హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Mozilla Firefox: ఫైర్‌ఫాక్స్‌ బ్రౌజర్‌ యూజర్లకు గుడ్‌న్యూస్.. యాంటీ-ట్రాకింగ్ టూల్‌ లాంచ్..

Mozilla Firefox: ఫైర్‌ఫాక్స్‌ బ్రౌజర్‌ యూజర్లకు గుడ్‌న్యూస్.. యాంటీ-ట్రాకింగ్ టూల్‌ లాంచ్..

Mozilla Firefox

Mozilla Firefox

Mozilla Firefox: మొజిల్లా టోటల్ కుకీ ప్రొటెక్షన్ (Total Cookie Protection) అనే సొంత యాంటీ-ట్రాకింగ్ టూల్‌ను ఆండ్రాయిడ్ ఫోన్లకు విస్తరించింది. పర్సనలైజ్డ్‌ యాడ్స్ చూపించడానికి మీ వెబ్ యాక్టివిటీని ట్రాక్ చేయకుండా వెబ్‌సైట్లను అడ్డుకోవడంలో ఈ టూల్ కీలక పాత్ర పోషిస్తుంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

యూజర్ల ప్రైవసీకి ఎప్పుడూ సపోర్ట్ చేసే మొజిల్లా (Mozilla) ఫైర్‌ఫాక్స్‌ బ్రౌజర్ (Firefox Browser)ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఈ నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఆన్‌లైన్ ప్రైవసీని కాపాడేందుకు ఫైర్‌ఫాక్స్‌ బ్రౌజర్‌లో కొత్త టూల్స్, టెక్నాలజీలను అందిస్తుంది. తాజాగా మొజిల్లా టోటల్ కుకీ ప్రొటెక్షన్ (Total Cookie Protection) అనే సొంత యాంటీ-ట్రాకింగ్ టూల్‌ను ఆండ్రాయిడ్ ఫోన్లకు విస్తరించింది. పర్సనలైజ్డ్‌ యాడ్స్ చూపించడానికి మీ వెబ్ యాక్టివిటీని ట్రాక్ చేయకుండా వెబ్‌సైట్లను అడ్డుకోవడంలో ఈ టూల్ కీలక పాత్ర పోషిస్తుంది. ఫైర్‌ఫాక్స్‌ 111 అప్‌డేట్ ఇన్‌స్టాల్ చేసుకున్న ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఈ ఫీచర్ లభిస్తుంది. TCP టూల్ డిఫాల్ట్‌గా ఆన్ అయి ఉంటుంది. తద్వారా అందరికీ ప్రైవసీ మెరుగుపడుతుంది.

నిజానికి మొజిల్లా 2018 నుంచి టోటల్ కుకీ ప్రొటెక్షన్ (TCP) ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇది మొదటిసారిగా 2021లో విండోస్, మ్యాక్, Linuxలోని డెస్క్‌టాప్ వెబ్ బ్రౌజర్‌లకు విడుదల అయింది. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌ల ఆండ్రాయిడ్ ఫోన్లకు ఇది రిలీజ్ అవుతోంది. మొజిల్లా క్రమంగా ఆండ్రాయిడ్ ఫోన్‌లలో TCPని విడుదల చేస్తోంది.

వచ్చే నెలలో అందరికీ ఈ ఫీచర్ రిలీజ్ కావచ్చు. గూగుల్ ఈ సంవత్సరం ఇలాంటి ప్రైవసీ ఫీచర్‌నే ప్రారంభించాల్సి ఉంది, కానీ ఇప్పట్లో ఆ ఫీచర్ విడుదలయ్యేలా లేదు. రిపోర్ట్స్ ప్రకారం గూగుల్ యాంటీ ట్రాకింగ్ టూల్‌ను 2024లో పరిచయం చేయవచ్చు. ఇక మొజిల్లా కొత్త టూల్ లక్షల మంది ఆండ్రాయిడ్ యూజర్ల ఆన్‌లైన్ ప్రైవసీని కాపాడుతుంది.

టోటల్ కుకీ ప్రొటెక్షన్ (TCP) ఫీచర్ కుకీస్‌ను వెబ్‌సైట్‌కే పరిమితం చేస్తుంది. వివిధ వెబ్‌సైట్లలోని కుకీస్‌మిమ్మల్ని ట్రాక్ చేయకుండా వాటిని నిరోధిస్తుంది. యూజర్ ఓపెన్ చేసి ప్రతి సైట్ కోసం ఒక సపరేట్ కుకీస్ స్టోరేజ్‌ (Separate Cookie Jar)ను ఉపయోగించి వాటిని అడ్డుకుంటుంది. ఈ విధంగా, టార్గెటెడ్ యాడ్స్ కోసం ట్రాకర్లు మీ బ్రౌజింగ్ యాక్టివిటీ గురించి డేటాను సేకరించలేరు.

మొజిల్లా పర్సనలైజ్డ్‌ యాడ్స్ కోసం వెబ్‌సైట్స్‌ యూజర్ల ఆన్‌లైన్ యాక్టివిటీని ట్రాకింగ్ చేయడాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. గత నెలలో ఆండ్రాయిడ్ ఫైర్‌ఫాక్స్‌లో URLని షేర్ చేయడానికి, ఆర్టికల్స్ లిస్ట్‌ చేయడానికి ముందు ట్రాకింగ్ ఎలిమెంట్లను తీసివేయడానికి కొత్త ఎక్స్‌టెన్షన్స్‌ జోడించింది.

ఇది కూడా చదవండి :కంపెనీలు పాత ఐఫోన్‌లను ఎందుకు సేకరిస్తున్నాయి? వాటితో ఏం చేస్తారో తెలుసా?

మరోవైపు మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌ "Relay" అనే కొత్త ఫీచర్‌ని పరీక్షిస్తోంది. ఇది ఒక ఈమెయిల్ ప్రాక్సీ సర్వీస్. ఈ సర్వీస్ కొన్ని వెబ్‌సైట్లలో సైన్-అప్ ప్రక్రియలో ఎగ్జిస్టింగ్ ప్రాక్సీ ఈమెయిల్ అడ్రస్‌ను ఉపయోగించమని లేదా కొత్తదాన్ని సృష్టించమని వినియోగదారులను అడుగుతుంది. ఈ ఫీచర్ ఈ ఏడాది చివర్లో వినియోగదారులకు, వెబ్‌సైట్‌లకు రావచ్చు. వినియోగదారులు తమ ఈమెయిల్ అడ్రస్‌ను ప్రకటనలు లేదా ఇతర ప్రయోజనాల కోసం షేర్ చేయకుండా లేదా థర్డ్-పార్టీ కంపెనీలకు విక్రయించకుండా సంరక్షించడమే ఈ ఫీచర్ లక్ష్యం.

First published:

Tags: New feature, Privacy, Tech news

ఉత్తమ కథలు