Home /News /technology /

MULTIPUL CONTACTS SHARING SHARE MORE THAN ONE CONTACT ON WHATSAPP FOLLOW THESE STEPS GH VB

Multipul Contacts Sharing: వాట్సాప్‌లో ఒకటి కంటే ఎక్కువ కాంటాక్ట్స్‌ను షేర్ చేయాలా..? ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

వాట్సాప్‌లో వినియోగదారులతో చాట్ చేయడంతో పాటు ఫైల్స్‌ను ఈజీగా షేర్ చేయవచ్చు. అలాగే కాంటాక్ట్ నెంబర్లను ఇతరులకు సెండ్ చేయవచ్చు. Android లేదా iOS స్మార్ట్‌ఫోన్ నుంచి WhatsAppలో ఎక్కువ కాంటాక్ట్‌లను ఎలా పంపాలో తెలుసుకుందాం.

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో WhatsApp ఒకటి. Facebook యాజమాన్యం ఆధీనంలో ఇది పనిచేస్తుంది. ప్రతి రోజూ మిలియన్ల మంది యూజర్లు వాట్సాప్‌ను వినియోగిస్తున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌తో యూజర్లను ఆకట్టుకుంటుంది. వాట్సాప్‌లో వినియోగదారులతో చాట్ చేయడంతో పాటు ఫైల్స్‌ను ఈజీగా షేర్ చేయవచ్చు. అలాగే కాంటాక్ట్ నెంబర్లను ఇతరులకు సెండ్ చేయవచ్చు. Android లేదా iOS స్మార్ట్‌ఫోన్ నుంచి WhatsAppలో ఎక్కువ కాంటాక్ట్‌లను ఎలా పంపాలో తెలుసుకుందాం.

స్టెప్1: ముందుగా ఆండ్రాయిడ్ లేదా iOS స్మార్ట్ ఫోన్‌లో వాట్సాప్ యాప్ ను ఓపెన్ చేయాలి

స్టెప్2: మీరు సెండ్ చేయాలనుకుంటున్న కాంటాక్ట్ వ్యక్తిగత చాట్ లేదా గ్రూప్ చాట్‌పై ట్యాప్ చేయండి.

Post Office Deposits: పోస్టాఫీస్ లో అధిక వడ్డీ అందించే పథకాలు ఇవే.. వాటిపై ఓ లుక్కేయండి..


స్టెప్3: మీ దగ్గర ఉన్నది ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ అయితే మెసేజ్ బాక్స్ లోని పేపర్‌స్లిప్ ఐకాన్‌పై ట్యాప్ చేయండి. అదే ఆపిల్ ఫోన్ అయితే స్క్రీన్ దిగువన ఉన్న ‘+’ ఐకాన్‌‌ను నొక్కాల్సి ఉంటుంది.

స్టెప్4: మెనులోకి వెళ్లి కాంటాక్ట్‌ను ట్యాప్ చేయండి.

స్టెప్5: మీకు కాంటాక్ట్ లిస్ట్ మొత్తం కనిపిస్తుంది. అందులో మీరు షేర్ చేయాలనుకున్న వాటిని సెలక్ట్ చేయండి.

6. చివరగా సెండ్ బటన్‌ను నొక్కండి. దీంతో సెలెక్ట్ కాంటాక్ట్స్ షేర్ అవుతాయి.

ఫోటోలు లేదా వీడియోలను షేర్ చేసే విధానంలో రీడిజైన్ కోసం వాట్సాప్ పనిచేస్తోంది. WABetaInfo నివేదిక ప్రకారం... WhatsApp కోసం రీడిజైన్ చేసిన మీడియా పిక్చర్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. WABetaInfo షేర్ చేసిన స్క్రీన్‌షాట్‌ల ప్రకారం... WhatsApp రెండు కొత్త ట్యాబ్‌లను చూపుతుంది. రీసెంట్స్, గ్యాలరీ. వినియోగదారులు తమ స్టేటస్‌లో లేదా కాంటాక్ట్‌లతో షేర్ చేయాలనుకుంటున్న విషయాన్ని సులభంగా ఎంచుకోవడమే దీని లక్ష్యం. ఫోన్ గ్యాలరీకి జోడించిన అన్ని ఫోటోలు, వీడియోలు, GIFలను రీసెంట్ ట్యాబ్ కూడా చూపుతుంది.

యూజర్ల భద్రతకు పెద్దపీఠ వేస్తూ ఎండ్‌ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను తీసుకొచ్చిన వాట్సాప్‌... తాజాగా ఫేక్‌ న్యూస్‌కు చెక్‌ పెట్టే ప్రయత్నం చేస్తోంది. యూజర్ పంపించే మెసేజ్‌ ఎక్కువ సార్లు ఫార్వర్డ్‌ అయితే సదరు మెసేజ్‌కు ఫార్వార్డ్‌ అనే ట్యాగ్‌లైన్‌ కనిపిస్తుంది. అయితే ఇకపై ఎలా పడితే అలా మెసేజ్‌లను అన్ని గ్రూప్‌ల్లోకి ఫార్వర్డ్ చేయడం నిరోధించడం కోసం మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే పనిలో వాట్సాప్ ఉంది.

CBSE 12th CLASS: సీబీఎస్‌ఈ 12వ తరగతి టర్మ్1 ఫలితాలపై అభ్యంతరాలు ఉన్నాయా..? ఇలా ఫిర్యాదు చేయండి..


ఈ కొత్త ఫీచర్‌తో వాట్సాప్‌ యూజర్లకు మెసేజ్‌లను ఒకటి కంటే ఎక్కువ గ్రూపుల్లోకి ఫార్వర్డ్‌ చేయడాన్ని నియంత్రిస్తుంది. దీంతో యూజర్ ఒక గ్రూప్‌ కంటే ఎక్కువ గ్రూప్స్‌లోకి మెసేజ్‌లను ఒకే సమయంలో ఇకపై ఫార్వర్డ్‌ చేయలేరు. దీంతో ఫేక్‌ న్యూస్‌కు అడ్డుకట్ట వేయొచ్చని వాట్సాప్‌ భావిస్తోంది. అయితే ఈ సరికొత్త ఫీచర్‌ తొలుత వాట్సాప్‌ బీటా వెర్షన్‌ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. దీంతో యూజర్లను ఒకేసారి రెండు గ్రూప్‌లలోకి మెసేజ్‌ను ఫార్వర్డ్‌ చేయలేడు. కానీ, అదే మెసేజ్‌ను కాపీ చేసి ఇతర గ్రూప్‌లో షేర్‌ చేసే అవకాశాన్ని వాట్సాప్ పరిశీలిస్తోంది.
Published by:Veera Babu
First published:

Tags: New feature, New features, Whatsapp, Whatsapp tricks

తదుపరి వార్తలు