత్త రూల్ తీసుకొచ్చే దిశగా బ్రిటన్ ప్రభుత్వం ఆలోచిస్తోందని సమాచారం. అంతేకాకుండా డ్రైవింగ్ సమయంలో రెండు చేతులూ కచ్చితంగా ఉపయోగించేలా ఆ రూల్‌ను సిద్ధం చేస్తున్నారట. పనిలోపనిగా రోడ్డుపై నడుస్తున్నప్పుడు కూడా ఇలాంటి రూల్ తీసుకొస్తే బాగుంటుంది కదా. అయితే మన దేశంలో ఇలాంటి రూల్ ఎప్పటికి వస్తుందో తెలియడం లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health Tips, Mobile, Mobile News, Mobiles, Smartphone, Smartphones